Political News

క‌ట్టండ‌హో: చెత్త పన్ను అయిపోయింది.. ఇక‌, నీటి మీట‌ర్లు..!

ఏపీలో రాజ‌న్న రాజ్యం తెస్తానంటూ 2019 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌చారం దంచికొట్టిన వైసీపీ అధినేత, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌.. రాజన్న రాజ్యం స్థానంలో మోడీ రాజ్యం తీసుకువ‌చ్చార‌నే విమ‌ర్శ‌లు జోరుగా వినిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ స‌ర్కారు రాష్ట్రాల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. వెంట‌నే అమ‌లు చేసేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఏపీనే! నిజానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మోడీ తీసుకున్న నిర్ణ‌యాలు అక్క‌డి ముఖ్య‌మంత్రులు చెత్త‌బుట్ట‌లో ప‌డేస్తున్నారు. …

Read More »

 పవన్ కంటే ముందు షర్మిలకు రూట్ మ్యాప్ ఇచ్చేసిందా ?

తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ మెల్లమెల్లగా బీజేపీ చేతిలోకి వెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటు ఏపీలో బీజేపీ రూట్ మ్యాప్ ప్రకారం పనిచేస్తానని గతంలో పవన్ కల్యాణ్ చెప్పినప్పటికీ ఆయనకు ఇంకా పూర్తిగా రూట్ మ్యాప్ అందినట్లుగా లేదు. ఈలోగా తెలంగాణలో వైఎస్ షర్మిలకు బీజేపీ ఫుల్ రూట్ మ్యాప్ ఇచ్చినట్లుగా బీజేపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. ఆ క్రమంలోనే షర్మిల ఒక్కసారిగా దూకుడు పెంచి బీఆర్ఎస్ నేత కేసీఆర్‌కు నిద్ర …

Read More »

బీఆర్ ఎస్‌-వైసీపీ క‌లిసి పోటీ చేస్తున్నాయా?

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఎలాంటి వ్యూహాలైనా తెర‌మీదికి రావొచ్చు. అవ‌స‌రం-అవ‌కాశం-అధికారం.. అనే కీల‌క ప‌రిణామాలు…. రాజ‌కీయాల‌ను, నాయ‌కుల‌ను ఎటువైపైనా మ‌లుపు తిప్ప‌వ‌చ్చు. ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌ల్లోనూ అదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కార్యాకార‌ణ సంబంధంగా.. అటు ఢిల్లీలో టీఆర్ ఎస్ పార్టీని బీఆర్ ఎస్‌గా మార్చేందుకు అనుమ‌తిస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌చ్చ‌జెండా ఊపింది. అదే రోజు.. ఇటు ఏపీలో వైసీపీ కీల‌క నాయ‌కుడు, స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి …

Read More »

కొడాలికి మళ్లీ జూనియర్ ఎన్టీయారే గతా?

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ జూనియర్ ఎన్టీయార్ జపం చేస్తున్నారు. ఎన్టీయార్ వారసత్వాన్ని అడ్డుకోవాలని, జూనియర్ ను పాతాళానికి తొక్కేస్తున్నారని అంటున్నారు. చాలా రోజుల తర్వాత నోరు విప్పిన కొడాలి ఇప్పుడు జూనియర్ ను ఎందుకు రాజకీయాల్లో లాగుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నా… ఆయనకున్న అనివార్యతలు అలాంటివని బాగా తెలిసిన వాళ్లు చెబుతున్నారు.. నిజానికి కొడాలి నాని ఒక ఫైర్ బ్రాండ్. మనసులో పడిన మాట బయట పెడతారు. …

Read More »

టీడీపీ కి జ‌గ‌న్ లాగా చేసే ధైర్యం వుందా?

ఔను.. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను చూసుకుని, వారి వేస్తున్న‌వ్యూహాల‌ను చూసుకుని కుళ్లుకుంటే ఏమొస్తుం ది? గుజ‌రాత్‌లో ఇదే జ‌రిగింది. బీజేపీ వేస్తున్న ఎత్తుగ‌డ‌లు చూసుకుని.. కాంగ్రెస్ పార్టీ కుళ్లుకుంది. ఓటు వేసి.. ప్ర‌ధాని మౌనంగా రాకుండా.. ర్యాలీగా వ‌చ్చార‌ని, ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేశార‌ని.. ఇది త‌ప్పుకాదా! అని మీడియాకు స్టేట్‌మెంట్లు ఇచ్చింది. ప‌త్రిక‌ల్లోనూ ఘ‌నంగానే ఈ వార్త వ‌చ్చింది. కానీ, ఏం జ‌రిగింది. బీజేపీ గెలిచింది. మోడీ అలా చేసిన‌ప్పుడు.. కాంగ్రెస్ …

Read More »

జగన్ .. నీ తెలివి ఎవ‌రికీ లేద‌య్యా!

