ఏపీలో 11 సీట్లకే పరిమితమైనప్పటికీ వైసీపీ నేతల అరాచకాలు అంతకంతకూ పెరుగుతున్నాయని చెప్పేందుకు మరో నిలువెత్తు సాక్ష్యం ఇది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ ఎన్నికల్లో తనకు గట్టి పట్టున్న నెల్లూరు రూరల్ నుంచి మరోమారు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలతో సంబందం లేకుండా గెలుస్తూ వస్తున్న కోటంరెడ్డిని హత్య చేసేందుకు ఓ వైసీపీ నేత ఏకంగా భారీ ప్లానే వేశారు. ఆ వైసీపీ నేత ఎవరన్నది తెలియకున్నా… ప్లాన్ లో పాలుపంచుకునే వారి వివరాలు మాత్రం వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కొందరు రౌడీ షీటర్లు ఫుల్లుగా మందేసి, తూలుతూ కోటంరెడ్డిని హత్య చేస్తే మనకు డబ్బే డబ్బు అన్న మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ రౌడీ షీటర్లను రంగంలోకి దించింది మాత్రం పెలోర్ వివాదంలో రాష్ట్రవ్యాప్త గుర్తింపు పొందిన నిడిగుంట అరుణగా గుర్తించారు. ఇక రంగంలోకి దిగే రౌడీ షీటర్లలో అవిలేల శ్రీకాంత్, జగదీశ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు ఏపీలో పెను కలకలమే రేపుతోంది. కోటంరెడ్డి హత్యాయత్నానికి ముందే ఈ వీడియో బయటపడటంతో ఎమ్మెల్యేకు తగిన భద్రతను కల్పించారు. అయితే ఈ వీడియోపై కోటంరెడ్డి స్పందించేందుకు నిరాకరించారు.
ఇదిలా ఉంటే… నిడిగుంట అరుణను కోటంరెడ్డి హత్య దిశగా ఆమెను పురిగొల్పింది మాత్రం వైసీపీకి చెందిన ఓ కీలక నేతగా భావిస్తున్నారు. అనుకున్నట్లుగా కోటంరెడ్డిని హత్య చేయిస్తే వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదంటే సూళ్లూరుపేట ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తానని కూడా ఆయన ఆమెకు హామీ ఇచ్చారట. ఇంత పెద్ద హామీ రావడం, అప్పటికే తనకు ఓ గ్యాంగ్ ఉమెన్ గా గుర్తింపు రావడం గమనంలో పెట్టుకున్న అరుణ ఆ వైసీపీ నేత హామీకి ఠక్కున ఒప్పేసుకుందట. ఏ విషయంలోనూ ఏమాత్రం ఆలస్యం చేయని అరుణ… వైసీపీ హామీ ఇచ్చిన వెంటనే రంగంలోకి దిగేసి… రౌడీ షీటర్లను ఏర్పాటు చేసి, వారికి భారీ మొత్తం ఆపర్ చేసినట్టు సమాచారం.
వాస్తవానికి విపక్షంలోకి వెళ్లిన పార్టీకి చెందిన నేతలు ఒకింత నెమ్మదిగా, బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అందుకు విరుద్ధం. ఇప్పటికే వైసీపీకి చెందిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి లాంటి కీలక నేలను అరెస్టు చేసినా కూడా ఆ పార్టీ నేతలు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. ఏకంగా అధికార పార్టీకి చెందిన కీలక నేత, బలమైన ఎమ్మెల్యేనే హత్య చేసే దిశగా పథకం రచించడం అంటే మాటలు కాదు. మరి దీనిపై అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు ఏ తరహా చర్యలు చేపడతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates