ఔను! ఇప్పుడు హిందూపురం ఎంపీ.. గోరంట్ల మాధవ్.. న్యూడ్ వీడియో కాల్ విషయం.. దేశవ్యాప్తంగా చర్చ కు వస్తోంది. ఈ విషయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎలాంటి చర్యలకు దిగుతారనేది ప్రధాన టాపిక్. పార్టీలోను, పార్టీ నేతల విషయంలోనూ.. జగన్.. క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారనేది ఎవరు ఔనన్నా.. కాదన్నా.. నిజం. అందుకే.. నాయకులు జగన్ తో మాట్లాడాలంటే.. కొన్ని కొన్ని విషయాల్లోచాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక, నాయకుల క్రమశిక్షణ …
Read More »మరో 15 మందిపై బీజేపీ కన్ను
తెలంగాణ బీజేపీ మరో 15 మంది కీలక నేతలపై కన్నేసిందా? వారిని కూడా త్వరలోనే పార్టీలోకి ఆహ్వానిం చనుందా? వారుకూడా సిట్టింగు ఎమ్మెల్యేలేనా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ చీఫ్ బండి సంజయ్. దీనికి సంబంధించి తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇంకా చాలా ఉప ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. తమతో 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని.. చెప్పారు. అధికార టీఆర్ ఎస్ నాయకులే …
Read More »వైసీపీ ఎంపీ వికృత చేష్ఠలు
వైసీపీ ఎంపీలపై ఇప్పటి వరకు అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే.. అవన్నీ.. ఇప్పుడు కాకపోతే.. మరో రోజైనా సరిదిద్దుకునేందుకు అవకాశం ఉన్నవే. కానీ, ఇప్పుడు వెలుగు చూసిన ఘటన మాత్రం సరిదిద్దుకు నే అవకాశం లేనిది. అదే.. హిందూపురం వైసీపీ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన ఒక సంచలన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఎవరు దీనిని చూసినా.. ముక్కున వేలేసుకుంటున్నారు. ఏం జరిగిందంటే.. …
Read More »ఆ సీనియర్ ఎమ్మెల్యే అసంతృప్తి.. ఇక తీరదు!
రాజకీయాల్లో కొన్ని కొన్ని విషయాలు అంతే! అవి శాశ్వతం కూడా! కొందరు నాయకుల అసంతృప్తి కూడా అంతే. అది ఎప్పటికీ నెరవేరే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అలాంటిదే.. వైసీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తి అంటున్నారు పరిశీలకులు. గత కాంగ్రెస్ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. తర్వాత.. రాష్ట్ర విభజనతో.. వైసీపీ నుంచి పిలుపు వచ్చినా.. అటుచూడకుండా.. సైకిల్ ఎక్కారు. అయితే.. …
Read More »తెలంగాణా కాంగ్రెస్ లో కొత్త పంచాయితి
కోమటిరెడ్డి రాజగోపాల్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేయటాన్ని అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తట్టుకోలేకపోతున్నారా? తాజాగా రేవంత్ విషయమై వెంకటరెడ్డి చేసిన డిమాండ్లు చూస్తే అందరికి ఇదే అనుమానం పెరిగిపోతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ పై చేసిన దారుణమైన కామెంట్లకు రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజానికి రేవంత్ ఆరోపణలు చేసింది కేవలం తమ్ముడు రాజగోపాల్ మీదేకానీ అన్న, దమ్ములు ఇద్దరినీ కలిపికాదు. రాజగోపాల్ మీడియా …
Read More »మునుగోడులో కూడా హుజూరాబాద్ వ్యూహమే?
మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీలో వేడి మొదలైంది. ఎంఎల్ఏగా రాజీనామా చేస్తున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రకటించారంతే. ఎప్పుడు చేసేది ఇంకా ఆయన చెప్పలేదు. రాజీనామా చేస్తే, దాన్ని స్పీకర్ ఆమోదిస్తే ఉపఎన్నిక జరిగే అవకాశముంది. అప్పుడు బీజేపీలో చేరిన తర్వాత మళ్ళీ రాజగోపాలే పోటీచేసే అవకాశముంది. కాబట్టి తమ పార్టీల తరపున ఎవరు పోటీ చేయబోతున్నారనే విషయాన్ని ప్రకటించాల్సింది టీఆర్ఎస్, కాంగ్రెస్సే. సరే కాంగ్రెస్ ను వదిలేస్తే …
Read More »జనాలకు ఉచితాలు వద్దు.. మరి ఎంపీల మాటేంటి?
