కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అగ్ర రాజ్యం అమెరికా, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశమై భారత్ సహా ఎన్నో దేశాలు కరోనా ధాటికి అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారి ధాటికి దేశాల ఆర్థిక పునాదులే కదులుతున్నాయి. జనాల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ కష్టాలన్నీ పోవాలంటే వ్యాక్సిన్ రావాలి. వైరస్‌ను పారదోలాలి. దాని కోసమే అందరూ ఎదురు …
Read More »కరోనా పేరు చెప్పి దోచేస్తున్న ఆసుపత్రులూ.. ఖబర్దార్
తెలంగాణలో కార్పొరేట్ ఆసుపత్రుల అరాచకాలపై ఎన్నో వార్తలు విన్నాం. కన్నాం. జనాలు కరోనా బారిన పడి అన్ని రకాలుగా కుదేలువుతంటే.. ఇదే అదనుగా అయిన కాడికి ఫీజులు బాదేసి దోచుకుంటున్న వైనాలపై ఎన్నో ఉదాహరణలు చూశాం. అయినా ప్రభుత్వం దీనిపై దృష్టిసారించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ఐతే తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఉండే డెక్కన్ ఆసుపత్రి పేషెంట్ల పట్ల మరీ కఠినంగా వ్యవహరించి.. దారుణంగా వ్యవహరిస్తున్న వైనాన్ని ఓ బాధితుడు …
Read More »మూడు రాజధానులపై ఆ సర్వేను గుర్తు చేస్తున్నారు
ఏపీలో మూడు రాజధానుల్ని నిర్మించేందుకు వీలుగా ఏపీ అసెంబ్లీలో బిల్లును ఆమోదించటం.. తాజాగా ఆ బిల్లును గవర్నర్ ఓకే చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే.. అమరావతినే కొత్త రాజధాని అన్నోళ్లు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కొత్త రాజధాని అమరావతి అని ఫిక్స్ అయిన లక్షలాది మంది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వారంతా ఇప్పుడు …
Read More »జగన్‌కు 48 గంటల గడువిచ్చిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తూ.. మూడు రాజధానుల తీర్మానానికి గవర్నర్ చేత జగన్ సర్కారు ఆమోద ముద్ర వేయించుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఐతే అమరావతి విషయంలో బాబుకు చిత్త శుధ్ధి ఉన్నా.. లేదంటే మూడు రాజధానుల ప్రతిపాదనపై జనాభిప్రాయం ఏంటో తెలుసుకోవాలన్నా.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాలు విసురుతున్నారు వైకాపా నాయకులు. జనసేనాని …
Read More »జగన్ కు రఘురామకృష్ణంరాజు బస్తీ మే సవాల్
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం కొంతకాలంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు వైసీపీపై, సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తోన్న ఆర్ ఆర్ ఆర్…తాను వైసీపీని వీడనంటూ మొండిపట్టు పట్టారు. సొంత పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేసినా…ఆ దిశగా …
Read More »14 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవా?
అనంతపురం జిల్లా…ఏపీలోని 13 జిల్లాల్లో ఒకటి…. బ్రిటిష్ హయాంలోనే అత్యధిక పనులు చెల్లించిన ప్రాంతంగా పేరు గాంచిన జిల్లా ఇది. కానీ, ఎన్నో దశాబ్దాలుగా అనంతపురం జిల్లాను కరువు రక్కసి కబలిస్తోంది. వర్షాలు లేక, ఉపాధి దొరక్క…గ్రామాలకు గ్రామాలే వలస వెళ్లిపోతున్నాయి. కొన్ని పల్లెల్లో వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. పశువులకు గడ్డి కూడా దొరకని పరిస్థితి ఉందంటే అనంతపురం వెనుకబాటు ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. కరువు, ఏటా తగ్గిపోతున్న వర్షపాతం, …
Read More »అమరావతి పై పవన్ సవాల్.. టీడీపీ, వైసీపీ రెడీనా?
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు పట్టుబట్టి అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిని తరలిస్తూ.. మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసుకోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మెతకగా వ్యవహరిస్తున్నారని.. దీన్ని గట్టిగా వ్యతిరేకించట్లేదని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముందు ఆచితూచి మాట్లాడిన పవన్.. తాజాగా కొంచెం ఘాటుగానే మాట్లాడాడు. మూడు రాజధానులపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. అమరావతి …
Read More »అయోధ్య భూమిపూజకు మోడీ గైర్హాజరు?
