Political News

వైసీపీ లిక్క‌ర్ స్కామ్‌ను ‘ఈడీ’కి అప్ప‌గించారా?

తాజాగా గురువారం మ‌ధ్యాహ్నం నుంచి ఓ సంచ‌ల‌న వార్త‌.. మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఏపీలో వైసీపీ పాల‌నా కాలంలో జ‌రిగిన‌ట్టు ప్ర‌స్తుత‌ ప్ర‌భుత్వం, అధికారులు పేర్కొంటున్న లిక్క‌ర్ కుంభ‌కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్(ఈడీ) అధికారులు పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నార‌నేది వార్త సారాంశం. తెలంగాణ‌, ఏపీ, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఢిల్లీల‌లో ఈ దాడులు జ‌రుగుతున్నాయి. అంటే.. దీనిని బ‌ట్టి.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ట్టు సర్కారు చెబుతున్న మ‌ద్యం కుంభ‌కోణం కేసు విచార‌ణ‌కు …

Read More »

మిథున్‌రెడ్డిని కొట్టకండి: కోర్టు ఆదేశం

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసుల క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ.. విజ‌య‌వాడ లోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయ‌న‌ను రెండు రోజుల పాటు విచారించేందుకుఅనుమ‌తి ఇచ్చింది. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో కీల‌క నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి డిస్ట‌రీల నుంచి సొమ్ములు వ‌సూలు చేయ‌డంలోనూ.. టార్గెట్లు నిర్ణ‌యించ‌డంలోనూ ముఖ్య పాత్ర పోషించిన‌ట్టు ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు …

Read More »

జ‌గ‌న్ అసెంబ్లీకి రాకుంటే ఎవ‌రికి న‌ష్టం?

ప్ర‌జాప్ర‌తినిధులు బ‌య‌ట ఎన్ని మాట్లాడినా.. అసెంబ్లీలోను, పార్ల‌మెంటులోనూ మాట్లాడేదానికి ఒక విలువ‌.. ఒక రికార్డు ఉంటాయి. అంతేకాదు.. బ‌య‌ట ఎన్ని మాట్లాడినా ప్ర‌భుత్వం బుల్ డోజ్ చేయొచ్చు. కానీ.. అసెంబ్లీ, పార్ల‌మెంటులో మాట్లాడినా.. స‌భ్యులు ప్ర‌శ్న‌లు అడిగినా.. ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన స‌మాధానం చెప్పి తీరుతుంది. ఎందుకంటే.. ఈ రెండు సంస్థ‌లు కూడా రాజ్యాంగ బ‌ద్ధం. సో.. అందుకే.. పార్ల‌మెంటు, అసెంబ్లీల‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది.. మ‌న రాజ్యాంగం. మ‌రి అలాంటి …

Read More »

పెద్ద‌ల స‌భ‌లోకి అడుగు పెట్టిన నాగ‌బాబు.. కానీ, ఒంట‌రిగా!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వ కీల‌క భాగ‌స్వామ్య పార్టీ జ‌న‌సేన ముఖ్య నాయ‌కుడు, కొత్త ఎమ్మెల్సీగా ఇటీవ‌ల ఎన్నికైన కొణిదెల నాగ‌బాబు.. తొలిసారి శాస‌న మండ‌లిలోకి అడుగు పెట్టారు. గురువారం నుంచి అసెంబ్లీ, శాస‌న మండ‌లి వ‌ర్షాకాల సమావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ స‌మావేశాల‌కు.. నాగ‌బాబు తొలిసారి వ‌చ్చారు. దీనికి ముందు ఆయ‌న‌.. మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యానికి వెళ్లి.. పార్టీ అధినేత‌, త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లుసుకున్నారు. మండ‌లిలో ప్ర‌స్తావించాల్సిన …

Read More »

అయ్య‌న్న‌కు కోప‌మొచ్చిన వేళ‌.. ఏపీ అసెంబ్లీలో చిత్రం!

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మరోసారి కోపం వచ్చింది. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలి ప్రాధాన్య అంశంగా ప్రశ్నోత్తరాలు సమయానికి సమయం కేటాయిస్తారు. ఇది నిబంధనల ప్రకారం జరిగే కార్యక్రమం. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సభ్యులు ఏ ప్రశ్నలు అడిగారు.. మంత్రులు ఎలాంటి సమాధానం చెప్పారు.. అనే విషయాలను అసెంబ్లీ అధికారులు నమోదు చేసుకోవాలి. వాటిని రికార్డు …

Read More »

జీఎస్టీ రిఫార్మ్‌… ఏపీకీ గేమ్ ఛేంజ‌ర్‌: సీఎం చంద్ర‌బాబు

జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు రాష్ట్రానికి గేమ్ ఛేంజ్‌గా మార‌నున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అసెంబ్లీలో సుదీర్ఘ ఉపన్యాసం చేసిన ఆయ‌న‌.. జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌పై మాట్లాడారు. ప‌న్నుల త‌గ్గింపుతో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని తెలిపారు. గ‌తంలో ప‌న్నుల‌ను స‌ర‌ళీక‌రించ‌డం ద్వారా ప్ర‌స్తుతం 2 ర‌కాల శ్లాబుల‌కు మాత్రమే ప‌రిమితం చేశార‌న్నారు. తద్వారా కొనుగోలు శ‌క్తి పెరుగుతుంద‌న్నారు. ధ‌ర‌లు త‌గ్గ‌డంతో ఆయా వ‌స్తువుల కొను గోలు పెరిగి.. అదేస‌మ‌యంలో రాష్ట్రానికి కూడా …

Read More »

మార్షల్స్ పై లోకేష్ ఆగ్రహం.. రీజనేంటి?

అసెంబ్లీ మార్షల్స్ పై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రస్తుతం ఉన్నది వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నారా?” అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, మార్షల్స్ హెడ్‌ను తన కార్యాలయానికి రావాలని కూడా సూచించారు. దీంతో మార్షల్స్ హెడ్ ఆయనను కలిసి వివరణ ఇచ్చారు. ఇక నుంచి ఇలాంటివి జరగబోవని హామీ ఇచ్చారు. అయితే ఇక నుంచి ఈ ఘటనలు రిపీట్ అయితే సహించేది లేదని నారా లోకేష్ తేల్చిచెప్పారు. …

Read More »

టీడీపీలో గ్రీష్మ‌.. ఏం చేస్తున్నారు చెప్మా.. !

టిడిపి అధినేత సీఎం చంద్రబాబు ఎవరికైనా పదవులు ఇచ్చినా.. ఎవరికైనా అవకాశాలు కల్పించినా.. వారి నుంచి మరింత ప్రయోజనం ఆశిస్తారు. ఇది సహజం. రాజకీయాలైనా వ్యాపారమైనా ఒక రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలు ఆదాయాన్ని కోరుకున్నట్టుగానే ఒక వ్యక్తికి ఏదైనా పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి ద్వారా ఆ పార్టీ ప్రయోజనాలు.. ఆ పార్టీకి సంబంధించిన అనుకూల అంశాలను కోరుకోవడం తప్పేమీ కాదు. ఇది ఆది నుంచి జరుగుతున్న …

Read More »

ఏపీ అసెంబ్లీ: వారు రారు.. వీరూ లేరు!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. వర్షాకాల సమావేశాల్లో కీలకమైన నాలుగు బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో సభకు అందరూ రావాలని పదేపదే స్పీకర్ అయ్య‌న్న పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా అధికారులు కూడా ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు. వైసిపి ఎలాగూ రావడం లేదు. కాబట్టి ఆ పార్టీ నాయకులను ఆ పార్టీ అధినేతను కూడా …

Read More »

స‌ర్కారు లెక్క‌: 10 వేల కోట్లు ఉంటే ప‌రిష్కారం.. !

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను గమనిస్తే ప్రభుత్వం పై విమర్శలు పెరుగుతున్నాయి. అదేవిధంగా నిరసనలు ఉద్యమాలు కూడా తెరమీదకు వస్తున్నాయి. మరి వీటికి కారణం ఏంటి అంటే జస్ట్ పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సమస్యలు ఉండవన్నది అధికారులు తాజాగా చెబుతున్న మాట. ప్రస్తుతం రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. వైసీపీ హయంలో మూడు క్వార్టర్లు ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో మూడు క్వార్టర్ల ఫీజును విద్యార్థులకు …

Read More »

స‌భ‌కు రాకుంటే.. జీతం క‌ట్‌: అసెంబ్లీ కీల‌క తీర్మానం!

అసెంబ్లీకి రాకుండా వేతనాలు తీసుకోవడంతో పాటు తరచుగా గైర్హాజరవుతూ ఏదో మొక్కుబడిగా సభకు వచ్చే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ముందు మంత్రులు, పార్టీ విప్‌లు, అదేవిధంగా ముఖ్య నాయకులతో సమావేశమైన చంద్రబాబు నాయుడు, వైసీపీ నాయకులు సభకు రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సభకు రాకుండా జీతాలు తీసుకోవడం సరికాదన్నది.. గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న …

Read More »

వైసీపీ కీల‌క నాయ‌కురాలి ‘సైడ్ విజ‌న్‌.. !’

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికీ ఎలాంటి అవకాశం వస్తుందో.. ఎవరు ఎటువైపు మారుతారో అనేది చెప్పడం కష్టం. ‘అవసరం-అవకాశం’ అనే రెండు పట్టాలపై ప్రయాణం చేసే రాజకీయ నాయకులు.. తమ అవసరానికి తగిన విధంగా రాజకీయాలను మార్చుకోవడం అనేది పార్టీలు మారడం అనేది తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీకి చెందిన ఎం ఎల్ సి ఒకరు టిడిపికి టచ్ లోకి వెళ్లారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల …

Read More »