పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పిన తర్వాత వైసీపీ మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డికి పెద్ద చిక్కే వచ్చి పడ్డట్టు ఉంది. తనకు సంబంధించిన ఏ చిన్న వార్త, ఎక్కడ కనిపించినా ఆయన హడలిపోతున్నారు. ఆ వెంటనే వివరణలు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా ఎక్స్ వేదికగా ఓ వివరణ పోస్ట్ చేసిన సాయిరెడ్డి… తాజాగా శుక్రవారం రాత్రి కూడా మరో వివరణతో కూడిన పోస్టును పెట్టారు. ఇందులో …
Read More »అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు వెనుకంజ వేసిన సంగతి తెలిసిందే. జగన్ విధ్వంసకర పాలన వల్ల భయపడిన ఐటీ కంపెనీలు మరియు ఇతర పరిశ్రమలు రాష్ట్రానికి రావడానికి మొహమాటపడాయి. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, బీజేపీ, జనసేన కూటమి గెలిచిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే, ఆయన బ్రాండ్ ఇమేజ్ చూసి పెట్టుబడిదారులు ఏపీలో పెట్టుబడులు …
Read More »1న రావల్సిన పింఛను 31నే వచ్చేస్తే
“నిన్నటితో నేను వాడే మందులు అయిపోయాయి. చేతిలో రూపాయి లేదు. నాకా.. పిల్లల్లేరు. ఒక్కదాన్నే బతుకుతున్నా. ఏం చేయాలో తోచలేదు. పింఛన్‌పైనే ఆధారపడి బతుకుతున్నా. రేపు ఆదివారం కావడం తో పింఛను ఆలస్యం అవుతుందన్నారు. కానీ.. ఇంతలోనే చంద్రబాబు నాకు పింఛను పంపించాడు. నా ప్రాణాలు కాపాడాడు. ఈ డబ్బులతో మందులు కొనుక్కుంటా.” అని విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట నియోజకవర్గానికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు ఆనందం వ్యక్తం …
Read More »మీరేమైనా చేయండి.. జనం మన గురించే మాట్లాడాలి: చంద్రబాబు
“మీరు ప్రజల వద్దకు వెళ్లండి. లేదా మరేదైనా చేయండి. కానీ, జనం మాత్రం మన గురించి.. మన ప్రభుత్వం గురించే మాట్లాడు కోవాలి. ప్రభుత్వం అందించే సంక్షేమంపైనే చర్చ జరగాలి. ఇది మీ బాధ్యత.” అని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లకు, ఎమ్మెల్యే లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే నెల 12తో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోందని.. ఈ నేపథ్యం లో 1వ తేదీ నుంచే …
Read More »బాబును రెండోసారీ జైలుకు పంపేవాళ్లం: సజ్జల
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును నాటి వైసీపీ సర్కారు అరెస్టు చేసిన ఫలితం… కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. బాబు అరెస్టుతో జనం వైసీపీ పాలనపై భయాందోళనలకు గురయ్యారు. ఫలితంగా గంపగుత్తగా టీడీపీ నేతృత్వంలోని కూటమికి ఓట్లు వేసి… రికార్డు మెజారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికీ వైసీపీ గుర్తించనట్లే ఉంది. ఎందుకంటే… ఇప్పటికీ ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చేస్తున్న …
Read More »‘ఈటలతో భేటీ’ – కాంగ్రెస్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్
తెలుగు నేల రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న బీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యర్థుల ఆరోపణలను పెద్దగా పట్టించుకోరు. సదరు ఆరోపణలు ఒకింత ఘాటుగా ఉన్నా కూడా నేరుగా మీడియా ముందుకు వచ్చి… వాటిని ఖండించడం, తన వ్యక్తిత్వం ఏమిటో చెబుతూ సాగడం ఆయన తీరు. దాదాపుగా ఏ నేత గురించిన వ్యక్తిగత విమర్శల జోలికి హరీశ్ రావు వెళ్లరనే చెప్పాలి. …
Read More »మహానాడు చూశాక.. వైసీపీలో మార్పులు తప్పవా..!