అనూహ్య పరిణామాల నేపథ్యం.. మరో కీలక పరిణామానికి కారణంగా మారుతుందా? ఏళ్లకు ఏళ్ల తరబడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజుకు దగ్గరగా వచ్చిన వేళ.. అనూహ్యంగా వచ్చి పడిన కరోనా మహమ్మారి ప్రధాని మోడీకి ఇబ్బందిగా మారనుందా? అన్నదిప్పుడుప్రశ్నగా మారింది. ప్రధానికి అత్యంత సన్నిహితుడిగా.. ఆయన్ను నిత్యం కలుస్తూ.. చర్చలు జరిపే ఏకైక నేతగా అమిత్ షాను అభివర్ణిస్తారు. అలాంటి ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలటం ప్రధాని మోడీకి …
Read More »కాంగ్రెస్ లో పీక్స్ కు చేరిన సీనియర్.. జూనియర్ల రచ్చ
గెలుపు ధీమాను ఇస్తుంది. ఓటమి కుంగదీస్తుంది. గెలుపు బలహీనతల్ని కనిపించకుండా చేస్తుంది. అపజయం బలాన్ని తగ్గించి చూపిస్తుంది. అందుకే.. ఎంతటి మొనగాడైనా ఓటమి వేళ.. పిల్లాడి కంటే కష్టంగా కనిపిస్తాడు. అదే సమయంలో విజయం ఉత్సాహాన్ని ఇవ్వటమే కాదు.. అప్పటివరకూ పిల్లాడిగా ఉన్నోడు పెద్ద తోపుగా మారిపోతాడు. అతగాడి నుంచి వచ్చే ప్రతి మాటకు జయజయధ్వానాలు మారుమోగుతుంటాయి. ఇప్పుడంటే పరిస్థితి బాగోలేదు కానీ.. 2004 నుంచి 2014 మధ్య కాలంలో …
Read More »పవన్ మాటలు నూటికి నూరు శాతం నిజమయ్యాయి
ఐదేళ్ల కిందట అమరావతిలో రాజధాని కోసం తెలుగుదేశం ప్రభుత్వం భారీగా భూములు సమీకరిస్తుండటంపై వివాదం నెలకొన్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ప్రాంత రైతులను కలిసేందుకు వెళ్లారు. అప్పుడు భూములిస్తున్న రైతులకు భరోసా ఏంటి అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారాయన. తెలుగుదేశం ప్రభుత్వానికి ఆయన మద్దతుదారే అయినప్పటికీ భూసేకరణ విషయంలో తప్పులు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్లి రైతుల గోడు వింటూ.. కొన్ని కీలక వ్యాఖ్యలు …
Read More »ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం.. ఈసారి ఎవరిని తిడతారు?
సంక్షేమ పథకాల విషయంలో ముందుండే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న విషయం తెలిసిందే. ఆర్థికంగా గడ్డు పరిస్థితికి.. కరోనా తోడుకావటంతో నెల తిరిగేసరికి ఆర్థికశాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఏనెలకు ఆ నెలకు అడ్జెస్ట్ మెంట్లతో కిందామీదా పడాల్సి వస్తోంది. దీనికి తోడు.. రాష్ట్రంలో ఆదాయం బాగా పడిపోవటంతో ఎప్పటికప్పుడు రాష్ట్రం రుణాల దిశగా అడుగులు వేయాల్సి వస్తోంది. గత నెలలో …
Read More »రాజధాని గేమ్‌లో పొలిటికల్ లూజర్స్ ఎవరు ?
విశాఖపట్నం కార్య నిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేస్తూ ప్రభుత్వం తీసుకు వచ్చిన బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం చర్చనీయంశంగా మారింది. బిల్లు సెలక్ట్ కమిటీ ముందు ఉన్న సమయంలో గవర్నర్ దీనికి ఆమోదం తెలపడంపై విపక్ష టీడీపీ వంటి పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని మూడుగా చేయడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. గవర్నర్ ఆమోదముద్రతో వైసీపీ పట్టు బిగిసింది. అయితే ఇక్కడ రాజధానిని …
Read More »