రాహుల్ కీలక నిర్ణయం తీసుకున్నారా?

Rahul Gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే అధ్యక్ష పదవికి దూరంగా ఉండాలనట. నిజానికి పార్టీకి అధ్యక్షపగ్గాలు తీసుకోవాలని రాహుల్ అనుకుంటే దాన్ని వ్యతిరేకించేంత సాహసం చేసేవాళ్ళు పార్టీలో ఎవరు ఉండరు. అయితే 2019లోనే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ వదులుకున్న విషయం అందరికీ తెలిసిందే. వరుసగా రెండుసార్లు పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమికి బాధ్యత వహిస్తు అప్పట్లో అధ్యక్షుడిగా రాజీనామాచేశారు.

ఆ తర్వాత సోనియాగాంధి, ప్రియాంక గాంధీతో పాటు ఎంతమంది చెప్పినా రాహుల్ మళ్ళీ పగ్గాలు అందుకోలేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే తన మాటను పార్టీలోని సీనియర్లు పడనీయకపోవటమే. అధ్యక్షుడిగా తాను ఒక నిర్ణయం తీసుకుంటే కొందరు సీనియర్లు వెంటనే సోనియాపై ఒత్తిడి తెచ్చి ఆ నిర్ణయాన్ని అమలు కానీయకుండా అడ్డుకుంటున్నారని రాహుల్ కు బాగా కోపంగా ఉందట. దీనికి పార్టీవర్గాలు రెండు ఉదాహరణలను చూపుతున్నాయి.

అవేమిటంటే మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జ్యోతిరిధిత్య సింథియాను, రాజస్ధాన్లో సచిన్ పైలెట్ కు అధికారం అప్పగించాలని రాహుల్ అనుకున్నారు. ఎందుకంటే పై రెండురాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి రావటంలో ఈ ఇద్దరి యువనేతల పాత్ర చాలావుంది. అయితే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్నది కమలనాధ్, అశోక్ గెహ్లాట్. రాహూల్ నిర్ణయాన్ని వ్యతిరేకించే సీనియర్లంతా ఏకమై సోనియా నెత్తిన కూర్చుని ముఖ్యమంత్రి అభ్యర్ధులను మార్చేట్లుగా రాహుల్ ను ప్రభావితం చేశారట.

ఇలాంటి అనేక సందర్భాల్లో రాహుల్ నిర్ణయాలు అమలుకాలేదట. దాంతో సీనియర్ల కోటరీని ఏమీచేయలేక, తల్లి సోనియాను థిక్కరించి నిర్ణయాలను అమలుచేయలేక చివరకు అధ్యక్షపదవికే రాజీనామా చేసేశారు. పార్టీలో సీనియర్లున్నంతవరకు తాను స్వతంత్రంగా ఏమీచేయలేనని రాహుల్ కు అర్ధమైపోయిందట. అందరినీ దూరంపెట్టేవరకు పార్టీపగ్గాలు తీసుకోకూడాదని నిర్ణయం కారణంగానే రేపటి అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ పాల్గొనకూడదని అనుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.