శిరోముండనం ఘటనలో అరెస్టయిన నూతన్ నాయుడు లీలలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. తనింట్లో ఓ దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేయించిన ఘటన పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ ఘటనలో నాయుడు భార్యతో పాటు కుటుంబసభ్యులు, ఇంట్లో పనిచేసే ఉద్యోగులు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత నాయుడు పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వేస్టేషన్లు …
Read More »లేఖ సూత్రధారుడి పదవీ పీకేసిన సోనియమ్మ
నాయకుడు ఎంత తోపు అయినప్పటికీ.. పార్టీకి విధేయుడిగా.. నమ్మకస్తుడిగా ఉండాలి. ఏదేదో చేయాలన్న ఆలోచన ఉండొచ్చు. కానీ.. అదంతా అధినేత మనసును దోచుకునేలా ఉండాలే కానీ గాయపరిచేలా ఉండకూడదు. మొన్నా మధ్య కాంగ్రెస్ పార్టీలో తాత్కాలిక అధ్యక్షుల ఎంపికను పక్కన పెట్టటం.. పార్టీ పగ్గాల అప్పగింతకు ఎన్నికలు నిర్వహించాలన్న షాకింగ్ ప్రపోజల్ తో పాటు పలు సంచలన అంశాలతో కూడిన లేఖను విడుదల చేయటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. …
Read More »మోడీ సర్కారుపై సమరానికి సిగ్నల్ ఇచ్చేసిన కేసీఆర్
జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి.. మోడీ వ్యతిరేకుల్ని ఒక తాటి మీదకు తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. తాను జాతీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని.. ఒకవేళ అలాంటిది ఉంటే పార్టీ నేతలకు తొలుత చెబుతానన్న కేసీఆర్.. తాజాగా తన ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ సర్కారును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయటం …
Read More »కొత్త రెవెన్యూ చట్టం…అంతం కాదు ఆరంభం: కేసీఆర్
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సవరణలు లేకుండానే బిల్లుకు సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సవరణలను ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త రెవెన్యూ చట్టం అనేది అంతం కాదని ఆరంభం మాత్రమేనని అన్నారు. రెవెన్యూ చట్టంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. …
Read More »కంగనా తల్లి ఆశా రనౌత్ కు బీజేపీ బంపరాఫర్
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మధ్య వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తనకు ముంబై పోలీసులపై నమ్మకం లేదని, తనకు కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని కంగనా కోరిన వెంటనే కేంద్రం ఆమెకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. ఇక, కంగనా ఆఫీసు కూల్చివేతపై గవరన్నర్ కోషియారీ ఏకంగా కేంద్రానికి నివేదిక …
Read More »ఏపీకి ఫిక్సెడ్ రాజధాని అన్నది ఉండదా?
టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి స్థానే.. మూడు రాజధానుల ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాదనలు సైతం సబబుగానే కనిపిస్తాయి. ఇలాంటివేళ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం.. ఏపీ ప్రజలకు రానున్న రోజుల్లో రాజధాని అంటూ ఒకప్రాంతం పర్మినెంట్ గా ఉండదా? అన్న సందేహం కలుగక …
Read More »‘అంతర్వేది’ తో బీజేపీ – వైసీపీ మధ్య గ్యాప్ పెరిగిందా?
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారి చారిత్రక రథం దగ్ధం ఘటన ఏపీలో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు నిరసనగా అంతర్వేది ఆలయాన్ని సందర్శించేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ, జనసేన నేతలను పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా హౌస్ అరెస్ట్ చేయడం రాజకీయ దుమారం రేపింది. దీంతో, వైసీపీ సర్కార్ పై ఏపీ బీజేపీ చీఫ్ సోము …
Read More »జగన్ సర్కారు రాజధాని నిర్ణయంపై జేపీ కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజధానులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార వికేంద్రీకరణ.. అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ చేసేందుకు వీలుగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విపక్షం తీవ్రంగా తప్పు పడుతోంది. ఇలాంటివేళ..మేధావి వర్గానికి చెందిన లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక టీవీ చానల్ …
Read More »అంతర్వేదితో ఏపీలో హిందూ ఓట్ బ్యాంక్ కు బీజం
దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. ప్రధాని మోడీ నేతృత్వంలో వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా….దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా పట్టు లేదనే చెప్పాలి. ప్రధానంగా హిందుత్వ ఎజెండా, హిందూ ఓటు బ్యాంకు వంటి అంశాలతో మతతత్వ రాజకీయాలపై ఆధారపడ్డ బీజేపీకి….కుల సమీకరణాల ఆధారంగా గెలుపోటములు నిర్దేశించే దక్షిణాది రాజకీయాలు అచ్చిరాలేదనే చెప్పవచ్చు. అయితే, ఇటీవల ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలు 2024 ఎన్నికల్లో బీజేపీకి …
Read More »పవన్ ఛలో అన్నాడు.. కేసు సీబీఐకి
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆంధ్రప్రదేశ్‌లో తాజా హాట్ టాపిక్.. తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది ఆలయంలో పురాతన రథం దగ్ధం కావడం. లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది అర్థం కాలేదు. ఏపీ ప్రభుత్వం జరిపిన విచారణలో ఏమీ తేలలేదు. పిల్లలెవరో తేనెపట్టును కాల్చే క్రమంలో రథం దగ్ధమైందంటూ ఒక కారణాన్ని తెరపైకి తెచ్చారు. అది అందరికీ చాలా కామెడీగా అనిపించింది. ఎంపీ …
Read More »ఎందుకీ విన్యాసాలు పవన్?
భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరే వేరుగా ఉంటోంది. ఆ పార్టీని మెప్పించేందుకా అన్నట్లు ఆయన ‘హిందుత్వ’ ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. భాజపా అధినాయకత్వాన్ని మెప్పించేందుకు ఆయన అనేక పనులు చేశారు. ఆయన ట్వీట్లలో కూడా చాలా వాటిని పరిశీలిస్తే ‘బీజేపీ’ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇది పవన్‌ను అభిమానించే చాలామందికి నచ్చట్లేదు. ఈ విషయంలో ఆయన తన ఐడెంటిటీని కోల్పోతున్నారనే అభిప్రాయాలున్నాయి. …
Read More »ఏపీలో కోటిమందిని టచ్ చేసి వెళ్లిన కరోనా
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న కొత్తలో వైరస్ పై ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల విపరీతంగా భయపడేవారు. క్రమక్రమంగా కరోనా లక్షణాలు, చికిత్స పై అవగాహన పెరగడంతో…కరోనాకు అతిగా భయపడకుండా అప్రమత్తంగా ఉంటున్నారు. తీవ్ర లక్షణాలు ఉన్నవారు మాత్రం ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఒక వేళ చాలామందిలో స్వల్ప లక్షణాలు కనిపించినా…వెంటనే హోం క్వారంటైన్ లో చికిత్స పొంది కరోనా నుంచి బయటపడుతున్నారు. ఇక, చాలామంది తమకు …
Read More »