ఏపీలో 2019-24 మధ్య సాగిన వైసీపీ పాలనలో ప్రభుత్వ సలహాదారుల ఎంపిక ఏ రీతిన సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షిలో పనిచేసిన చాలా మంది జర్నలిస్టులకు ఆయన ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఇంకా లోతుగా వెళితే చాలానే ఉంది గానీ… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సలహాదారులుగా ఎంపిక చేస్తున్న వారి అర్హతలు, వారి పూర్వానుభవం, …
Read More »రేపే విచారణకు కేసీఆర్.. మేనల్లుడితో సుదీర్ఘ చర్చ
తెలంగాణ రాజకీయాల్లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. భారత రాష్ట్ర సమతి (బీఆర్ఎస్) అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనా కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. అయితే ఆ ప్రాజెక్టులోని కీలక భాగం అయిన మేడిగడ్డ డ్యామ్ ఉపరితలం కుంగింది. దీనిపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఏకంగా విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి …
Read More »ఏలూరు ‘సాక్షి’ ఆఫీసుకు నిప్పు.. ఎవరి పని?!
ఏలూరు జిల్లాలోని ‘సాక్షి’ కార్యాలయానికి కొందరు దుండగులు నిప్పంటించారు. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడి.. ఫర్నిచర్ సహా.. పలు కీలకవస్తువులు, వాహనాలు కూడా దహనమయ్యాయి. అయితే.. ఈ ఘటనపై రెండు రకాల వాదనలు తెరమీదికి వచ్చాయి. ఇదంతా టీడీపీ తరఫున నిరసనల పేరుతో అరాచకాలకు దిగిన వారి పనేనని సాక్షి ప్రతినిధులు చెబుతు న్నారు. పోలీసులు కూడా అక్కడే ఉన్నా.. ఎవరినీ అదుపు చేయలేదని.. నిప్పు పెట్టి …
Read More »సుపరిపాలన-స్వర్ణాంధ్ర.. 12న వేడుక!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12కు ఏడాది పూర్తవుతుంది. వాస్తవానికి ఎన్నికల ఫలితం వచ్చింది జూన్ 4నే అయినా.. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది మాత్రం గత ఏడాది జూన్ 12న. దీంతో ఈ నెల 12నాటికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పార్టీల పరంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు రెడీ అయ్యాయి. ఈ పార్టీల్లోనూ టీడీపీ నేతలు.. …
Read More »పోలీసులూ మీ ఇష్టం : చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు ప్రకటించారు. “పోలీసులూ మీ ఇష్టం. ఎలాంటి చర్యలు తీసుకున్నా.. నేనేమీ అడగను. కానీ, రాష్ట్రంలో మహిళలకు, యువతులకు, చిన్నారులకు భద్రత కల్పించాలి. అసాంఘిక శక్తులు నేరం చేయాలంటేనే వణుకు పుట్టేలా చేయాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా సచివాలయంలో రాష్ట్ర డీజీపీ సహా హోం శాఖ సెక్రటరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత వారం రోజుల్లో …
Read More »శాంతి భద్రతలపై కుట్ర పన్నారు: కొమ్మినేని రిమాండ్ రిపోర్ట్
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే.. కొమ్మినేనికి సంబందించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను పేర్కొన్నారు. సాక్షి మీడియా వేదికగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి, అశాంతిని రెచ్చగొట్టి, అల్లర్లను ప్రేరేపించే విధంగా కుట్ర పన్నినట్టు పేర్కొన్నారు. దీనిని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే అమరావతిపై …
Read More »సజ్జల మూర్ఖుడు: షర్మిల
వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్.. సజ్జల రామకృష్నారెడ్డిపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఆయన మూర్ఖుడు.. అంటూ దుమ్మెత్తి పోశారు. రాజధాని అమరావతిలో ఆ తరహా మహిళలు ఉంటారంటూ.. సాక్షిమీడియాలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్లపై మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజధాని మహిళలు మరింత ఎక్కువగా ఆవేదన, ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు సాక్షి ఆఫీసుల వద్ద …
Read More »ఇలా చేస్తే.. రేవంత్‌కు ఫ్రీహ్యాండ్ ఇచ్చినట్టా?
తెలంగాణలో కొత్తగా ముగ్గురు మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే జరిగింది. సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చిన మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ఇటీవల ఫుల్ స్టాప్ పెట్టారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌లను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలాగే మరొకరికి కూడా అవకాశం కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా …
Read More »‘రాజధాని మహిళల’ విషయం.. బీజేపీకి పట్టలేదా?
ఏపీ రాజధాని అమరావతిలో ఆ తరహా మహిళలు ఉంటారంటూ.. వైసీపీ మీడియా సాక్షిలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్లపై మహిళాలోకం భగ్గు మంటోంది. దీనిపై పెద్ద ఎత్తున మహిళలు కూడా ఉద్యమాలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సాక్షి కార్యాలయాలు వద్ద ఆందోళన నిర్వహించారు. యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా ఈ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వేడి ఇంకా చల్లారలేదు. అయితే ఈ వ్యవహారంపై …
Read More »గుంటూరు జైలుకు కొమ్మినేని.. 14 రోజుల రిమాండ్!
సీనియర్ జర్నలిస్టు, సాక్షి మీడియా యాంకర్‌గా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి స్థానిక కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. దీనికి ముందు మంగళవారం ఉదయం వరకు.. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్లోనే ఉంచిన ఆయనను.. తర్వాత.. గుంటూరుకు తరలించారు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. సుమారు గంటకు పైగా.. ఇక్కడే సమయం సరిపోయింది. అనంతరం.. కొమ్మినేని …
Read More »హరీష్‌రావుకు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత!
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో ఆయన పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు.. తన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను దాచి పెట్టారని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది. అంతేకాదు.. ఈ వివరాలను దాచి పెట్టడం ద్వారా హరీష్ రావు తప్పులు చేశారని కూడా ఆరోపించారు. …
Read More »తీరు మారని కృష్ణంరాజుకు జాతీయ మహిళా కమిషన్ షాక్
మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో, డిబేట్లలో పాల్గొనే సమయంలో వక్తలు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఆ వక్త రాజకీయ నేత అయినా…జర్నలిస్ట్ అయినా..ఫిల్మ్ స్టార్ అయినా సరే…నోరు జారితే మూల్యం చెల్లించక తప్పదు. అయితే పొరపాటునో..గ్రహపాటునో టంగ్ స్లిప్ అయి ఉంటే…ఆ వెంటనే క్షమాపణలు చెప్పి ఆ వ్యవహారానికి పుల్ స్టాప్ పెట్టిన వారిని చూశాం. కానీ, జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి వేశ్యల రాజధాని అంటూ తాను చేసిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates