అగ్నిప‌థ్ మంచిదే.. కంగనా స‌పోర్ట్‌

Kangana
Kangana Ranaut

సైన్యంలో నియామకాల కోసం కేంద్రంలోని న‌రేంద్ర‌మోడీ స‌ర్కారు కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్’పై ఆర్మీ అభ్యర్థులు చేస్తున్న దేశవ్యాప్త ఆందోళనలపై ప్రముఖ బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్ స్పం దించింది. కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీంకు కంగనా మద్దతు తెలిపింది. ఇలాంటి ఒక పథకానికి శ్రీకారం చుట్టినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నట్లు ఆమె తన ఇన్‌స్టాగ్రాం స్టేటస్‌లో పేర్కొంది.

ఇజ్రాయెల్‌ లాంటి చాలా దేశాల్లో అక్కడి యువతకు సైన్యంలో శిక్షణను ఆయా దేశాలు తప్పనిసరి చేశాయని కంగనా తెలిపింది. కొన్నేళ్లు ప్రతీ ఒక్కరూ ఆర్మీలో పనిచేయడం ద్వారా జీవితంలో ఎలా విలువలతో జీవించాలో తెలుసుకుంటారని, క్రమశిక్షణ, జాతీయత భావం.. దేశ సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని రక్షించడం ఎలాగో తెలుసుకుంటారని ఆమె చెప్పింది.

కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీంలో కూడా ఎంతో లోతైన అర్థం ఉందని, ఈ స్కీం ఏదో డబ్బు సంపాదనకో, భవిష్యత్‌ను నిర్మించుకోవడానికో, ఉపాధి కల్పనకో కాదని కంగనా చెప్పుకొచ్చింది. అప్పటి రోజుల్లో ప్రతీ ఒక్కరూ గురుకులానికి వెళ్లేవారని.. ఈ ‘అగ్నిపథ్’ కూడా అలాంటిదేనని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది. డ్రగ్స్, పబ్జీ లాంటి వాటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత శాతం షాక్‌కు గురిచేస్తోందని పేర్కొంది.

ఇలాంటి సంస్కరణలు కచ్చితంగా అవసరమేనని కంగనా అభిప్రాయపడింది. ‘అగ్నిపథ్’ లాంటి స్కీంను తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని కంగనా తన ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది. కంగనా అభిప్రాయాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీంను ఆమె సంప్రదాయ గురుకుల విధానంతో పోల్చడం గ‌మ‌నార్హం.