తెలివి తేట‌లు ఎవ‌రి సొంతమూ కాదు! ఇది నానుడి మాత్ర‌మే అనుకునే వారికి ఏపీ సీఎం ఝ‌ల‌క్ ఇస్తున్నారు. పాల‌న‌లో ఎలా ఉన్నా.. త‌న సొంత ప‌త్రిక‌ను కొనిపించే విష‌యంలో ఆయ‌నకు ఆయ‌నే సాటి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సాక్షి మీడియా జ‌గ‌న్ సొంతమ‌నే విష‌యం తెలిసిందే. అయితే, ఈ ప‌త్రిక‌ను ఏపీలో ఎంత‌మంది కొంటున్నారు.. అనేది ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు దీనిని బ‌లవంతంగా కొనిపిస్తున్నార‌నేది పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. …

Read More »

జ‌గ‌న్ ను స‌రిగా పెంచ‌మ‌ని వైఎస్‌కు చెప్పా.. చంద్ర‌బాబు

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మెడ మీద క‌త్తి పెట్టి ఆస్తులు రాయించుకునే ర‌క‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. గ‌తంలో వైఎస్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడే.. జ‌గ‌న్ గురించి హెచ్చ‌రించిన‌ట్టు చెప్పారు. నీ కొడుకును స‌రిగా పెంచు. మా అబ్బాయి విదేశాల్లో చ‌దువుతున్నాడు. మీ అబ్బాయిని కూడా విదేశాల‌కు పంపించావు. జాగ్ర‌త్త‌! అని అసెంబ్లీలోనే వైఎస్‌కు చెప్పిన‌ట్టు తెలిపారు. కానీ, వైఎస్ …

Read More »

జెండా అదే.. అజెండానే మారింది

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అనుకున్న‌ది సాధించే ఘ‌టంగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం.. ఏర్పాటు చేసిన టీఆర్ ఎస్ ఉద్య‌మ‌ పార్టీని త‌ర్వాత‌.. కాలంలో రాజ‌కీయ పార్టీగా మార్పు చేశారు. రాష్ట్ర సాధ‌న అనంత‌రం.. టీఆర్ ఎస్‌ను పొలిటిక‌ల్ పార్టీగా మార్చిన‌ట్టు ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇక‌, ఇప్పుడు అదేపార్టీని జాతీయ రాజ‌కీయాల కోసం.. భార‌త రాష్ట్ర‌స‌మితిగా మార్చారు. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమ‌తి …

Read More »

డ్యాం షూర్‌: ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు..!

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తోంద‌నే వార్త‌లు త‌రుచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, దీనికి సంబంధించి ఎవ‌రూ పెద్ద‌గా స్పందించ‌డం లేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం ముంద‌స్తే కాదు.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెట్టినా తామురెడీగానే ఉన్నామ‌ని చెబుతున్నారు. కానీ, వైసీపీ నేత‌లు మాత్రం ముంద‌స్తు ఉండ‌ద‌ని.. 18 నెల్ల‌లో వ‌చ్చే సార్వ‌త్రిక స‌మ‌ర‌మే ఉంటుంద‌ని చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా బీజేపీ కీల‌క‌నాయ‌కుడు స‌త్య‌కుమార్ …

Read More »

బీఆర్ఎస్ తొలి పరీక్ష అక్కడే..

కేసీఆర్ కేంద్రంతో కయ్యం పెట్టుకుని తన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చారు. ఇందకు ఎన్నికల కమిషన్ అనుమతులూ రావడంతో ఈ రోజు భారీస్థాయిలో ఆవిర్భావ ఉత్సవమూ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేడీ(ఎస్) నేత హెచ్‌‌డీ కుమారస్వామి హాజరయ్యారు. దేశ రాజకీయాల్లో స్థానం సంపాదించాలని.. బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ క్రమంలోనే ఆయన ఇదంతా చేస్తున్నారు. అయితే, జాతీయ …

Read More »

కారు నుంచి క‌ట్ డ్రాయ‌ర్ వ‌ర‌కు.. వైసీపీ పై ప‌వ‌న్ ఫైర్‌

ఒక్క మాట‌ని వంద అనిపించుకోవ‌డం అంటే ఇదేనేమో..! అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వైసీపీ నేత‌లు చేస్తున్న కామెంట్లుకు అంతే వేగంతో ప‌వ‌న్ కూడా రియాక్ట్ అవుతున్నారు. వారు ఒక‌టంటే.. ప‌వ‌న్ వంద అనేస్తున్నాడు. తాజాగా మాజీ మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ ఇప్ప‌టికీ కౌంట‌ర్లు ఇస్తూనే ఉన్నారు. జనసేన ఎన్నికల ప్రచార వాహ‌నం వారాహి రంగులపై పేర్ని నాని చేసిన‌ విమర్శలకు వ‌రుస‌గా …

Read More »

గృహ సార‌థులు.. జగనన్న మాస్ట‌ర్ ప్లాన్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. ఆయ‌న త‌ర‌చుగా చెబుతున్న‌ట్టు.. గెలిచితీరాల‌నే సంక‌ల్పాన్ని నెర‌వేర్చుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా.. ఎవ‌రికీ ఇబ్బంది లేని రీతిలో వ్యూహాత్మ‌క రాజ‌కీయానికి తెర‌దీశారు. అదే.. గృహ సార‌థులు కాన్సెప్ట్‌. దీనిని సీఎం జ‌గ‌న్ తాజాగా త‌న పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త‌లు, ప‌రిశీల‌కులకు చెప్పారు. గృహ సార‌థులు అంటే.. ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఇద్ద‌రు వ‌లంటీర్ల‌ను నియ‌మిస్తారు. …

Read More »