సాధారణంగా సినిమా పాటలు జనాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఆయా సాహిత్యాన్ని బట్టి ప్రేక్షకులు స్ఫూర్తి పొందుతుంటారు. అదే తరహాలో పొలిటికల్ సాంగ్స్ కూడా ఓటర్లను …ఆయా పార్టీల అభిమానులను….కొన్ని సార్లు తటస్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. 2019 ఎన్నికల ప్రచారంలో రావాలి జగన్…కావాలి జగన్..మన జగన్ అన్న పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. 2018లో విడుదలైన ఈ పాటకు యూట్యూబ్ లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. …
Read More »మొండితనం కొంతవరకే మంచిది !
విషం ప్రాణాల్ని తీస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ.. కొన్ని సందర్భాల్లో విషాన్ని సరైన పద్దతుల్లో వినియోగిస్తే.. సంజీవినిలా మారి ప్రాణాల్ని రక్షిస్తుంది. చాలామంది వేలెత్తి చూపించే గుణాలు కొన్నిసార్లు ఆభరణాలుగా మారతాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయంలోనూ అలానే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడ్ని కాదని.. జగన్ ను ఏపీ ప్రజలు ఎందుకంతగా అక్కున చేర్చుకున్నారు? ఎన్నికల్లో ఆయనకు కట్టబెట్టిన చారిత్రక విజయాన్ని సింపుల్ గా తీసి పారేయలేం. ఎందుకంటే.. మూర్తీభవించిన …
Read More »జాతీయ స్థాయి న్యాయవర్గాల్లో నిమ్మగడ్డ వ్యవహారంపై చర్చ
ఏపీ ఎస్ ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను పునర్నియామకం వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ నియామకం వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై స్టేతో పాటుగా హైకోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిసన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ పై …
Read More »వైసీపీలో ఆ మహిళా నేతలు….ఇద్దరూ ఇద్దరే
వైసీపీలో ప్రస్తుతం ఇద్దరు మహిళా నేతల తీరు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు వైసీపీలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ ఇద్దరిలో ఒకరేమో చాలాకాలంగా వైసీపీలో కీలక మహిళా నేతగా ఉండగా….మరొకరేమో తొలి విడత ఎమ్మెల్యేగా ఎన్నికై తన హవా సాగిస్తున్నారు. అయితే, వీరిద్దరిలోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. తమ నియోజకవర్గాల్లో వేరే ఎమ్మెల్యేలు, ఎంపీలు…కనీసం స్థానికంగా ఇతర వైసీపీ నేతల …
Read More »అయోధ్య భూమి పూజ ముహుర్తం బాలేదు – స్వరూపానంద
కొందరి నోటి నుంచి కొన్ని మాటలు వచ్చాయంటే.. అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. దేశంలో చాలామందే స్వాములోళ్లు ఉన్నారు. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. వీరిలోనూ వీవీఐపీ స్వాములోళ్లు ఉన్నారు. అలాంటి వారిలో కొందరికి ఉండే ఇమేజ్ వేరుగా ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు శంకరాచార్య జ్యోతిష్య పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి. అయోధ్యలో రామమందిరం భూమిపూజ కోసం పెట్టిన ముహుర్తం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. …
Read More »నిమ్మగడ్డ కేసు… నీలం సాహ్నికి చిక్కులు?
నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓ వైపు హైకోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరిండంతో పాటు నిమ్మగడ్డ నియామకంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. మరో వైపు హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో ఏపీ ఎస్ ఈసీగా నిమ్మగడ్డ నియామకం దాదాపుగా …
Read More »నిమ్మగడ్డ కేసు – RRR ఘాటు స్పందన
ఏపీ ఎస్‌ఈసీ నియామకం వ్యవహారం ఇపుడు ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డను ఎందుకు ఎస్ ఈసీగా నియమించలేదంటూ సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ నియామకంపై ఏపీ హైకోర్టు కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే కోరిన ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురైంది. మరోసారి స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో జగన్ సర్కార్ కు మరో …
Read More »పట్టాభిషేకానికి రంగం సిద్ధమవుతోందా?
మరో మూడు టర్మ్ లు మా నాయకుడు పాలించే సత్తా ఉందంటూ తరచూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానిస్తుంటారు. ఆయన ఆ మాటలు అనే ప్రతి సందర్భంలోనూ కేటీఆర్ కు ముఖ్యమంత్రిపదవి బదిలీ చేసే ప్రక్రియ జోరుగా సాగుతుందన్న ప్రచారం జరగటాన్ని అండర్ లైన్ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర యువరాజుగా టీఆర్ఎస్ దళాలు ముద్దుగా పిలుచుకునే కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గతంలో ఎప్పుడూ చూడనంత …
Read More »అమరావతి ఎపిసోడ్ లోకి కేంద్రాన్ని తీసుకొచ్చిన హైకోర్టు
ఏపీ సర్కారుకు ఇబ్బందికర నిర్ణయం ఒకటి ఏపీ హైకోర్టు నుంచి వెలువడింది. తాము అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే ఏపీ రాజధాని అమరావతిని తరలించాలన్న నిర్ణయంతో పాటు సీఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించిన విచారణలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల్ని కౌంటర్ దాఖలు చేయాలని …
Read More »ఎవరు ఆ ఛానల్ ప్రతినిధి? ఆసక్తికరంగా మారిన చర్చ
ప్రశ్నించటం పాత్రికేయుడు చేయాల్సిన పని. కానీ.. ఇప్పుడున్న వ్యవస్థలు.. వాటిని నడిపించే పెద్ద మనుషుల పుణ్యమా అని.. పాత్రికేయానికి కొత్త అర్థాలు చెప్పటమే కాదు.. వారికున్న హక్కుల్ని.. ప్రశ్నించే తత్త్వాన్ని తమకున్న అధికారంతో అడ్డుకుంటున్నారు. గడిచిన పదిహేనేళ్లలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారైనా సరే.. తమను కించిత్ మాట అన్నా ప్రశ్నించేవారు. తప్పు లేకుండా తమకు ఉద్దేశాలు ఆపాదిస్తే రిపోర్టర్లు ఊరుకునే వారు …
Read More »జగన్ ప్రభుత్వానికి సుప్రీంలో మరోసారి షాక్
ఏపీ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ సర్కార్ కు ఇప్పటికే పలు మార్లు చుక్కెదురైన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ పదవీ కాలం కుదింపు, కొత్త కమిషనర్‌గా జస్టిస్ కనగరాజు నియామకం కోసం జారీ చేసిన జీవో కొట్టివేత వంటి వ్యవహారాలతో జగన్ సర్కార్ హైకోర్టులో భంగపడింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. రమేష్ కుమార్ ను …
Read More »కేసీఆర్ కలల సచివాలయంలో అంతా ‘6’
తాను కలలు కన్న తెలంగాణ నూతన సచివలయానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓకే చెప్పిన నమూనాకు కొన్ని మార్పులు చేర్పులు చేయటం తెలిసిందే. తాజాగా మరిన్ని మార్పుల్ని చేసినట్లుగా చెబుతున్నారు. హుస్సేన్ సాగర్ కు అభిముఖంగా ఠీవీగా ఉండేలా సచివాలయాన్ని ప్లాన్ చేస్తున్నారు. అంతేనా.. సీఎం కేసీఆర్ తన లక్కీ నెంబరుగా భావించే ‘ఆరు’కు సచివాలయ నిర్మాణంలో పెద్ద పీట వేయనున్నారు. ప్రతి …
Read More »