Political News

ఆంధ్రప్రదేశ్‌లో ఓ సంచలన ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసే పరిణామాలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ఆత్మహత్య వ్యవహారం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. నాలుగు రోజుల కిందట ఏపీ ప్రభుత్వాన్ని చెడామడా తిడుతూ ఒక వీడియోలో కనిపించిన వ్యక్తి.. ఆత్మహత్యకు పాల్పడం సంచలనం రేపుతోంది. ఆ వ్యక్తి పేరు ఓం ప్రతాప్. ఈ వ్యక్తి విషాదాంతం గురించి తెలుగుదేశం యువ నేత నారా …

Read More »

రూ.2వేల నోటుపై కొత్త నిజాల్ని చెప్పిన ఆర్ బీఐ

ఆర్ బీఐ తాజా నివేదికను విడుదలైంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాల్ని అందులో పేర్కొంది. తరచూ అందరి నోట నానే రూ.2వేల నోటుకు సంబంధించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. అంతేకాదు..చెలామణిలో ఉన్న నోట్లతో పాటు.. పలు అంశాల్ని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్ బీఐ రూ.2వేల నోట్లను ప్రింట్ చేయటం ఆపేసిందని వెల్లడించింది. వాస్తవానికి ఈ అంశంపై గతంలోనూ వార్తలు వచ్చాయి. సమాచార హక్కు చట్టం ద్వారా …

Read More »

కాంగ్రెస్ లో తుఫానుకు బీజం పడిందెక్కడో తెలుసా?

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో ఇప్పుడు పెను తుఫానే రేగింది. ఏళ్ల తరబడి గాంధీ కుటుంబం నేతృత్వంలోనే నడుస్తున్న ఈ పార్టీకి కొత్త నాయకత్వం అవసరమని, ఈ దిశగా చర్యలు చేపట్టాలని పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఏకంగా 23 మంది అధిష్ఠానానికి లేఖ రాశారు. ఈ లేఖపై పార్టీలో తీవ్ర ఆందోళన రేకెత్తగా… దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆసక్తికరంగా చర్చించుకున్నారు. అయితే సోమవారం నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ …

Read More »

జగన్ సర్కారుకు మింగుడుపడని రీతిలో హైకోర్టు తాజా ఆదేశం

వైద్యుడిగా సుపరిచితుడు.. ఏపీలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యజమానుల్లో ఒకరుగా పేరున్న డాక్టర్ రమేశ్ పై ఏపీ సర్కారు చర్యల్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది మరణించటం.. దాదాపు ఇరవై మందికి పైగా గాయాలు పాలు కావటం తలెిసిందే. ఈ నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రిపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వర్ణ ప్యాలెస్ ను లీజుకు తీసుకున్న …

Read More »

రాజధానిగా అమరావతి అవసరం లేదన్న కొడాలి నాని

ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా.. తన ప్రాంతానికి సంబంధించి ఏదైనా మేలు జరుగుతుందంటే.. వకల్తా పుచ్చుకోవటానికి ముందుంటారు అందుకు భిన్నంగా.. తన ప్రాంతానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటే.. దానికి నో చెప్పేస్తాడు. పార్టీ లైన్ కు లోబడి ఉండాల్సి వస్తే.. మౌనంగా ఉంటారు. ఇలాంటి రూల్స్ మొత్తానికి భిన్నంగా ఏపీ మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ఆయన …

Read More »

అన్ని పత్రికలు కలిసి సాక్షికి సరితూగలేదు

సాధారణంగా పత్రికలకు ఉన్న సర్క్యులేషన్ ను బట్టి ప్రభుత్వం ప్రకటనలిస్తుంటుంది. ఇక, ఆయా పత్రికల సర్క్యులేషన్ తో పాటు పాపులారిటీని బట్టి, డీలింగ్స్ ను బట్టి పలు ప్రైవేటు సంస్థలు, కార్పొరేటు కంపెనీలు ప్రకటనలు ఇస్తుంటాయి. వీటిలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు దాదాపుగా అన్ని ప్రధాన పత్రికలకు సమానంగా ఇవ్వాలి. అయితే, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికలకు ఇచ్చే ప్రభుత్వ ప్రకటనల శాతం…మిగతా పత్రికల కన్నా కొంచెం ఎక్కువగా …

Read More »

స్కూళ్ల మీద క్లారిటీ ఇచ్చేసిన సీఎం కేసీఆర్

కరోనా వేళ.. ఎవరింట్లో వారు ఉండటం.. అవసరమైతే తప్పించి బయటకు రాకుడదన్న ప్రాథమిక సూత్రాన్నిపక్కన పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఈ ఏడాదికి సర్కారీ స్కూళ్ల పరిస్థితి ఏమిటన్న అంశంపై గందరగోళం నెలకొన్న వేళ.. పుల్ క్లారిటీ ఇచ్చేస్తూ.. తాజాగా ఆదేశాల్ని జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్ని ఓపెన్ చేసి.. ఆన్ లైన్ లో క్లాసులు చెప్పేలా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 27 (ఎల్లుండి) …

Read More »

కలెక్టర్ మీటింగ్ పెడితే.. ఉద్యోగులు ఏం చేశారంటే?

ఇది కరోనా కాలం. ప్రభుత్వ సిబ్బంది అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిన సమయం. ఇలాంటి తరుణంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో ఓ అత్యవసర సమావేశం నిర్వహించారు. దీనికి పెద్ద సంఖ్యలోనే ఉద్యోగులు హాజరయ్యారు. ఐతే కలెక్టర్ సమావేశంలో సీరియస్‌గా మాట్లాడుతూ.. సిబ్బంది ఈ సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో చెబుతూ సూచనలు ఇస్తుంటే.. ఉద్యోగులు మాత్రం అవేమీ పట్టనట్లు వాళ్ల పనిలో వాళ్లు మునిగిపోయారు. …

Read More »

గంగూలీ గురించి క్రేజీ రూమర్

క్రికెటర్‌గా ఉన్నపుడు.. ఆటకు టాటా చెప్పేశాక.. ఎప్పుడూ సౌరభ్ గంగూలీ వార్తల్లో వ్యక్తే. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా భారత క్రికెట్‌పై అతను వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. భారత క్రికెట్ రాతనే మార్చేసిన ఆటగాడతను. ఆటకు వీడ్కోలు చెప్పాక కొంత కాలం వ్యాఖ్యాతగా కొనసాగిన దాదా.. ఆ తర్వాత క్రికెట్ పాలనలోకి వచ్చి అత్యున్నత శిఖరాలను అందుకున్నాడు. ముందు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడయ్యాడు. ఆపై అనూహ్యంగా బీసీసీఐ పీఠాన్ని కూడా …

Read More »

కేసుల సంఖ్యలో ఆ 19 రాష్ట్రాలను బీట్ చేసిన తూ.గో జిల్లా

East Godavari

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు దాదాపు 6-8 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడచిన 24 గంటల్లో ఏపీలో మరో 8,601 పాజిటివ్ కేసులు నమోదు కాగా….మొత్తం కేసుల సంఖ్య 3,61,712కి చేరింది. గత 24 గంటల్లో 86 మంది మరణించగా…కరోనాతో ఇప్పటివరకు 3,368 మంది మరణించారు. ఇక, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. గడచిన 24 …

Read More »

ఘోరం.. ఐదంత‌స్థుల భ‌వ‌నం కుప్ప‌కూలిపోయింది

క‌రోనాతో అల్లాడిపోతున్న మ‌హారాష్ట్ర‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. రాయ్ గ‌ఢ్ జిల్లాలోని కాజ‌ల్ పురా ప్రాంతంలో ఓ భారీ భ‌వ‌నం ఉన్న‌ట్లుండి కుప్ప‌కూలిపోయింది. ఐదు అంత‌స్థుల ఈ భ‌వ‌నం పూర్తిగా కుప్ప‌కూలిపోగా.. శిధిలాల కింద 75 మంది వరకూ చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. 25 మంది ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డగా.. ఇంకో 50 మంది శిథిలాల్లో చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. వారిలో చాలామంది మ‌ర‌ణించి ఉంటార‌ని …

Read More »

తెలంగాణకు ఏమైంది? రెండో రోజు భారీగా కేసులు నమోదు

తెలంగాణకు ఇరుగుపొరుగున ఉన్న మహారాష్ట్ర.. ఆంధ్రప్రదేశ్.. కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదు కావటం తెలిసిందే. దేశంలో అత్యధిక కేసుల నమోదులో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్.. మూడో స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలుగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ.. ఈ మూడు రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో కేసుల నమోదు తక్కువగా ఉండేది. దీంతో.. కాస్తంత మెరుగ్గా ఉందనుకుంటున్న …

Read More »