సత్యకుమార్ యాదవ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ పేరు ఇప్పుడు సంచలనం. అనంతపురం జిల్లా ధర్మవరం నుండి అనూహ్యంగా పోటీకి దిగడమే కాకుండా అక్కడ తిరుగులేదు అనుకున్న కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి మీద అదీ బీజేపీ తరపున పోటీ చేసి 3734 ఓట్ల స్వల్ప మెజారిటీతో సంచలన విజయం సాధించాడు. ఇప్పుడు ఏకంగా బాబు క్యాబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. బీజేపీ తరపున గెలిచిన ఎనిమిది మందిలో …
Read More »24 మందితో చంద్రబాబు కేబినెట్ లిస్ట్
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం నేడు కొలువుదీరనున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 11.47 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కేబినెట్ లో ఉండబోయే మంత్రులు ఎవరు అన్నదానిపై నిన్న అర్ధరాత్రి వరకు చంద్రబాబు, పవన్ చర్చించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు చంద్రబాబుతోపాటు ప్రమాణం చేయనున్న 24 మంది మంత్రుల జాబితా …
Read More »బాబు జాబితాలో సీనియర్లకు దక్కని చోటు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో పలువురు సీనియర్లకు క్యాబినెట్ లో స్థానం దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. క్యాబినెట్ లో బెర్తు ఖాయం అని ఇప్పటికే వారికి ఫలానా శాఖ దక్కుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీనియర్లను పక్కన పెట్టడం విశేషం. బాబు క్యాబినెట్ లో ఈ సారి ఖచ్చితంగా చోటు లభిస్తుందనుకున్న వారిలో గోరంట్ల …
Read More »వైసీపీకి కలిసి రాని ‘విజయవాడ’ ..!
రాజకీయ నేతలకుకొన్ని కొన్ని సెంటిమెంట్లు ఉన్నట్టే.. పార్టీలకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి సెంటిమెంట్లు ప్రస్తావనకు వస్తున్నాయి. పార్టీ పెట్టిన తర్వాత.. వైసీపీ మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో గత 2019లో 22 చోట్ల విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక, మూడు చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. అయితే.. ప్రస్తుతం వైసీపీ నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం. కానీ, ఒక …
Read More »చిన్న నిర్ణయం..చంద్రబాబు క్రెడిట్ కొట్టేశారుగా!
అధికారంలోకి రావడం ఎంత కష్టమో.. ప్రజల్లో మంచి పేరు ఉత్తమ పేరు తెచ్చుకోవడం అంతకు నాలుగింతలు కష్టం. అందునా.. ప్రజల్లో ఆదిలోనే పేరు తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. కానీ.. ఈ క్రెడిట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు కొట్టేశారు. కక్ష పూరిత రాజకీయాలు.. నిర్ణయాలకు ఆయన చెక్ పెట్టారు. పార్టీ నాయకులకు ఆయన ఏం చెప్పారో.. ఇప్పుడు ఆయన ఆచరణలోనూ చేసి చూపిస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్న కూడా …
Read More »బాబు కేబినెట్ 21+3+1 లెక్క పక్కా!!
టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు కొలువులో కీలక పదవులు పంచేశారు. లెక్కను పక్కాగానే తేల్చేశారు. మొత్తం 175 మంత్రి ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక్కరు చొప్పున మంత్రులను కేటాయించారు. దీని ప్రకారం 134 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి 21 మంత్రి పదవులు దక్కాయి. ఇక, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు మూడు పదవులు చిక్కాయి. అదేసమయంలో పది స్థానాల్లో పోటీ చేసిన …
Read More »ఉత్తరాంధ్రలో వైసీపీ ఉండదా..?
ఒకే ఒక్క ఓటమి వైసీపీకి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీలోనూ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు కొందరు నాయకులు తమ రక్షణ తాము చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తరాది నాయకులు.. మరింత ముందుగా సేఫ్ దారులు వెతుక్కుంటున్నట్టు వైసీపీలోనే చర్చగా మారింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ మూడు ప్రాంతాల్లోనూ ఘోర పరాజయం పాలైంది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఓడిపోయింది. …
Read More »జగన్‌ను వదలని షర్మిల.. మళ్లీ కొత్త గేమ్ మొదలు పెట్టేసిందిగా…!
ఏపీలో తన సోదరుడి ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఇప్పుడు మరోసారి విజృంభించేందుకు రెడీ అవుతున్నారా? తెరవెనుక పూర్తిస్థాయిలో మంతనాలు సాగుతున్నాయా? ఆమె దూకుడుతో.. వైసీపీ మూలాలు కదిలిపోయే ప్రమాదం దాపురించిందా? అంటే ఔననే అంటున్నారు రాజకీయ పండితులు. రాష్ట్రంలో మారుతున్న పరిణామాలు.. కనిపిస్తున్న అవకాశాలు వంటివి పెద్ద ఎత్తున వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వైసీపీ అధికారం కోల్పోయి.. వారం …
Read More »ఏపీలో రియల్ బూమ్.. బాబు ప్రమాణం చేయకుండానే..!
నిన్న మొన్నటి వరకు గజం రూ.3500 ఉండగా.. ఇప్పుడు ఏకంగా 45000ల రూపాయలకు చేరిపోయింది. ఒకవైపు ప్రభుత్వం పూర్తిగా అధికారంలోకి రాకముందే.. అమరావతి ప్రాంతంలో బాగుచేతలు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో తుప్పు పట్టిపోయిన పరికరాలు.. దుమ్ము పట్టడాలను బాగు చేస్తున్నారు. ఇదేసమయంలో తుమ్మ చెట్లు కొట్టేస్తూ.. రహదారులను కూడా నిర్మిస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరోసారి కార్యకలాపాలు ప్రారంభించారు. ఇక, సమీపంలోని గుంటూరు, విజయవాడ నగరాల్లోనూ రియల్ …
Read More »కీలక ప్రాజెక్టులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలోని రెండు కీలక ప్రాజెక్టులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబును ఇప్పటికే ఎన్డీయే కూటమి పక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థిగా నాయకులు ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. అనంతరం కూటమి పార్టీలకు చెందిన ముఖ్య నేతల బృందం గవర్నర్ ను కలిసింది. తమను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరింది. దీనికి సంబంధించి గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అనంతరం.. బుధవారం ప్రభుత్వం ఏర్పడనుంది. కూటమి పార్టీల సమావేశంలో …
Read More »చంద్రబాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగులు…వైరల్ వీడియో
ఒక నాయకుడిని ప్రజలు నమ్మితే ఏం చేస్తారు? ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటారు…ఆయన పాలన కావాలని అనుక్షణం పరితపిస్తుంటారు…ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని ఎదురుచూస్తుంటారు…ఐదేళ్ల నిరీక్షణకు తెరపడే రోజు కోసం పరితపిస్తుంటారు…వారు కలలుగన్న క్షణం నిజమైన వేళ వారి ఆనందానికి అవధులుండవు..తమ అభిమాన, ఆరాధ్య నాయకుడు కళ్ల ముందు కనిపిస్తే వారి పరుగుకు పట్టపగ్గాలుండవు.. తన అభిమాన నాయకుడు, విజనరీ లీడర్, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనిపించగానే …
Read More »కేంద్రంలో ఏపీ మంత్రులు.. సాధించేందుకు స్కోప్ ఉందా?
కేంద్రంలో మంత్రి పదవి అంటే చాలా కీలకంగా భావిస్తారు. జాతీయ రాజకీయాల్లో ఉన్నవారు.. లేదా ఎంపీలుగా గెలిచిన వారు కేంద్రంలో మంత్రులుగా ఉండాలని కోరుకుంటారు. కనీసం.. సహాయ మంత్రి అయినా ఫర్వాలేదు .. అనుకుంటారు. గతంలో ఓ కీలక పార్టీ జాతీయ పార్టీలో విలీనం అయినప్పుడు కూడా సదరు నాయకుడు మంత్రి పదవినే కోరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న మంత్రి పదవులకు డిమాండ్ కూడా ఉంటుంది. …
Read More »