Political News

రాహూల్ ను లోకేష్ ఆదర్శంగా తీసుకుంటాడా ?

ఉత్తరప్రదేశ్ లో గురువారం జరిగిన ఓ సంఘటనతో దేశం మొత్తం కాంగ్రెస్ నేత రాహూల్ గాంధి గురించే మాట్లాడుకుంటోంది. ఉత్తరప్రదేశ్ లోని హథ్రస్ లో ఓ అమ్మాయిపై హత్యాచారం జరిగిందనే ఆరోపణలతో రాష్ట్రం అట్టుడుకిపోతోంది. ఈ ఘటన నేపధ్యంలోనే రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హథ్రస్ లో పర్యటించారు. వీళ్ళని నిలుపుదల చేసే ఉద్దేశ్యంతో పోలీసులు అక్కా, తమ్ముళ్ళ విషయంలో ఓవర్ యాక్షన్ చేశారు. హథ్రస్ లో ఘటన జరిగిన …

Read More »

జగన్ రూపంలో గాంధీ మళ్లీ పుట్టాడా?

మహాత్మా గాంధీజీతో ఆయన కాలంలోని మహా నాయకుల్ని పోల్చినా కూడా అభిమానులకు రుచించదు. అంత గొప్ప నాయకుడాయన. ఇక రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయిన తర్వాతి కాలంలో గాంధీతో ఎవరినైనా పోల్చడం అంటే సాహసమే. ముందు తరంలో అయినా వాజ్‌పేయి లాంటి గొప్ప నేతలున్నారు కానీ.. ఇప్పటి నేతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రస్తుత నాయకుల్లో ఒక మంచి లక్షణాన్ని అభిమానులు చూపిస్తే.. పది ప్రతికూల లక్షణాలను …

Read More »

ఆ 12వేల కోట్ల కోసమే సింఘాల్ బదిలీ?

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక బదిలీపై ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాత్రికి రాత్రే అనిల్ సింఘాల్ ను ఆరోగ్య శాఖ కార్యదర్శిగా బదిలీ చేయడం….వెంటనే సింఘాల్ స్థానంలోకి ఆరోగ్యశాఖ కార్యదర్శి జవహర్ రెడ్డిని నియమించడం…ఇవన్నీ చకచకా జరిగిపోవడంపై చర్చ నడుస్తోంది. ఓ పక్క తిరుమల డిక్లరేషన్ వ్యవహారంపై చెలరేగిన వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది…మరోవైపు బ్రహ్మాత్సవాలలో పాల్గొన్న మంత్రుల …

Read More »

కొత్త ట్రెండ్ .. కొడుక్కి జండా… తండ్రికి ఎంట్రీ

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ట్రెండ్ అమల్లోకి తీసుకొచ్చింది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నంత కాలం జరిగిన పార్టీ ఫిరాయింపులు అందరికీ తెలిసిందే. అప్పట్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను నేరుగా తెలుగుదేశంపార్టీలోకి లాగేసుకున్నారు. ఈ విషయంలో అప్పట్లో వైసిపి ఎంత గగ్గోలు పెట్టిందో అందరు చూసిందే. కాలం ఐదేళ్ళు గడిచేసరికి సీన్ రివర్సయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. అయితే, …

Read More »

ఏపీ సర్కారుకు హైకోర్టు సివియర్ వార్నింగ్

రాష్ట్రంలో రోజురోజుకు ప్రభుత్వానికి, న్యాయవ్యవస్ధకు మధ్య అగాధం పెరిగిపోతున్నట్లే ఉంది. జడ్జీలు, న్యాయమూర్తుల పనితీరుపై అధికార పార్టీలోని కొందరు మంత్రులు, నేతలు చాలా ఘాటుగా కామెంట్లు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోవటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా కేసులు వేస్తే వెంటనే అడ్మిట్ చేసుకుంటోంది హైకోర్టు. పరిపాలనా సంబంధిత విషయాల్లోనే కాకుండా వివిధ అవినీతి ఆరోపణలపై విచారణలు ముందుకు సాగకుండా హైకోర్టు కొన్ని …

Read More »

ఏకమైన పాత మిత్రులు..నాయకత్వం చొరవే కారణమా ?

విజయనగరం జిల్లా అధికారపార్టీలో ఇపుడిదే అంశంపై జోరుగా చర్చలు జరుగుతోంది. జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పుగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా కాలంగా వీళ్ళద్దరి మధ్య మాటలు కూడా పెద్దగా ఉండటం లేదు. అలాంటి ఈ ఇద్దరు కొద్ది రోజులుగా జిల్లాలో చట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి వీళ్ళద్దరు ఒకపుడు ఆప్తమిత్రులే. కానీ మద్యలో ఏమైందో ఏమో …

Read More »

రైతులకు వంశీ ఓ ఉచిత సలహా.. ఓ బంపర్ ఆఫర్

రాజధాని అమరావతి కోసం దాదాపు 270 రోజులుగా పోరాటాలు చేస్తున్న రైతులకు గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ ఉచిత సలహా ఇచ్చారు. రాజధాని విషయంలో రైతులు కోర్టులకు వెళ్ళేబదులు ప్రభుత్వంతో చర్చలు జరిపితే ఉపయోగం ఉంటుందని ఓ సలహా ఇచ్చారు. రాజధాని నిర్మాణం అన్నది అమరావతిలో జరిగే పనికాదని కూడా ఎంఎల్ఏ తేల్చేశారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించటానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి రైతులు ఇక ఆ …

Read More »

త‌న‌యుల కోసం.. తండ్రుల పాట్లు..

“వ‌య‌సు రీత్యా.. ప‌క్క‌న పెడితే.. ప‌నులు, వ్యూహాలు, దూకుడు రీత్యా చూసిన‌ప్పుడు చంద్రబాబు నేటి యువ‌త‌కు ఏమాత్రం తీసిపోరు”-ఇదీ టీడీపీ నాయ‌కులు గ‌తేడాది ముందు వ‌ర‌కు చెప్పిన మాట‌. “మా ముఖ్య‌మంత్రిని చూస్తే.. నాకే అసూయ క‌లుగుతుంది. ఆయ‌న దూకుడు చూస్తే.. నాకే సిగ్గ‌నిపిస్తుంది!!”-ఇదీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ అప్ప‌ట్లో త‌న తండ్రిని కొనియాడు తూ.. ప‌దే ప‌దే చేసుకున్న స్తోత్ర పాఠాలు. మ‌రి.. …

Read More »

మంత్రికి మద్దతు కరువైందా ? ఒంటరైపోయినట్లేనా ?

కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ విషయమే పార్టీలో ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇఎస్ఐ కుంభకోణంలో ఏ 14 నిందుతునిగా ఉన్న కార్తీక్ నుండి కోటి రూపాయల బెంజి కారును మంత్రి కొడుకు బహుమతిగా తీసుకున్నాడనే ఆరోపణలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మంత్రిపై చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. తన ఆరోపణలకు మద్దతుగా అయ్యన్న నాలుగు ఫొటోలను కూడా జతచేయటంతో …

Read More »

చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తి..ఉత్తరాంధ్ర నేతల్లో చర్చ

వైజాగ్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షునిగా పశ్చిమ ఎంఎల్ఏ గణబాబును ఎంపిక చేసి చంద్రబాబునాయుడు తప్పు చేశారా ? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. గణబాబును అధ్యక్షునిగా నియమించ వద్దని పార్టీలోని కొందరు సీనియర్ నేతలు చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదట. ఇంతకీ చంద్రబాబు చేసిన తప్పేమిటి ? ఏమిటంటే గణబాబు టిడిపిని వదిలేసి వైసిపిలో చేరటం ఖాయమని ఎప్పటి నుండో పార్టీలో చర్చ జరుగుతోంది. కాకపోతే వైసిపి నుండి గ్రీన్ …

Read More »

పోలిట్ బ్యూరోకి గల్లా రాజీనామా..

సీనియర్ నేత, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి టిడిపి పొలిటో బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. మధ్యాహ్నం రాజీనామా చేసిన గల్లా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆమె చాలా కాలంగా చంద్రబాబునాయుడు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆమె అటు చంద్రగిరిలో పార్టీ కార్యక్రమాలకు హాజరుకావటం లేదు. ఇటు చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఏదో రూపంలో తన …

Read More »

రాజుల కోట‌లో కాపు మంత్రాంగం.. సీతారామ‌ల‌క్ష్మి వ్యూహాలు సాగేనా?

తాజాగా రాష్ట్ర టీడీపీలో చేసిన ప్ర‌యోగంపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత‌.. టీడీపీ దెబ్బ‌తిన్న తీరు చూస్తే.. గ‌డిచిన రెండు ద‌శాబ్దాల్లో పార్టీ ఇలా ఇబ్బంది ప‌డిన ప‌రిస్థితి క‌నిపించ‌దు. ఈ నేప‌థ్యంలోనే పార్టీకి అత్య‌వ‌స‌రంగా కాయ‌క‌ల్ప చికిత్స అవ‌స‌రమ‌ని అంద‌రు నేత‌లు అభిప్రాయ‌పడ్డారు. ప్ర‌జ‌ల్లో పార్టీ ఓడిపోవ‌డం ఒక్క‌టే కాదు.. పార్టీలోనూ నైరాశ్యం ఏర్ప‌డింది. దీనిని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేస్తేనే త‌ప్ప‌.. పార్టీ ప‌రుగులు …

Read More »