Political News

లైట్ తీసుకున్నాం.. విధ్వంసం జరుగుతోంది

దేశవ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ నామమాత్రంగా నడుస్తోంది. లాక్ డౌన్ నుంచి మినహాయింపులు రాగానే కరోనా ప్రభావం తగ్గిపోయిందేమో అన్నట్లుగా జనాలు వైరస్‌ ప్రమాదాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఒకప్పుడు రోజుకు పదుల సంఖ్యలో కేసులు బయటపడుతుంటే.. ఒకరిద్దరు చనిపోతుంటేనే వణికిపోయిన జనాలు.. ఇప్పుడు వందలు వేలల్లో కేసులు వెలుగు చూస్తున్నా, పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నా మామూలు విషయం లాగే చూసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా …

Read More »

టీడీపీకి మాత్రం ఛాన్సే లేదు-నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు దూకుడు ఎంతమాత్రం తగ్గడం లేదు. తన వ్యాఖ్యలు తరచుగా వివాదాలకు దారి తీస్తున్నా.. ఆయన పట్టించుకోవడం లేదు. అగ్రెసివ్ కామెంట్లతో దూసుకెళ్లిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ చర్చలకు సంబంధించి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఆయన.. బాలయ్య, తెలుగుదేశం అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. AP లో వైసీపీ పార్టీ తరవాత అధికారం లోకి వైసీపీ వస్తుందా,jsp …

Read More »

హీరోల ఇగోలకు తలసాని బలయ్యారుగా

మహమ్మారి వైరస్ వల్ల అనివార్యమైన లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలతో పాటు సినీరంగం కూడా కుదేలైంది. షూటింగ్ లు ఆగిపోవడంతో సినీ కార్మికులు, రిలీజ్ లు ఆగిపోవడంతో థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు…ఒకరేమిటి…సినీ రంగానికి చెందిన పలువురు లాక్ డౌన్ వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, షూటింగులకు అనుమతినివ్వాలని సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కొందరు సినీ ప్రముఖులు కోరారు. ఈ విషయంపై చిరంజీవి ఇంట్లో …

Read More »

తెలంగాణలో తొలిసారి అత్యధిక కేసులు.. ఎందుకిలా?

ప్రపంచానికి షాకిస్తున్న మాయదారి మహమ్మారి వేగంగా కమ్మేస్తోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య పరిమితంగా ఉండటమే కాదు.. నియంత్రించే స్థాయిలో ఉందన్న మాట వినిపించేది. దీనికి తగ్గట్లే రోజువారీ కేసుల నమోదు కూడా తక్కువగానే ఉండేవి. అందుకు భిన్నంగా శుక్రవారం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదైన విషయాన్ని ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ స్పష్టం చేస్తోంది. ఇప్పటివరకూ ఎప్పుడూ లేనట్లుగా …

Read More »

సైకిల్ సెన్సేష‌న్.. ఇంటి ప‌క్క‌న టెంటు వేయాల్సొచ్చింది

జ్యోతికుమారి.. ఈ మ‌ధ్య కాలంలో మీడియాలో సెన్సేష‌న్‌గా మారిన పేరు. లాక్ డౌన్ టైంలో ప్ర‌జా ర‌వాణా లేక‌పోవ‌డంతో ఢిల్లీలోని గుర్గావ్ నుంచి బీహార్లోని సిరిహులి వ‌ర‌కు త‌న తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టి తొక్కుకుంటూ వ‌చ్చిందీ టీనేజీ అమ్మాయి. ఏకంగా 1200 కిలోమీట‌ర్ల దూరం ఆమె సాహ‌స యాత్ర సాగింది. దీనిపై మీడియాలో వార్త‌లు రావ‌డంతో జ్యోతి పేరు మార్మోగిపోయింది. ఆమె గురించి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ …

Read More »

విమానాలకూ మిడతల ముప్పు…

భారత్ లోని పలు రాష్ట్రాల్లోని పంటపొలాలపై మిడతల దండు స్వైర విహారం చేసి తీవ్ర నష్ట కలిగించిన సంగతి తెలిసిందే. ఓ వైపు తెలంగాణకు మిడతల దండు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో…తాజాగా మిడతల సెగ విమానాలకూ తాకింది. వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం పైలట్లు, ఇంజినీర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. కీలకలమైన ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని …

Read More »

బీజేపీ వర్సెస్ వైసీపీ… నిమ్మగడ్డతో ఇక మొదలైనట్టేనా

ఏపీ హైకోర్టులో వరుసగా జగన్ సర్కారు నిర్ణయాలను కొట్టేస్తూ తీర్పులు రావడం చూస్తూనే ఉన్నాం. ఈ వ్యవహారంలో ఏకంగా సీఎం తరఫు నుంచే కులం రంగు పులుముకుంది. ఆ తర్వాత అధికార పార్టీ నేతలు అదే బాటలో నడిచారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తప్పించడంపై హైకోర్టు జగన్ సర్కారును తప్పు పడుతూ తుది తీర్పు ఇచ్చింది. ఆయన్ని తొలగించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్‌ను …

Read More »

హైకోర్టు తీర్పుపై జగన్ సర్కారుకు పీకే ట్వీట్ పంచ్

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు న్యాయస్థానాల్లో వరుస పెట్టి ఎదురుదెబ్బలు తుగులుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగిస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవటం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే సమయంలో నిమ్మగడ్డ కులం మీద జగన్ స్వయంగా చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. ఒక ఉన్నతాధికారి మీద అధికారపక్షం స్పందించిన తీరు …

Read More »

బిగ్ బ్రేకింగ్.. ఏపీ సీఈసీ రీఎంట్రీ

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు హైకోర్టు మరో పెద్ద షాక్ ఇచ్చింది. వివాదాస్పద రీతిలో పదవి నుంచి తప్పించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేుష్ కుమార్‌ను తిరిగి ఆ పదవిలో నియమించాలని ఆదేశఆలు జారీ చేసింది. రమేష్ కుమార్‌ను తప్పించడం కోసమే జగన్ సర్కారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నియామకం, పదవీకాలం విషయమై కొత్తగా రూపొందించిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో …

Read More »

టీటీడీ ఆస్తుల అమ్మకంపై సంచలన నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 50 ఆస్తుల వేలం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజకీయంగా పెను దుమారం రేగింది. దీంతో, ఆ ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంపై నిషేధం విధించాలని టీటీడీ బోర్డు తీర్మానించింది. ఆన్ లైన్లో జరిగిన టీటీడీ …

Read More »

మరో పుల్వామా ఎటాక్.. త్రుటిలో తప్పింది

ఒకప్పటితో పోలిస్తే గత పదేళ్లలో ఇండియాలో ఉగ్రవాద దాడులు బాగా తగ్గాయి. ముఖ్యంగా 2014లో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక సామాన్య జనాలపై ఉగ్రవాద దాడులు దాదాపు లేవనే చెప్పాలి. ఐతే గత ఏఢాది మాత్రం పుల్వామాలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఒకేసారి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. దానికి ప్రతిగా భారత సైన్యం దీటుగా స్పందించింది. ఉగ్రవాదుల మీద భీకర దాడులు చేపట్టింది. సర్జికల్ స్ట్రైక్స్, ఇతర …

Read More »

ప్రత్యేక హోదా వస్తుంది – జగన్

ఏపీలో గత ఎన్నికలకు జగన్ తీసుకున్న అతి ముఖ్యమైన నినాదాల్లో ఒకటి ప్రత్యేక హోదా. ఈ విషయం గురించి తొలి రెండు నెలలు మాత్రమే కొంత చర్చ జరిగింది. మోడీని కలిసినపుడు ఆయనకు ఎక్కువ సీట్లు ఉన్నాయి. మనం డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేము, రిక్వెస్ట్ చేసుకోవాలి అని జగన్ అప్పట్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. ఆ తర్వాత పార్టీ ఆ విషయం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. దీంతో స్పెషల్ …

Read More »