ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఏ నేతలకు దక్కబోతోందని తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఏపీలో మరోసారి దగ్గుబాటి పురంధేశ్వరికే పగ్గాలు అప్పగించాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో చిన్నమ్మకే మరో చాన్స్ దక్కుతుందని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ హై …
Read More »చంద్రబాబు విశ్వరూపం.. అప్పుడే తెలుస్తుందా ..!
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత అభివృద్ధికి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని జోడు ఎద్దుల మాదిరిగా ఈ రెండిటిని ముందుకు నడిపిస్తున్నామని చెబుతున్నారు. సాధారణంగా ఏడాది పాలన తర్వాత ప్రజల్లో ఆకాంక్షలు ఉంటాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఒక్క ఏడాదిలోనే పూర్తి చేయలేదు అనే మాట ఒకవైపు వినిపిస్తున్నా.. మరోవైపు ఏడాదికాలెంలో కొన్ని మైనస్లు ఉన్నాయనే మాట కూడా వినిపిస్తోంది. …
Read More »‘పలాస’ లో ఏం జరుగుతుంది శిరీషగారూ?
ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలోని ఓ నియోజకవర్గం రాజకీయంగా ఎప్పుడూ హాట్ టాపిక్కే!. ఆ నియోజకవర్గంలో అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు ఎన్నికలకు ముందు కన్నా ఎక్కువగా పేలుతున్నాయి. అదే పలాస నియోజకవర్గం. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో గౌతు శిరీష విజయం దక్కించుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గౌత శిరీష గతంలో ఓడిపోయినా.. 2024 ఎన్నికల్లో మాత్రం కూటమి హవాతోపాటు.. ప్రజల్లో …
Read More »బాబుకు తమ్ముళ్ల తలనొప్పులు మామూలుగా లేవుగా!
వైసీపీ హయాంలో మైనింగ్ అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆనాడు మైనింగ్ శాఖ ఎండీగా పనిచేసిన అఖిల భారత సర్వీసులకు చెందిన వెంకట రెడ్డిని జైల్లో పెట్టారు. ఇప్పటికీ ఆయన బయటకు రాలేదు. మరోవైపు.. అప్పటి అక్రమాలపై ప్రభుత్వం నియమించిన అధికారులకు దిమ్మ తిరిగే వాస్తవాలు కనిపించాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. పైకి చంద్రబాబు ఎన్ని …
Read More »కూటమి ఎఫెక్ట్: ఏపీలో పర్యటిస్తున్న బీహార్ నేతలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎలా విజయం దక్కించుకుంది? ఎంత ఒబ్బిడిగా ముందుకు సాగింది? ఎలాంటి పంథా అనుసరించింది? అనేవి ఆసక్తికర విషయాలు. ఎందుకంటే భిన్నమైన సిద్ధాంతాలు, భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న నాయకులు కలిసి కూటమిగా ఏర్పడి విజయం దక్కించుకున్నారు. ఇది ఒక ప్రయోగమని చెప్పాలి. అంతేకాదు భవిష్యత్తులో కూటమిగా ఏర్పడే పార్టీలకు ఇది ఒక కేసు స్టడీగా ఉపయోగపడుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బీహార్ కు చెందిన కొంతమంది నాయకులు …
Read More »“మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ గారూ..“
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్-టీడీపీ యువ నాయకుడు, మంత్రినారా లోకేష్ మధ్య రాజకీయ ఫైట్ తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఎక్స్ వేదికగా జగన్ చేసే కామెంట్లకు, విమర్శలకు నారా లోకేష్ స్ట్రాంగ్ రిప్లయ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్ చేసిన విమర్శలపై లోకేష్ స్పందిస్తూ.. “మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ గారూ..“ అని సంచలన వ్యాఖ్య చేశారు. “మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ మోహన్ రెడ్డి …
Read More »ఎర్రబెల్లి గారూ… ఎక్కడున్నారండీ?
తెలుగు నేల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేతల జాబితాలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరు. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి కేంద్రంగా సుదీర్ఘ కాలంగా రాజకీయాలు సాగిస్తున్న ఎర్రబెల్లి… 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దగా కనిపించడమే లేదు. ప్రస్తుతం వరంగల్ జిల్లా అధికార కాంగ్రెస్ లో రసవత్తర రాజకీయం నడుస్తోంది. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒక జట్టుగా, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి …
Read More »పర్యాటకానికి పదును.. చంద్రబాబు అదిరే స్ట్రాటజీ..!
ఏపీ సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా ఐటికి ప్రాధాన్యం ఇస్తూనే.. మరోవైపు పర్యాటక రంగానికి మరింత ఎక్కువ ప్రాధాన్యం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలు పైబడి పర్యాటక రంగంలో రాబట్టాలని ప్రయత్నిస్తున్నట్టు చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే ఇది చాలా పెద్ద వ్యూహంతో కూడుకున్న ప్రకటనగానే పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే …
Read More »మీడియాకు ఈ రేంజి వార్నింగ్ ఇదే తొలిసారి!
తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహాన్యూస్ టీవీ ఛానెల్ కార్యాలయంపై శనివారం విపక్ష బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి తీవ్రత ఏ రేంజిలో ఉందంటే… దాడి జరిగిన మరుక్షణమే సదరు కార్యాలయాన్ని మహాన్యూస్ ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపగా… దానిని మించి ఆదివారం బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ …
Read More »2027లోనే జమిలి ఎన్నికలు: పెద్దిరెడ్డి
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఇప్పటికి 13 నెలలు దాటిపోతోంది. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఏర్పడిపోయాయి. ఎవరికి తగ్గట్టుగా వారు పాలన సాగిస్తున్నారు. తిరిగి ఎన్నికలు రావాలంటే…రాజ్యాంగం ప్రకారం ఐధేళ్లు.. అంటే ఇంకో 3 ఏళ్ల 11 నెలల సమయం అయితే ఆగాల్సిందే కదా. మరి ఎందుకో గానీ… ఏపీలో 2019 నుంచి ఐధేళ్ల పాలు పాలన సాగించిన వైసీపీ… 2029 వరకు ఆగలేకపోతోంది. అంతకంటే ముందే ఎన్నికలు జరిగి తిరిగి తాను అధికారంలోకి రావాలని …
Read More »56 మంది ఎమ్మెల్యేల డుమ్మా… బాబు ఫైరింగ్
ఏపీలోని కూటమి ప్రభుత్వ రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు తదితరులంతా హాజరు కావాలని పార్టీ అధిష్ఠానం ఒకింత గట్టిగానే చెప్పింది. అయితే ఇతర వర్గాల వారు బాగానే హాజరైనా.. ఎమ్మెల్యేల కోటాలో మొత్తం 135 మంది ఉంటే..వారిలో ఏకంగా 56 …
Read More »జగన్కు షర్మిల ఒక ప్లస్.. రెండు మైనస్ ..!
వైసిపి అధినేత జగన్… కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా.. ఏం మాట్లాడినా.. షర్మిల తీవ్ర స్థాయిలో జగన్ ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. విషయం ఏదైనా జగన్ మాట ఉండాల్సిందే. జగన్ను విమర్శించాల్సిందే. ఇది ఇప్పుడే కాదు.. షర్మిల గత ఏడాదిన్నర కాలంగా అనుసరిస్తున్న బాట. అయితే. నిజంగానే షర్మిల ఈ లైన్ లో వెళ్లడం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates