ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత.. తొలి రౌండ్లలో 36 స్థానాలను ప్రకటించే సరికి వైసీపీకి ఒక్క సీటులో మాత్రమే లీడ్ కనిపించింది. 2019 ఎన్నికల్లో తొలి రౌండ్ నుంచి కూడా వైసీపీ దూకుడు ప్రదర్శించింది. పైగా.. వేల సంఖ్యలో లీడ్ కూటమి వైపు కనిపిస్తుండడం గమనార్హం. ఈ పరిణామం గమనిస్తే.. వైసీపీ వైపు ప్రజలు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూట మి దూకుడు …
Read More »ఏపీలో కూటమికే లీడ్!
ఏపీలో ప్రారంభమైన ఓట్ల కౌంటింగ్.. వేగంగా సాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలను ముందుగా లెక్కిస్తుండ గా.. మరికొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్ర వ్యాప్తగా కౌంటింగ్ కొనసాగు తోంది. తొలి అరగంటలోనే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతల లీడ్ కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కుప్పంలో చంద్రబాబు, నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పొంగూరు నారాయణ లీడ్‌లో …
Read More »అరెస్టుల కెక్కిన రేవ్ పార్టీ !
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏకంగా నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం విచారణకు హాజరయిన నటి హేమ రేవ్ పార్టీ ఆర్గనైజింగ్ కీలకపాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది. మొత్తం ఐదుగురితో కలిసి ఈ పార్టీ రేవ్ పార్టీని ప్లాన్ చేసిందని విచారణలో తేలింది. దీంతో నటి హేమను …
Read More »ఏపీలో షాకింగ్: ఎమ్మెల్సీ పై అనర్హత వేటు
ఏపీలో కీలకమైన ఓట్ల లెక్కింపునకు ముందు.. సంచలన సంఘటన చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. ఆయన పై వచ్చిన అభియోగాలను అన్ని కోణాల్లోనూ పరిశీలించిన తర్వాత.. ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు మోషేన్ రాజు తెలిపారు. ఈ మేరకు శాసన మండలి సెక్రటేరియెట్ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టం …
Read More »వైసీపీకి సుప్రీం లోనూ నిరాశే
ఏపీ అధికారపార్టీ వైసీపీకి కీలకమైన ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు కొన్ని గంటల ముందు.. సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగులు, ఇంటి నుంచి ఓట్లేసిన వృద్ధులు, దివ్యాంగుల ఓట్ల విషయంలో వైసీపీ ఆందోళనగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర హైకోర్టులో వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీనిని సుప్రీంకోర్టులోనూ …
Read More »గీత దాటితే .. తాట తీస్తారు
పోలింగ్ ముగిసిన అనంతరం ఏపీలో చెలరేగిన హింస నేపథ్యంలో మంగళవారం జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం భద్రతాచర్యలు కట్టుదిట్టం చేశారు. ఏపీవ్యాప్తంగా పెద్దఎత్తున కేంద్ర బలగాల మోహరించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్‌లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. ఏపీవ్యాప్తంగా కొనసాగుతున్న కార్డన్ సెర్చ్ నిర్వహించి రౌడీషీటర్లను బైండోవర్ చేసి కొందరిపై నగర బహిష్కరణ వేటు వేశారు. సమస్యాత్మక …
Read More »ప్రపంచ రికార్డు సృష్టించాం
దేశంలో జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొం ది. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో ఒక్క భారత్‌లోనే కనీ వినీ ఎరుగని రీతిలో.. 64.2 కోట్ల మంది ప్రజ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తాజాగా ఏడు దశల ఎన్నికలు పూర్తి కావడం.. మరికొన్ని గంటల్లోనే ఫలితం వెల్లడి …
Read More »పిన్నెల్లికి సుప్రీం దెబ్బ !
అరెస్ట్ నుండి హైకోర్టు ఉత్తర్వులతో తాత్కాలిక ఉపశమనం పొందిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్ రోజున సెంటర్‌కు వెళ్లొద్దని పిన్నెల్లిని ఆదేశించింది. పోలింగ్ రోజున మే 13 మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతోపాటు పిన్నెల్లి అరెస్ట్ కి మినహాయింపు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ ఏజెంట్ …
Read More »ఎగ్జిట్ లేదు.. బగ్జిట్ లేదు.. పోవాయ్!!: కేసీఆర్
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ లేదు.. బగ్జిట్ లేదు పోవాయ్! అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల అనంతరం.. ఆయన మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్‌ను ఆయన లైట్ తీసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను కొందరు మేనేజ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఉన్న విశ్వసనీయత ఇప్పుడు లేదన్నారు. “ఇదంతా …
Read More »కౌంటింగ్ రోజు ఏమైనా జరగొచ్చు..
“కౌంటింగ్ రోజు ఏమైనా జరగొచ్చు.. అందరూ అప్రమత్తంగా ఉండాలి“-ఇది ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు.. తన కూటమి పార్టీల అధినేత ల నుంచి నాయకుల వరకు చెబుతున్న మాట. అయితే.. ఇదే మాటను కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలోనూ వినిపించింది. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా.. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ వినిపిం చింది. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అయితే..ముఖ్యమంత్రులే ఈ ప్రకటన చేశారు. దీంతో అసలు …
Read More »2014 రికార్డు రిపీట్ చేయనున్న చంద్రబాబు!: ఎగ్జిట్ పోల్
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ప్రజల నాడిని పట్టుకోవడం.. అంత శులభం కాదు. వారి ఆలోచనా దోరణి ఎలా ఉంటుందనేది ఫలితం వచ్చాకే స్పష్టమవుతుంది. అయితే.. తాజాగా వచ్చిన మరో ఎగ్జిట్ పోల్ సర్వేలో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రధాని నరేంద్ర మోడీ 2014లో సాధించిన రికార్డును, అదేసమయంలో ఆ ఏడాది టీటీడీ సాధించిన రికార్డును ఇప్పుడు చంద్రబా బు రిపీట్ చేయనున్నట్టు ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ …
Read More »రేపే విడుదల – అసలైన రాజకీయ సినిమా
ఇంకో ఇరవై నాలుగు గంటల్లో తెలుగు ప్రజల మధ్య అత్యధిక స్థాయిలో రాబోతున్న చర్చ ఎన్నికల ఫలితాలు. తెలంగాణకు సంబంధించి కేవలం లోక్ సభకు మాత్రమే జరిగాయి కాబట్టి అంత ఫోకస్ ఉండకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం నేషనల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఎగ్జిట్ పోల్స్ అధిక శాతం టిడిపి, జనసేన, బిజెపి కూటమి విజయాన్ని ధృవీకరిస్తుండగా మరికొన్ని అధికార పీఠం వైసిపిదేనని చెప్పడం కొన్ని అనుమానాలు …
Read More »