కడప గడ్డపై టీడీపీ నిర్వహించిన పసుపు పండుగ మహానాడు చూశాక.. తమ పార్టీలోనూ మార్పులు చేయక తప్పదన్న సంకేతాలను వైసీపీ నాయకులు వెలిబుచ్చుతున్నారు. ఒక మార్పు మంచిదే అన్నట్టుగా నాయకులు గుసగుసలాడుతున్నారు. బలమైన గళం, ప్రత్యర్థులను వెంటాడడం, ప్రజలను మానసికంగా సంసిద్ధులను చేయడం వంటివి మహానాడులో స్పష్టంగా కనిపిస్తున్నాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇది చాలా జోరుగా, తీవ్రంగానే జరుగుతోంది. “మేం ఊహించిన దానికంటే మహానాడు బాగానే జరిగింది. మా …
Read More »జగన్ తెలుసుకోవాల్సిన చంద్రబాబు విశ్వరూపం..!
రాజకీయాల్లో నాయకులు ఉంటారు. వారికి ప్రత్యర్థులు కూడా ఉంటారు. అయితే.. ఎవరు ఎలాంటి వారు? అనేది తెలుసుకోవడం నాయకులకు.. పార్టీలకు కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయంలో చాలా మంది నాయకులు తప్పులు చేస్తుంటారు. అందుకే.. వెనుకబడి పోతుంటారు. కానీ.. ఈ వ్యవహారంలో రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు స్టయిల్ వేరు. ఆయన దూకుడు వేరు. ఒకరకంగా చెప్పాలంటే.. చంద్రబాబు విశ్వరూపమే వేరు. ఈ విషయాన్ని జగన్ అంచనా …
Read More »ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్… సాధ్యమేనా ..!
కడపలో నిర్వహించిన మహానాడు చివరి రోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. సాధారణంగా చంద్రబాబు మైకు పట్టుకుంటే వదిలే రకం కాదన్న భావన ఉంది. ఈ దఫా కూడా అదే జరిగింది. అయితే.. ఈ సారి మైకు పట్టుకుని గంటల తరబడి ఆయన ప్రసంగించినా.. మెరుపులు కురిపించారు. ప్రజల్లో అభివృద్ధి బీజాలు వేశారు. దీంతో కృతకంగా సాగుతుందని ముందు అనుకున్నా.. చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం …
Read More »మా పిల్లలకు అవకాశాలివ్వండి – సీఐఐకి బాబు ఆఫర్
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ వార్షిక సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానంతో హాజరైన ఆయన, ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా ఒక విజనరీగా కీలక ప్రసంగం చేశారు. తన ఆలోచనలను ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో పంచుకున్నారు. ప్రధానంగా రెండు అంశాలపై ఆయన దృష్టి పెట్టారు: సంపద సృష్టి, పెట్టుబడులు. సంపద సృష్టి పారిశ్రామిక వేత్తల కారణంగానే సాధ్యమవుతుందని, సంక్షేమ పథకాల అమలుకు …
Read More »నిజమా?… హరీశ్, ఈటెల భేటీ అయ్యారా?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రోజుకో సరికొత్త పరిణామం చోటుచేసుకుంటూ ఉంది. మొన్నటిదాకా అంతగా పెద్ద సంచలనాలేమీ లేకుండానే సాగిన తెలంగాణ రాజకీయం ఇప్పుడు రోజుకో సంచలనాన్ని తీసుకొస్తూ కాక రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన పగుళ్లపై విచారణకు ఆదేశాలు జారీ చేయగా… ఆ విచారణ కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఆయన మేనల్లుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ …
Read More »బాబు లెక్క తో జగన్ జాగ్రత్త పడాలి
మహానాడు వేదికగా చంద్రబాబు గర్జన విన్నాక.. ప్రత్యక్షంగా చూశాక.. ఆయన ఉద్దేశం స్పష్టంగా తెలిసిపోయింది. కడప జిల్లా ఎవరి సొత్తూ కాదని తేల్చేశారు. ఇక నుంచి కడప కేంద్రంగానే చంద్రబాబు రాజకీయాలు సాగించనున్నారన్న సందేశం స్పష్టంగా కనిపించింది. గండికోట ప్రాజెక్టు నుంచి కడప ఉక్కు కర్మాగారం వరకు చంద్రబాబు తన వ్యూహాలను వివరించారు. అంతేకాదు, బలమైన ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవడానికీ కృషి చేశారు. ఇది సాధారణంగా జగన్ ప్రభావం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates