YS వివేకా హత్య.. సుప్రీంకోర్టుకు సునీత!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి తాజాగా సంచలన పిటిషన్ ను దాఖలు చేశారు ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి. విషాదకరమైన విషయం ఏమంటే.. తన తమ్ముడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వేళ.. తన తండ్రి హత్యకు సంబంధించిన తమకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తున్న ఆమె తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సంప్రదించారు. తన తండ్రి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు.

అందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని.. సీబీఐను ప్రతివాదులుగా చేసిన వైనం సంచలనంగా మారింది. తన తండ్రి హత్య కేసు విచారణలో సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతి లేదని.. నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నట్లుగా ఆమెపిటిషన్ ను పేర్కొనటం గమనార్హం. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి స్వయంగా సోదరుడైన వ్యక్తి అత్యంత దారుణంగా ఆయన ఇంట్లోనే హత్యకు గురి కావటం..

అది హత్యగా కాకుండా సహజ మరణంగా చూపించేందుకుప్రయత్నాలు జరగటం.. ఈ ఉదంతంలో ఆరోపణలు చాలా స్పష్టంగా ఉన్న వేళ.. సీబీఐ విచారణ నెమ్మదిగా సాగటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నింటికి మించి.. తన బాబాయ్ అంటే తనకెంతో ప్రేమ అని చెప్పే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..తన బాబాయ్ హత్యకు కారణమైన నిందితులకు వెంటనే శిక్ష పడేలా ఒత్తిడి.. చేయాల్సిన రీతిలో చేయటం లేదన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

వివేకా సొంత అన్న కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మీద రావటం విస్మయానికి గురి చేస్తోంది. తన అక్క సుప్రీంకోర్టును ఆశ్రయించి.. పిటిషన్ దాఖలు చేసిన వేళ.. ఇప్పటికైనా ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సూచనలు వినిపిస్తున్నాయి. మరి.. ఇప్పటికైనా ఈ అంశంపై వైఎస్ జగన్ మరింత సీరియస్ గా ఫోకస్ చేస్తే బాగుంటుందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.