అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇప్పుడు ఎన్నివేల మంది భక్తులు వెళ్లినా.. ప్రశాంతంగా స్వామిని దర్శించుకునేందుకు వీలుగా అభి వృద్ధి చేశారు. నిత్యాన్నదానం నుంచి ఉదయం పూట టిఫిన్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ అభివృద్ధిలో గత ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయి. ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ ఒప్పుకొనే మాట. అదేవిధంగా ఇప్పుడు మరో ప్రముఖ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
తాజాగా ఆదివారం.. ఉండవల్లిలోని నివాసంలో డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం చంద్రబాబు .. తిరుమల తరహాలోనే శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని కూడా డెవలప్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేశామని చెప్పారు. తద్వారా ఎన్ని వేల మంది భక్తులు మల్లన్న దర్శనానికి వచ్చినా ఇబ్బంది లేకుండా చేస్తామ న్నారు. అంతేకాకుండా.. చుట్టూ ఉన్న అభయారణ్యాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు వివరించారు.
ఇదీ ప్లాన్..
- శ్రీశైలం దేవస్థానం చుట్టూ ఉన్న అభయారణ్యంలో 2 వేల హెక్టార్లను ఆలయానికి కేటాయించేలా ప్లాన్ చేశారు. దీనిపై కేంద్రానికి విన్నవించి.. ఆ భూములు తీసుకుంటారు.
- పర్యాటకంగా శ్రీశైలం చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా.. ఆదాయం పెంచనున్నారు.
- శ్రీశైలం దేవస్థానానికి వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గాన్ని మరింత విస్తరించి.. జాతీయ రహదారులకు అనుసంధానం చేయనున్నారు.
- పులుల అభయారణ్యాన్ని మరింత విస్తరించి.. అభివృద్ధి చేయనున్నారు.
- మరిన్ని కాటేజీల నిర్మాణంతోపాటు.. భక్తులకు వసతి సదుపాయాలు పెంచనున్నారు.
- నిత్యాన్నదానంతోపాటు… మెరుగైన వసతులు కల్పించనున్నారు.
- క్యూలైన్లను మరింత విస్తరించనున్నారు.
- తిరుమల, శబరిమల ఆలయాల్లో కల్పిస్తున్న సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తారు.
- వచ్చే రెండేళ్లలో శ్రీశైలం దేవస్తానాన్ని అన్ని సౌకర్యాలతో మరింత విస్తరించనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates