Political News

ఆ ఫొటో క్రెడిట్ కోసం కొట్టేసుకుంటున్నారు

ఒక చిన్న పాప. వలస కార్మికుల కుటుంబానికి చెందిన అమ్మాయి అయ్యుండొచ్చు. రోడ్డు పక్కన జనాలతో కలిసి కూర్చుని ఉంది. ముందు ప్లేట్లో అన్నం, ఇంకా తినుబండారాలేవో పెట్టారు. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిండి తినే అవకాశం దొరికేసరికి మహదానందానికి గురైనట్లుగా కనిపిస్తోంది. ఆ పాప ఎంతో స్వచ్ఛంగా నవ్వుతున్న దృశ్యం చూస్తే తన కడుపు నిండుతోందన్న ఆనందం, ఆ తిండి దొరకడానికి ముందు ఆ చిన్నారి …

Read More »

అఫ్రిది నోటి దురుసు.. గడ్డి పెట్టిన గంభీర్

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిది అఫ్రిది ఈ మధ్యే తమ దేశంలో అభాగ్యుల్ని ఆదుకునేందుకు చేపట్టిన సేవా కార్యక్రమానికి సాయం చేయమంటూ భారత సీనియర్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్‌ సింగ్‌లను విన్నవించడం.. వాళ్లు అతడి విన్నపాన్ని మన్నించి విరాళాల సేకరణకు సాయం చేయడం తెలిసిందే. ఐతే భారతీయుల సహకారం కోరుతూ, అప్పుడప్పుడూ భారత్, పాక్ మధ్య సౌభ్రాతృత్వం గురించి మాట్లాడే అఫ్రిది.. కొన్నిసార్లు ఇండియా మీద విషం కక్కుతుంటాడు. …

Read More »

చికెన్ ధరలు ఆల్ టైం హై.. కారణమేంటి?

తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల కిందట చికెన్ ధరలు 50 రూపాయల దిగువకు పడిపోయాయి. కరోనా వచ్చిన కొత్తలో చికెన్ తింటేనే ఆ వైరస్ సోకుతుందన్న ప్రచారం గట్టిగా సాగింది. దీంతో జనాలు చికెన్ సెంటర్ల వైపు చూడటమే మానేశారు. సప్లై భారీగా ఉండగా.. సరఫరా తగ్గిపోవడంతో రేట్లు దారుణంగా పడిపోయాయి. కొన్ని చోట్ల కిలో 30-40 రూపాయలకు కూడా ఇచ్చారు. అయినా కూడా జనాలు చికెన్ కొనని పరిస్థితి …

Read More »

టీఆర్ఎస్ కు రావల్సిన మైలేజ్… బీజేపీ దక్కించుకుందా?

తరచి చూస్తే.. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత.. ఏదైనా భావోద్వేగ అంశాన్ని గులాబీ బాస్ కేసీఆర్ టేకప్ చేస్తే.. దాని ప్రయోజనాన్ని సొంతం చేసుకునే వరకూ వదిలిపెట్టేవారు కాదు. మరెవరూ ఆయన దరిదాపుల్లోకి వచ్చే వారు కాదు. అలాంటి సారుకు తొలిసారి కమలనాథుల కారణంగా షాక్ తగిలిందా?అంటే అవుననే చెప్పాలి. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా సీమకు తరలించేలా ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. …

Read More »

కరోనా కేసులు – రికార్డు సృష్టించిన భారత్

మనది 130 కోట్ల జనాభా. చాలా తక్కువ కేసులే వస్తున్నాయిలే… అనుకుంటూ సర్దుకుంటున్న భారతీయులకు రోజురోజుకు కొత్త షాకులు తగులుతున్నాయి. ఈరోజు కనీవినీ ఎరుగుని స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఎక్కడో వేరే దేశంలో ఇన్ని కేసులు నమోదైతే ఆశ్చర్యపోయిన మనం… ఇపుడు మనదేశంలోనే అన్ని కేసులు నమోదవడం చూస్తున్నాం. గత 24 గంటల్లో సుమారు 5 వేల కేసులు (సరిగ్గా 4987) నమోదయ్యాయి. ఇది భారత్ లో ఇప్పటివరకు రికార్డు. …

Read More »

సానియా మీర్జాలో మరో కోణం

హైదరాబాదీ అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. ఆట పరంగా ఎన్ని ఎత్తులు చూసినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో ఆమె అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఆమె పెళ్లి సైతం ఎంతో వివాదాస్పద రీతిలో జరిగింది. అంతకుముందు నిశ్చితార్థం రద్దు కావడమూ వివాదమే. ఇక భారత జెండా ముందు కాళ్లు చాపి కూర్చోవడం మొదలుపెడితే ఆమె చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. ఓ పాకిస్థానీని పెళ్లి చేసుకోవడం పట్ల ఎప్పుడూ సోషల్ మీడియాలో …

Read More »

లాక్ డౌన్ 4.0..ఇవే కొత్త రూల్స్‌

కరోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన లాక్‌డౌన్‌-3.0 ఆదివారంతో పూర్తి కానుండటంతో సోమవారం నుండి లాక్‌డౌన్‌ కొనసాగిస్తారా లేక సడలిస్తారా అన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈనెల 11న ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అభిప్రాయాలను సేకరించారు. అయితే, మెజార్టీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ కొనసాగింపును సమర్ధిస్తూనే కేంద్రం రాష్ట్రాలకు అవసరమైన ఆర్ధిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ నేప‌థ్యంలో …

Read More »

కరోనా అదుపులోకి వస్తేనే స్కూళ్లు !

పిల్లల చేసేదే అల్లరి. కలిసి ఆడుకోవడంలోనే వారికి సంతోషం. ఆటలు, చదువు తప్ప వారికి ఈ ప్రపంచంతో ఇంకేమీ సంబంధం లేదన్నట్లు జీవిస్తారు. ఏం చేయొద్దని చెబుతామో అది చేయడమే వారికి ఆనందాన్నిస్తుంది. కరోనా రాకుండా భౌతిక దూరం పాటించడం, మాస్కువేసుకోవడం వంటివి వారు 24 గంటలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటారనుకోవడం అసాధ్యం. వారి నుంచి మనం అది ఆశించడం కూడా తప్పు. అందుకే కరోనా అదుపులోకి రాకుండా స్కూల్స్ …

Read More »

డాక్ట‌ర్ సుధాక‌ర్.. అసలు ఏమైంది?

నెల కింద‌ట ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని న‌ర్సీప‌ట్నం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి చెందిన వైద్యుడు సుధాక‌ర్.. డాక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో మాస్కులు కూడా ఇవ్వ‌ట్లేదంటూ జ‌గ‌న్ స‌ర్కారు మీద విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసి వార్త‌ల్లో నిల‌వ‌డం, ఆ త‌ర్వాత ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డ‌టం తెలిసిన సంగ‌తే. ఇప్పుడాయ‌న విశాఖ‌ప‌ట్నంలో న‌డి రోడ్డుపై దారుణ‌మైన స్థితిలో క‌నిపించ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. మ‌ద్యం తాగారో లేక మ‌తి స్థిమితం త‌ప్పిందో కానీ.. ఆయ‌న …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భాగ్యం వారికేనట

ఎన్నిసార్లు చూసి తనివితీరని తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆయన భక్తులు ఎంతలా తపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి దర్శనాన్ని భక్తులకు బంద్ చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో మూసిన తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు.. భక్తుల కోసం త్వరలో తెరిచే అవకాశం ఉందంటున్నారు. లాక్ డౌన్ 4.0 ఉన్నా.. కొన్ని మినహాయింపులతోనే ఉంటుందన్న అభిప్రాయం …

Read More »

సుదీర్ఘ మీటింగ్… కేసీఆర్ ఏం చెప్పారు?

కొన్నిరోజులుగా హైదరాబాదులో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తుంటే… మరోవైపు రూరల్ తెలంగాణ కరోనా ఫ్రీ గా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులపై కేసీఆర్ మంత్రులు ఉన్నతాధికారులో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కరోనా ప్రధానంగా ఈ చర్చ జరిగినా… రానున్న వానాకాలంలో దీని విజృంభణకు అడ్డుకట్ట వేయడం అనేది మరో ప్రధాన అజెండాగా ఉంది. ఈ మీటింగ్ లో కేసీఆర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను …

Read More »

త్వరలో సాధారణ విమానాలు… ఇది అఫిషియల్

అన్నిటితో పాటు మార్చిలో విమానా రవాణా కూడా స్తంభించిపోయింది. విమానయాన చరిత్రలో ఇదే మొదటిసారి. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం… మళ్లీ విమానాలు తిరగనున్నాయి. కరో-నా ఇపుడు అదుపులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో జాగ్రత్తలతో సర్వీసులను పునరుద్ధరించేందుకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమైపోయింది.అయితే, మునుపటిలా ప్యాసింజర్ హక్కులు ఉండవు. ప్రయాణ నిబంధనలు అన్నీ మారిపోనున్నాయి. ఈ ఏడాది కేవలం దేశీయ విమాన సర్వీసులు మాత్రమే తిరిగే అవకాశం …

Read More »