గత ఎన్నికల్లో మామూలుగా గెలిచి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన, ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేదో కానీ.. 151 సీట్లతో అసాధారణ విజయం సాధించడంతో ఆయనకు, వైసీపీ నేతలకు గర్వం తలకెక్కిందనే అభిప్రాయం జనాల్లో బలంగా కలిగింది. జగన్ ఒక నియంత పాలించినట్లుగా రాష్ట్రాన్ని పరిపాలించడం.. ఏకపక్ష, వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం.. అసెంబ్లీలో టీడీపీని, బయట జనసేనను చూసి వైసీపీ నేతలు విపరీతంగా …
Read More »జగన్ మాట దేనికి సంకేతం?
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ సాధించిన విజయం చూసే.. ఇలాంటి గెలుపు నభూతో నభవిష్యతి అనుకున్నారందరూ. కానీ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీయే కూటమి.. అంతకు మించిన విజయంతో సంచలనం సృష్టించింది. జగన్ పార్టీ ఓటమి గురించి సంకేతాలు వచ్చాయి కానీ.. మరీ ఈ స్థాయిలో చిత్తవుతుందని.. మరీ 11 సీట్లకు పరిమితం అయిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఓటమి అనంతరం నిన్న జగన్ పెట్టిన ప్రెస్ మీట్‌తోనే ఆయన …
Read More »రాజకీయాల్లోను మెరిసిన తారలు ఎవరో తెలుసా ?
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టినా 2024 వరకు విజయం దక్కలేదు. చివరకు ఈ ఎన్నికల్లో తొలిసారి తను పిఠాపురం శాసనసభ్యుడిగా 70 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించడమే కాకుండా పోటీ చేసిన 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులను గెలిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ మాదిరిగానే దేశంలో అనేక మంది సినీతారలు ఎన్నికల్లో పోటీ చేసి విజేతలు పరాజితులుగా …
Read More »చంద్రబాబుకు ఇది గొప్ప ఊరటే..
విభజన తర్వాత అసలే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. దీనికి తోడు గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో పరిశ్రమలు, పెట్టుబడులు అనేవి బాగా తగ్గిపోయాయి. సంపద సృష్టి అన్నదే పెద్దగా జరగలేదు. మరోవైపు సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తూ ఖజానాను ఖాళీ చేసేసింది జగన్ సర్కారు. హద్దులు మీరి అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని జగన్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. ఉన్న పథకాలకు, ఉద్యోగుల జీతాలకే నిధులు సరిపోని …
Read More »పార్టీలు మారినా ఓటరు కరుణించలే !
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు ముందు పలువురు బీఆర్ఎస్ నేతలు, సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి పోటీ చేశారు. అయితే పార్టీ మారి పోటీచేసిన వారిలో కడియం కావ్య, గోడెం నగేశ్ మినహా మిగిలినవారంతా ఓటమిపాలయ్యారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కావ్య వరంగల్ నుంచి గెలుపొందగా, బీఎస్పీ నుంచి బీజేపీలో చేరి ఆదిలాబాద్ నుంచి పోటీచేసిన గోడెం నగేశ్ విజయాన్ని …
Read More »మొదటి బంతికే సిక్సర్ కొట్టాడు !
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్, సిక్సర్ల వీరుడు యూసుఫ్ పఠాన్ రాజకీయాల్లోకి వచ్చిన తొలి ప్రయత్నంలోనే భారీ సిక్సర్ కొట్టాడు. పశ్చిమబెంగాల్లోని బరంపుర నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరఫున బరిలోకి దిగిన యూసుఫ్ పఠాన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరిపై 85 వేల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశాడు. బరంపురంలో వరుసగా 5 సార్లు గెలిచిన అధీర్ …
Read More »ఏపీలో భారీ మెజారిటీలు ఎవరివంటే ?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. గత ఎన్నికలకు భిన్నంగా ఏపీ ప్రజలు ఈ సారి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించారు. గాజు గ్లాసు, సైకిల్, కమలం పువ్వు గుర్తులతో ఓటర్లలో గందరగోళం రేపుతుందన్న ఆందోళన ఉండగా అవన్నీ పటాపంచలు చేస్తూ ప్రజలు తీర్పు ఇచ్చారు. జనసేన పోటీ లేని చోట ఎన్నికల కమీషన్ గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. …
Read More »తమిళనాడులో ఇండియా క్లీన్ స్వీప్
తమిళనాడులో ఇండియా కూటమి లోక్ సభ స్థానాలు అన్నింటినీ క్లీన్‌స్వీప్ చేసింది. అధికార డీఎంకే సారథ్యంలో బరిలోకి దిగిన ఆ కూటమి గత సార్వత్రిక ఎన్నికలను మించి ఫలితాలను సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను ఇండియా కూటమి కైవసం చేసుకుంది. కూటమి హవా ముందు ఏఐఏడీఎంకే, ఎన్డీయే కూటమి తేలిపోయింది. ఆ రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలకు గానూ 22 చోట్ల గెలుపొందిన డీఎంకే తన పట్టును నిలుపుకొన్నది. …
Read More »కర్ణాటకలో కాంగ్రెస్ కు ఝలక్
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలోని 28 స్థానాలకుగానూ 17 సీట్లను ప్రతిపక్ష బీజేపీ కైవసం చేసుకున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాల్తకు మాత్రమే పరిమితం అయింది. బీజేపీ మిత్రపక్షం జేడీఎస్ రెండు చోట్ల గెలిచింది. గెలిచిన వారిలో మాజీ సీఎంలు బసవరాజ్ బొమ్మై, హెచ్డీ కుమారస్వామి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అల్లుడు రాధాక్రిష్ణ దొడ్డమణి ఉన్నారు. …
Read More »ఒడిశాలో బీజేపీ సర్కార్.. నవీన్‌బాబు ఓటమి!
ఒడిశాలో సంచలనం చోటు చేసుకుంది. ఇక్కడ పాతిక సంవత్సరాలుగా రాజ్యమేలుతున్న ముఖ్యమంత్రి నవీన్ బాబు ఇంటి ముఖం పట్టారు. ఆయన పాలనకు ప్రజలు వ్యతిరేక ఓటు వేశారు. పలితంగా అసలు కలలో కూడా ఊహించని విధంగా ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 80 స్థానాల్లో విజయం దక్కించుకున్న ఆ పార్టీ మరో 5 నుంచి 6 స్థానాలు దక్కించుకునే అవకా శం ఉంది. ఇక, ఇప్పటి వరకు అధికారంలో ఉన్న …
Read More »18 జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ !
‘వై నాట్ 175’ అన్న వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు షాక్ ఇచ్చారు. ఏపీలోని 26 జిల్లాల్లో 18 జిల్లాల్లో అయితే వైసీపీ ఖాతా కూడా తెరవలేదు.కేవలం 10 స్థానాలకు పరిమితం అయింది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈసారి వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. వీటితో పాటు శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, …
Read More »‘పిన్నెల్లి’ పీచే మూడ్ !
పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అధికార వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటమి పాలయ్యాడు. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందారెడ్డి చేతిలో 33,318 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బ్రహ్మానందా రెడ్డికి 122413 ఓట్లు రాగా పిన్నెల్లికి 89095 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన పిన్నెల్లి 2009 నుంచి ఒకసారి కాంగ్రెస్, రెండుసార్లు 2014,2019 లలో వైసీపీ …
Read More »