రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతల వ్యవహారమే చాలా విచిత్రంగా మారిపోయింది. మరి ఏమి చూసుకుని రెచ్చిపోతున్నారో తెలీదు కానీ తిరుపతి పార్లమెంటు ఉఫఎన్నికలో గెలుపు తమదే అంటు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇంతటితో ఆగితే బాగానే ఉండేది 2024లో రాష్ట్రంలో అధికారంలోకి కూడా వచ్చేస్తున్నామంటూ భీకర ప్రకటనలు చేసేస్తుండటమే అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తోంది. గెలుపు సంగతి పక్కనపెట్టేస్తే అసలు బీజేపీకి తన ప్రత్యర్ధి ఎవరో అయినా తెలుసా అనే …
Read More »జగన్ ప్రభుత్వంలో లాయర్లు మాత్రం హ్యాపీ
అవును మీరు చదివింది నిజమే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఏ వర్గాలు హ్యాపీగా ఉన్నాయనే విషయాన్ని పక్కన పెట్టేస్తే లాయర్లు మాత్రం చాలా హ్యీపీగా ఉన్నారట. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరో ఒకరు ఏదో రూపంలో కేసులు వేయటం దానికి కౌంటర్లుగా ప్రభుత్వం తరపున వాదించటానికి లాయర్లు రెడీ అవటం రెగ్యులర్ అయిపోయింది. మామూలుగా ప్రభుత్వం తరపున వాదించేందుకు అడ్వకేట్ జనరల్, అడిషినల్ అడ్వేకట్ జనరల్ ఎలాగూ ఉంటారు. …
Read More »అమరావతిపై మరీ ఇన్ని అబద్ధాలా ?
‘రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని నాకు బీజేపీ అగ్ర నేతలు స్పష్టంగా చెప్పారు’ ఇది తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాట. రాజధాని ప్రాంతంలోని రైతుల కుటుంబాలతో పాటు జనసైనికులతో జరిగిన సమావేశంలో పవన్ చెప్పిన మాటలు. పవన్ చేసిన తాజా ప్రకటన ఫక్తు అబద్ధమని అర్ధమైపోతోంది. ఒకవైపు రాజధాని వివాదంపై కోర్టులో నడుస్తున్నకేసులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజధాని అంశంపై ఒకసారి …
Read More »జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన ప్రభావమెంత?
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగింది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. మొత్తం ప్రక్రియ కేవలం 20 రోజుల్లోనే ముగియనుంది. అయితే, ఈ దఫా జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో చిత్రమైన రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్ కు దుబ్బాక ఉప పోరులో గట్టి ఎదురు దెబ్బతగలడం.. పుంజుకుంటుందా? అనే సందేహాల నుంచి బీజేపీ దుబ్బాకలో పాగా వేయడం వంటివి ఆసక్తికర అంశాలు. …
Read More »యువనేతలిద్దరికీ మంచి బహుమానమే దక్కబోతోందా ?
అవును ఢిల్లీ సర్కిళ్ళల్లో ఇపుడిదే అంశంపై చర్చలు జోరుగా మొదలైపోయాయి. మామూలుగా అయితే మంచి ప్రతిభ కనబరచిన వారికో లేకపోతే పనితీరుతో పార్టీని విజయతీరాలకు చేర్చినందుకో నేతలకు ప్రమోషన్ రావటం సహజం. కానీ ఇక్కడ బీజేపీ అగ్రనేతల వ్యవహార శైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మధ్యప్రదేశ్, బీహార్ ఎన్నికల్లో తమకు పరోక్షంగా సాయపడిన కారణంగా ఇద్దరు యువనేతలను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ …
Read More »తిరుపతిలో హీట్ పెంచేసిన చంద్రబాబు
తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. తన సహజ స్వభావానికి విరుద్ధంగా చంద్రబాబునాయుడు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటించేశారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేతలతో జూమ్ కాన్ఫరెన్సులో మాట్లాడినపుడు పనబాక లక్ష్మీనే అభ్యర్ధిగా ప్రకటించేశారు. చంద్రబాబు చేసిన అభ్యర్ధి ప్రకటనతో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అభ్యర్ధిని చంద్రబాబు ప్రకటిస్తారని నేతలెవరు ఊహించలేదు కాబట్టే. ఎన్నికలు …
Read More »పవన్ ప్రచారం చేస్తాడా?
