పిట్ట కొంచెం.. కూతఘనం అనే మాటను నిరూపించారు.. అనంతపురం జిల్లా తాడిపత్రి యువ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. అనంతపురం జిల్లాలోని అర్బన్ నియోజకవర్గంలో జరిగిన.. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ బహిరంగ సభలో అస్మిత్ రెడ్డి సంచలన ప్రసంగం చేశారు. ఇతర నాయకులు చేసిన ప్రసంగానికి భిన్నంగా అస్మిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఆయన ప్రసంగం సీఎం చంద్రబాబును కూడా మంత్రముగ్ధుడిని చేశాయి. రాష్ట్రంలోని నాయకులను, రాజ్యాంగాన్ని పోల్చుతూ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగానికి నాలుగుమూల స్థంభాలు ఉన్నాయని అస్మిత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా కూటమి సర్కారు కు కూడా నాలుగు మూల స్తంభాలు ఉన్నాయని తెలిపారు. 1) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న ప్రధాని మోడీ రాష్ట్రానికి సంబంధించి వనరులు అందిస్తూ.. సర్కారుసాఫీగా పాలన చేసుకునేందుకు అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తున్నారని తెలిపారు. దీంతో సూపర్ సిక్స్ హామీలు సజావుగా అమలు జరుగుతున్నాయని తెలిపారు.
2) సీఎం చంద్రబాబు: కూటమి సర్కారుకు రెండో మూలస్తంభంగా చంద్రబాబు నిలిచారని అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. పాలనా దక్షుడిగా.. విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు అభివృద్ధి-సంక్షేమాన్ని పరుగు లు పెట్టిస్తున్నారని.. ఎవరూ ఊహించని రీతిలో విధ్వంసమైన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
3) పవన్ కల్యాణ్: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. కూటమి ప్రభుత్వానికి మూడో స్తంభంగా నిలిచారని.. కష్టాల్లో ఉన్న పార్టీని ఆదుకుని అనేక త్యాగాలు చేసి.. కూటమి సర్కారు ఏర్పడేందుకు దోహదపడ్డారని కొనియాడారు.
4) నారా లోకేష్: కూటమి సర్కారుకు నాలుగో పిల్లర్‌గా యువ నాయకుడు, మంత్రి నారాలో కేష్ నిలిచారని అస్మిత్ రెడ్డి తెలిపారు. ఆయన ద్వారా అనేక మంది యువతకు ప్రేరణ కలుగుతోందన్నారు. యువతను ప్రోత్సహించడమే కాకుండా.. వారి శక్తిసామర్థ్యాలను కూడా గుర్తిస్తూ.. ముందుకు సాగుతున్నారని అస్మిత్ రెడ్డి తెలిపారు. యువత మరింత ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చి.. నారా లోకేష్‌కు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ అని చెప్పిన ఆయన.. ఆయన దిశానిర్దేశంలో టీడీపీ మరింత ముందుకు సాగుతుందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates