Political News

ఏలూరులో వింత వ్యాధికి కారణం తెలిసిందా ?

ఏలూరులో కలకలం సృష్టిస్తున్న వింతవ్యాధికి కారణాలను ఎయిమ్స్ వైద్యులు కనుగొన్నారా ? అవుననే అంటున్నారు బీజేపీ రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు. ప్రజలు హఠాత్తుగా అస్వస్ధతకు గురవ్వటానికి ప్రధాన కారణం భారలోహం (లెడ్) సీసమే అంటున్నారు. ఏలూరులో చిన్నారులు, పెద్దవాళ్ళు శనివారం మధ్యాహ్నం నుండి హఠాత్తుగా ఉన్నవాళ్ళు ఉన్నటుండి పడిపోతున్న విషయం కలకలం సృష్టించింది. నోట్లోనుండి నురుగు వచ్చేయటం, కాళ్ళు చేతులు కొట్టుకుంటుండం అంటే ఫిట్స్ లాంటి సమస్యతో పడిపోతున్నారు. …

Read More »

తెలంగాణా పై జగన్ తొందరలోనే సంచలన ప్రకటన ?

తెలంగాణాలో పుంజుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారా ? జాతీయ పార్టీగా మొదలుపెట్టిన వైఎస్సార్సీపీ తన కార్యక్రమాలను ప్రస్తుతానికి ఏపికే పరిమితం చేసింది. అయితే పార్టీ పెట్టిన కొత్తల్లోనే అంటే 2014 ఎన్నికల్లోనే ఏపితో పాటు తెలంగాణాలో కూడా పోటీ చేసింది. ఖమ్మం ఎంపితో పాటు మూడు అసెంబ్లీ స్ధానాల్లో కూడా గెలిచింది. తర్వాత ఏపిపై దృష్టి పెట్టాల్సి రావటంతో తెలంగాణాను పట్టించుకోలేదు. దాంతో ఎంపి, ఎంఎల్ఏలు …

Read More »

జగన్ పై పెరిగిపోతున్న ఒత్తిడి

తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాల్సిన పరిస్దితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. నూతన వ్యవసాయ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి మద్దతు పెరిగిపోతోంది. నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తు ముందు పంజాబులో ఆందోళన మొదలైంది. తర్వాత ఆందోళన హర్యానాకు పాకింది. అక్కడి నుండి మహారాష్ట్ర, కర్నాటక, కేరళకూ పాకింది. మెల్లిగా పశ్చిమబెంగాల్, రాజస్ధాన్ రాష్ట్రాల్లోని రైతు సంఘాలు కూడా చేతులు కలుపుతున్నాయి. కాబట్టి జగన్ కూడా తన మద్దతు …

Read More »

తిరుపతిలో చిరంజీవి భజన వ్యూహాత్మకమేనా ?

రాజకీయాల్లో ఉండుంటే చిరంజీవి తప్పక ముఖ్యమంత్రయ్యేవాడే… ఇది తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. రాజకీయాల్లో ఉండుంటే, అక్కడి నుండి పోటీ చేసుంటే.. ఇలాంటి ఊహాగానాలను ఇపుడు పవన్ ఎందుకు మొదలుపెట్టారు ? ఇన్ని సంవత్సరాల తర్వాత హఠాత్తుగా చిరంజీవి ప్రస్తావన తేవటంలో ఉద్దేశ్యం ఏమిటి ? ఏమిటంటే చాలా వ్యూహాత్మకంగానే పవన్ తన సోదరుడు, ప్రజారాజ్యంపార్టీ గురించి ప్రస్తావన తెచ్చినట్లు అనుమానంగా ఉంది. దీనికంతటికీ కారణం …

Read More »

మొత్తానికి రంగంలోకి దిగిన పనబాక..చంద్రబాబుకు రిలీఫ్

ఇంతకాలం తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు జనాలను కూడా కన్ఫ్యూజ్ లోకి నెట్టేసిన పనబాక లక్ష్మి మొత్తానికి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన గెలుపుకోసం పనిచేయాలంటూ కొందరు సీనియర్ నేతలకు ఫోన్లో మాట్లాడారు. తిరుపతి వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో తిరుపతి లోక్ సభకు ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ముందుగా ఈ ఎన్నిక విషయంలో బీజేపీ హడావుడి మొదలుపెట్టింది. అయితే తన సహజత్వానికి భిన్నంగా చంద్రబాబు ఏకంగా …

Read More »

కాంగ్రెస్ : రెండు తెలుగు రాష్ట్రాలకు చెడ్డ రేవడి

కాంగ్రెస్ పరిస్ధితి చూస్తుంటే అందరికీ జాలిగా ఉంది. ఎలాంటి పార్టీ చివరకు ఎలాగైపోయిందన్నదే అందరినీ బాధిస్తోంది. మిగిలిన దేశమంతా పక్కన పెట్టేసినా సమైక్య రాష్ట్రంలో మాత్రం ఎంతగా వెలిగిపోయింది 2004-14 మధ్య. అంతకుముందు కూడా ఒకసారి ఓడి, మరోసారి గెలుస్తునే ఉన్నది. ఓడినా కూడా పార్టీ మాత్రం చాలా బలంగానే ఉండేది. అలాంటి పార్టీ ఇపుడు విజయాల కోసం టార్చి వేసి వెతికినా కనబడటం లేదు. పార్టీ ప్రస్తుత పరిస్దితికి …

Read More »

ఫైర్ బ్రాండ్ కు దెబ్బేయనున్న సౌమ్యుడు

తెలంగాణలో తిరుగులేనట్లుగా ఉన్న కాంగ్రెస్ తాజా పరిస్థితి ఎలా ఉందన్న విషయం తెలిసిందే. చేతిలో ఉన్న అధికారం చేజారి ఆరేళ్లు దాటిన తర్వాత కూడా అంతర్గత కుమ్ములాటలే తప్పించి.. చేజారిన పవర్ ను చేజిక్కించుకోవాలన్న కసి కాంగ్రెస్ నేతల్లో ఏ మాత్రం కనిపించకపోవటం తెలిసిందే. వరుస అపజయాలు.. ఆ మాటకు వస్తే.. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ఉనికి సైతం ప్రశ్నార్థకంగా మారిన దుస్థితి. ఇలాంటివేళ.. టీపీసీసీ …

Read More »

జ‌న‌సేన‌-బీజేపీల ప్ర‌చారం షురూ.. టికెట్‌పై తేల్చ‌కుండానే!

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం విష‌యంలో దూకుడుగా ఉన్న బీజేపీ-జ‌న‌సేన పార్టీలు అన‌ధికార ప్ర‌చారం మొద‌లు పెట్టేశాయి. పైకి తిరుప‌తి ఉప ఎన్నిక‌ను ప్ర‌స్తావించ‌కుండానే.. ఈ రెండు పార్టీల నాయ‌కులు కూడా ప్ర‌చారం ప్రారంభించాయ‌నే చెప్పాలి. నివ‌ర్ తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లోని రైతుల‌ను ఓదార్చుతా నంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌చారం ప్రారంభించేశారు. ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. కేవ‌లం తుఫాను బాధితుల‌ను ఓదార్చేందుకే అయితే.. ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌ల్లో స‌గం చాలు. కానీ, …

Read More »

భారత్ బంద్ కు పెరుగుతున్న మద్దతు

కేంద్రప్రభుత్వం ఆమోదించిన నూతన వ్యవసాయ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. దాదాపు నెలరోజులకు పైగా పంజాబ్, హర్యానాల్లో రైతులు కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంపై ఒత్తిడి పెంచటంలో భాగంగా పై రాష్ట్రాల్లోని రైతు సంఘాలు ఛలో డిల్లీ కార్యక్రమంలో ఉన్నాయి. దాదాపు 10 రోజులుగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో వంటా వార్పు లాంటి కార్యక్రమాలతో …

Read More »

అమ (రావతి) రులైన రైతులకు నివాళి

అమరులైన అమరావతి రైతులను ఆదుకోవటానికి అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని అశ్విన్ అట్లూరి మిత్రబృందం రామారావు కాజా ద్వారా 15 లక్షల ఆర్థిక సహాయం డిసెంబర్ 6 న ఉదయం 10 గంటలకు అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో అమరులైన రైతు కుటుంబాలకు అందజేశారు. ఉన్న ఎకరం ఊడ్చి ఇచ్చి ఉద్యమానికి ఊపిరిచ్చి శరీరాన్ని భూమికిచ్చి కుటుంబానికి మాత్రం కోత మిగిల్చి మనకి మాత్రం జవాబు లేని ప్రశ్ననిచ్చి జీవితాల్ని త్యాగం చేసిన అమరావతి రైతుల కుటుంబాల …

Read More »

మాన‌సిక ప్ర‌క్షాళ‌నా?.. మంత్రుల ప్రక్షాళ‌నా?

అనూహ్య విజ‌యంతో రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అధికార టీఆర్ఎస్ పార్టీకి అంతే అనూహ్య‌మైన ప‌రాభ‌వం తాజా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఎదురైంది. “తెలంగాణ కోసం.. తెలంగాణ బిడ్డ‌ల కోసం.. ఎంత‌కైనా సిద్ధ‌మే!” అన్న ఒక‌నాటి కేసీఆర్‌కు ఇప్ప‌టి కేసీఆర్‌కు మాట‌ల మ‌ధ్య వ్య‌త్యాసం లేక‌పోయినా.. చేత‌ల్లో స్ప‌ష్ట‌మైన వ్య‌త్యాసం కొట్టొ చ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్న విమ‌ర్శ‌ల‌ను తోసిపుచ్చిన ఫ‌లితంగానే ఇప్పుడు పార్టీ ప‌రిస్థితి …

Read More »

ఏలూరు నీళ్లలో ఏం కలిసింది?

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పట్టణమైన ఏలూరు ప్రజలు నిన్నట్నుంచి భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడి నీళ్లు కలుషితమై జనాల్లో విచిత్ర లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఏలూరు మున్సిపాలిటీ అందించే నీళ్లను ఎవరూ తాగొద్దంటూ జనాలకు హెచ్చరికలు జారీ అవుతుండటం కలకలం రేపుతోంది. ఏలూరులో శుక్రవారం రాత్రి ముగ్గురు, శనివారం పదుల సంఖ్యలో మంది అస్వస్థతకు గురై, కళ్లుతిరిగి పడిపోవడంతో అక్కడి ప్రజల్లో భయం మొదలైంది. శనివారం …

Read More »