Political News

పవన్ ఛలో అన్నాడు.. కేసు సీబీఐకి

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆంధ్రప్రదేశ్‌లో తాజా హాట్ టాపిక్.. తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది ఆలయంలో పురాతన రథం దగ్ధం కావడం. లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది అర్థం కాలేదు. ఏపీ ప్రభుత్వం జరిపిన విచారణలో ఏమీ తేలలేదు. పిల్లలెవరో తేనెపట్టును కాల్చే క్రమంలో రథం దగ్ధమైందంటూ ఒక కారణాన్ని తెరపైకి తెచ్చారు. అది అందరికీ చాలా కామెడీగా అనిపించింది. ఎంపీ …

Read More »

ఎందుకీ విన్యాసాలు పవన్?

భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరే వేరుగా ఉంటోంది. ఆ పార్టీని మెప్పించేందుకా అన్నట్లు ఆయన ‘హిందుత్వ’ ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. భాజపా అధినాయకత్వాన్ని మెప్పించేందుకు ఆయన అనేక పనులు చేశారు. ఆయన ట్వీట్లలో కూడా చాలా వాటిని పరిశీలిస్తే ‘బీజేపీ’ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇది పవన్‌ను అభిమానించే చాలామందికి నచ్చట్లేదు. ఈ విషయంలో ఆయన తన ఐడెంటిటీని కోల్పోతున్నారనే అభిప్రాయాలున్నాయి. …

Read More »

ఏపీలో కోటిమందిని టచ్ చేసి వెళ్లిన కరోనా

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న కొత్తలో వైరస్ పై ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల విపరీతంగా భయపడేవారు. క్రమక్రమంగా కరోనా లక్షణాలు, చికిత్స పై అవగాహన పెరగడంతో…కరోనాకు అతిగా భయపడకుండా అప్రమత్తంగా ఉంటున్నారు. తీవ్ర లక్షణాలు ఉన్నవారు మాత్రం ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఒక వేళ చాలామందిలో స్వల్ప లక్షణాలు కనిపించినా…వెంటనే హోం క్వారంటైన్ లో చికిత్స పొంది కరోనా నుంచి బయటపడుతున్నారు. ఇక, చాలామంది తమకు …

Read More »

న్యూస్ ఛానెల్ ముందు స్టార్ డైరెక్టర్ సంచలనం

జాతీయ న్యూస్ టీవీ ఛానెళ్లలో రిపబ్లిక్ టీవీ తీరు ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. ఆ ఛానెల్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అనుకూలం అన్నది అందరికీ తెలిసిన విషయమే. దేశంలో తనకున్నంత దేశభక్తి ఇంకెవరికీ లేదన్నట్లుగా ప్రొజెక్ట్ చేసుకునే ఆ ఛానెల్ అధినేత అర్నాబ్ గోస్వామి.. లౌకిక వాదులని చెప్పుకునే రాజకీయ, సినీ ప్రముఖుల మీద విరుచుకుపడుతుంటాడు. చాలామంది మీడియా వాళ్లు ఒక ప్రశ్న …

Read More »

కంగనా రనౌత్ పై 2 కేసులు నమోదు

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర సర్కార్‌ ల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్ధవ్ థాకరేను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఉద్దేశించి కంగనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా కంగనా రనౌత్‌పై ముంబైలో రెండు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే గౌరవానికి భంగం …

Read More »

జగన్ కోరి తెచ్చిన మనిషికి అద్దె కూడా ఇవ్వలేదా?

ఆంధ్రప్రదేశ్‌‌లో జగన్ సర్కారుకు ప్రతి రోజూ ఏదో ఒక వివాదం లేనిదే పొద్దు పోయేలా లేదు. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం గత ఆరు నెలల్లో ఎన్ని మలుపులు తిరిగింది.. దీని చుట్టూ ఎన్ని వివాదాలు చెలరేగాయి అన్నది తెలిసిందే. మధ్యలో ఆర్డినెన్స్ తెచ్చి మరీ రమేష్ కుమార్‌పై వేటు వేయించిన జగన్ సర్కారు.. ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్‌ను ఆ …

Read More »

3 రాజధానుల పై జగన్ కు లైన్ క్లియర్

ఏపీలో రాజధాని విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం గతంలోనే కేంద్రం హోం శాఖ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని హైకోర్టుకు కేంద్ర హోం శాఖ రెండు సార్లు సమర్పించిన అఫిడవిట్ లలో స్పష్టం చేసింది. అయితే, విభజన చట్టం ప్రకారం ఒకే రాజధాని ఉండాలని, మూడు రాజధానులు కాదని దాఖలైన పిటిషన్ …

Read More »

సచివాలయానికి వాస్తు దోషాలా ? ఎన్నిసార్లు మారుస్తారయ్యా ?

అమరావతిలో ఏ ముహూర్తంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మించారో తెలీదు కానీ అప్పటి నుండి వాస్తు మార్పులు చేయిస్తునే ఉన్నారు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీని చంద్రబాబునాయుడు హయాంలో నిర్మించారు. అయితే అప్పట్లోనే భవనాలకు అనేక చోట్ల మార్పులు, చేర్పులు చేశారు. ఎవరైనా తాముంటున్న ఇంటికి వాస్తు మార్పులు చేయించటంలో అర్ధముంది. ఎందుకంటే తాము నివసిస్తున్న ఇంటికి వాస్తు సరిగా లేకపోతే దాని ప్రభావం తమ భవిష్యత్తుపై పడుతుందన్న భావనతోనే …

Read More »

జనాలను నగదుతో టార్గెట్ చేస్తోన్న జగన్

ఏపీలో ఓ పక్క కరోనా విలయతాండవం చేస్తోన్నప్పటికీ తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం జగన్ కృత నిశ్చయంతో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆగస్టు 12న ఏపీలో 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75,000 నగదు అందించే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని …

Read More »

పెట్టుబడుల ఆశలన్నీ నత్వానీపైనే !

ఏపి నుండి అధికార పార్టీ రాజ్యసభ ఎంపిగా పరిమళ్ నత్వాని బుధవారం ప్రమాణ స్వీకారం చేశాడు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఛాంబర్లో సంబంధిత ఉన్నతాధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశాడు. ఏపి నుండి నత్వానీతో పాటు రాజ్యసభకు ఎంపికైన ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈమధ్యనే రాజ్యసభలోనే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పట్లో వివిధ కారణాల వల్ల నత్వాని ప్రమాణ స్వీకారం చేయలేదు. …

Read More »

‘కేసీఆర్ బతికే ఉన్నాడు.. ఏం కానీయుడు..’

తియ్యటి మాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా గురించి దేశ ప్రజలకు.. మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలకు పెద్దగా తెలీని వేళలో.. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటల క్లిప్పులు గడిచిన కొద్దినెలలుగా వాట్సప్ గ్రూపుల్లో తరచూ షేర్ కావటం తెలిసిందే. చాలా సింఫుల్ వైరస్ అన్నట్లుగా తేల్చేయటమే కాదు.. ఉష్ణోగ్రతలు కాస్త పెరగ్గానే.. కరోనా వైరస్ తోక ముడిచి …

Read More »

జగన్ ఇంటర్వ్యూ- అమరావతిపై తన ఆలోచన చెప్పేసిన జగన్

ఉద్యమాల పేరుతో ఎన్ని రోజులు ఆందోళనలు చేసినా, ప్రతిపక్షాలు ఎన్ని డిమాండ్లు చేసినా ఉపయోగం ఉండదనే అనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి డెసిషన్ చూస్తే అందరికీ ఇదే విషయం అర్ధమైపోయింది. హిందుస్ధాన్ టైమ్స్ కు జగన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వికేంద్రీకరణే తమ ఫైనల్ నిర్ణయంగా స్పష్టం చేశారు. వికేంద్రీకరణ అనే తమ నిర్ణయం నుండి వెనక్కు తగ్గేది లేదని జగన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఎవరెన్ని …

Read More »