2014లో జనసేన పార్టీనైతే మొదలుపెట్టాడు కానీ.. కొన్ని నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు. ఐతే సొంతంగా పోటీ చేయకున్నా.. ఆయన ప్రచారం చేసిన తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ కూటమి గెలవడంతో పవన్ ఇమేజ్ పెరిగింది. కానీ గత ఏడాది నేరుగా ఎన్నికల బరిలో దిగితే మాత్రం చేదు అనుభవం ఎదురైంది. జనసేనకు ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే దక్కింది. ఎంతో ఆలోచించి వ్యూహాత్మకంగా …
Read More »ప్రభుత్వం-నిమ్మగడ్డ మధ్య మరో ‘పంచాయితి’ తప్పదా ?
రాష్ట్రప్రభుత్వంతో మరో వివాదానికి స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడీ అయిపోయినట్లే అనుమానంగా ఉంది. ఆ ఉద్దేశ్యం లేకపోతే ఏకపక్షంగా ఎన్నికల నిర్వహణకు రెడీ అవ్వరు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకోవద్దని సుప్రింకోర్టు చెప్పినా నిమ్మగడ్డ వినలేదు. ఫిబ్రవరిలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు కమీషనర్ ఓ ప్రకటనలో స్పష్టం చేయటమే ఇందుకు నిదర్శనం. పైగా ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతే షెడ్యూల్ …
Read More »క్లారిటీ లేని ఏకైక నేత పవనేనా?
రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఏమాత్రం బాధ్యత లేకుండా హ్యాపీగా తిరిగేస్తున్ననేత ఎవరైనా ఉన్నారా ? అంటే అది జనసేన అధినేత పవన్ కల్యాన్ మాత్రమే అని ఎవరైనా సమాధానం చెప్పేస్తారు. ప్రశ్నించేందుకు రాజకీయ పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ తాను ఎవరిని ప్రశ్నించాడు? ఎవరిని ప్రశ్నిస్తున్నాడనే విషయాల్లో మాత్రం క్లారిటి లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇంత గందరగోళంగా రాజకీయ పార్టీని నడుపుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే దేశం మొత్తం …
Read More »కాంగ్రెస్ ఇప్పుడే కళ్లు తెరిచిందా? వ్యూహం ఏంటి?
రాష్ట్ర విభజనతో ప్రజా విశ్వాసాన్ని సంపూర్ణంగా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. పుంజుకునే ప్రయత్నాలను.. ఇప్పడిప్పుడే మొదలు పెట్టిందా? మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో ఆ పార్టీ దొంగలు పడ్డ ఆర్నెల్ల తర్వాత.. అన్నచందంగా కార్యాచరణ ప్రారంభించిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అమరావతి పరిరక్షణ సమితి కమిటీ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఇక నుంచి అమరావతిపై పోరు సల్పుతుందని.. …
Read More »త్రిమూర్తుల రాజకీయం.. ఎక్కడైనా.. ఇంతేనా?!
ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారిన విషయం.. తోట త్రిమూర్తులు రాజకీయం! సీనియర్ నాయకుడిగా.. కాపు నేతగా.. ఫైర్ బ్రాండ్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయన పేరుమోశారు. పార్టీలతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్‌ను కన్‌స్ట్రక్ట్ చేసుకున్న నాయకుల్లో తోట త్రిమూర్తులు ఒకరు. ఇది ఆయనకు మేలు చేసే పరిణా మమే అయినా.. తన దూకుడునే తనకు శత్రువుగా పెంచుకున్నారనే విమర్శలు కూడా …
Read More »టీడీపీకి నాన్ లోకల్ లీడరే దిక్కా ?
తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ బలహీనంగా ఉంది. ఇందుకు ఒకరకంగా నాయకత్వమే కారణమని చెప్పాలి. ప్రతి ఎన్నికకు ఓ అభ్యర్ధిని కొత్తగా తెరపైకి తెస్తోంది. అదికూడా ప్రధానంగా నాన్ లోకల్ నేతలను తీసుకొచ్చి తిరుపతి పార్టీపై రుద్దుతోంది. తాజాగా జరిగింది కూడా ఇదే. సోమవారం తిరుపతి లోక్ సభ పరిధిలోని పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు జూమ్ కాన్ఫరెన్సులో మాట్లాడుతు రాబోయే లోక్ సభ ఉపఎన్నికల్లో పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా …
Read More »