ఎన్నికల సమయంలో ప్రజలకు ఉచిత హామీలు గుప్పించి.. పార్టీలు లబ్ది పొందుతున్నాయనే చర్చ తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. ఇలా చేయడం వల్ల ఖజానాకు నష్టం వచ్చి.. దేశం ఆర్థికంగా వెనుక బడిపోతోందని.. ప్రభుత్వాల అప్పులు పెరిగిపోతు న్నాయని.. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయం.. సుప్రీం కోర్టుకు చేరింది. దీనిపై సుప్రీం కోర్టు కూడా ఆసక్తిగానే స్పందించింది. ఉచితాలు …
Read More »రాష్ట్రంలో ఏ క్షణమైనా ఉప ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు మునుగోడు ఉపఎన్నిక.. మరోవైపు ముందస్తు ఎన్నికల గురించి ఆసక్తికర చర్చ నడుస్తోన్న నేపథ్యంలో.. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన మాజీమంత్రి తుమ్మల.. ముందస్తు ఎన్నికల గురించి కార్యకర్తలకు చూచాయగా సిగ్నల్స్ ఇచ్చారు. కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని.. ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త వినొచ్చని తుమ్మల వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానన్న తుమ్మల.. ఈసారి …
Read More »ఆ తప్పు ఎవరు చేశారో.. జగన్ చెప్పాలి
పోలవరంపై టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. ప్రజలు నష్టపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, బావర్ వంటి అంతర్జాతీయ సంస్థలకు ఏమీ తెలియదా? అని ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల వచ్చిన నష్టానికి బాధ్యులెవరో నిర్థారించాలని, తప్పు ఎవరిదో సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబు చెప్పాలన్నారు. ఆనాడు డయాఫ్రమ్ వాల్ కట్టాలని చెప్పినోళ్లే.. ఇప్పుడు …
Read More »వైసీపీ మాకు శాశ్వతం కాదు.. : వైసీపీ ఎమ్మెల్యే
వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఒకవైపు.. తీవ్రస్థాయిలో పొలిటికల్ సెగ రాజుకుంది. అధికార పార్టీలో కీలక నాయకులు.. పక్క చూపులు చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా..వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో లేదో.. అనే భావన ఉన్నవారు.. ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో రాజకీయాలు మరింత వేడిగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు.. మరింత మంటపుట్టిస్తున్నాయి. కాపు సామాజిక వర్గం ఎక్కువగా …
Read More »కొరివితో తల గోక్కుంటున్న వైసీపీ
రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మామూలే. ఐతే ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసేటపుడు అన్నిసార్లూ గుడ్డిగా ఎదురు దాడి చేయకూడదు. ప్రతి విషయాన్నీ తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూడకూడదు. విషాదంతో, ఎమోషన్లతో ముడిపడ్డ విషయాలను వివాదం చేయాలని చూస్తే బూమరాంగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేస్తున్నది ఆ కోవలోకే వచ్చేలా ఉంది. ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి మరణం మీద వివాదం రాజేయాలని …
Read More »హమ్మయ్య.. మునుగోడుకు మోక్షం వచ్చిందే!
కొన్ని కొన్ని సార్లు చిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. ఎంకి పెట్టి.. సుబ్బిచావు.. అన్నట్టుగా.. కొన్ని కొన్ని కార్యాకారణ సంబంధాలతో ముడిపడి కొనసాగుతాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటన తెరమీదికి వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తాజాగా పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలోకి చేరడానికి ముహూర్తం కూడా ఖాయం చేసుకున్నారు. ఇది రాజకీయ దుమారానికి దారితీసిన విషయం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates