ాంగ్రెస్ లో చేరాలంటే ప్రశాంత్ కిశోర్ ఉరఫ్ పీకేకు ఆ పార్టీ రెండు షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన మరే ఇతర రాజకీయ పార్టీల(వైసీపీ, టీఆర్ ఎస్)కు వ్యూహకర్తగా ఉండొద్దని చెప్పినట్లు సమాచారం. సోనియా గాంధీ నివాసంలో దాదాపు 3 గంటలకు పైగా సాగిన భేటీలో కాంగ్రెస్ సీనియర్లు ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీలో చేరే విషయం, ఇప్పటికే ఆయన ఇచ్చిన …
Read More »ఇక రెండేళ్ళూ జనాల్లోనేనా?
షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుండగానే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా జనాల్లో పర్యటనలకు రెడీ అయిపోతున్నారు. ఈనెల 27వ తేదీన మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయ కర్తలతో భేటీ సందర్భంగా ఇదే విషయాన్ని స్పష్టం చేయబోతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అని అందరికీ క్లారిటీ ఇవ్వబోతున్నారు. అందుకు తగ్గట్లే పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలేంటి ప్రభుత్వపరంగా తాను తీసుకోబోతున్న చర్యలను వివరించేందుకే కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు …
Read More »27 నుంచి ఆందోళనలు.. చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్
జగన్ ప్రభుత్వం తన అసమర్థతతో పోలవరాన్ని బలి చేసిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లపాటు ప్రభుత్వం ఎందుకు దాచిందని ప్రశ్నించారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ ఎలా కూలిందో చెప్పకుండా.. మాపై ఆరోపణలు చేయొద్దన్నారు. సీపీఎస్ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందని అన్నారు. హక్కుల …
Read More »మోడీకి సీఎం స్టాలిన్ భారీ షాక్.. సంచలన నిర్ణయం!
యూనివర్సిటీల వైస్ చాన్సెలర్ల(వీసీ)లను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది స్టాలిన్ ప్రభుత్వం. రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాల్లో కోత విధించింది. ఈ సందర్భంగా 2010లో మాజీ సీజేఐ మదన్ మోహన్ పూంఛీ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదికను స్టాలిన్ ప్రస్తావించారు. ఈ పరిణామం.. ఇప్పటి వరకు ప్రభుత్వంపై అంతో ఇంతో ఆధిపత్య ధోరణితో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సూచనల …
Read More »పవన్.. వైసీపీ పబ్లిసిటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తాజా మంత్రులతో పాటు మాజీ మంత్రి కూడా జోరు పెంచారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పవన్ ను చంద్రబాబునాయుడు బానిసగా అభివర్ణించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయటం కోసమే పవన్ కష్టపడుతున్నట్లు ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీద చూపించే ప్రేమలో కొంతైనా సోదరుడు చిరంజీవి మీద చూపిస్తే బాగుంటుందని ఉచిత సలహా కూడా ఇచ్చారు. పవన్ టార్గెట్ గా మంత్రులు, వైసీపీ …
Read More »బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు రెండు రోజులు విరామం ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బండి సంజయ్ విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ విషయంపై బండి సంజయ్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఈ యాత్ర శక్తిపీఠం …
Read More »ఏపీలోకి ప్రముఖ సంస్థ.. 5500 కోట్ల పెట్టుబడి
ఇప్పటి వరకు ఏపీ సీఎం జగన్ ఒక్కటంటే ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయారని.. ఒక్క కంపెనీని కూడా స్థాపించలేక పోయారని విపక్షాలు చేస్తున్న విమర్శలకు.. ప్రభుత్వం చెక్ పెట్టింది. తాజాగా భారీ పెట్టుబడులతో ఒక కీలక కంపెనీ.. ఏపీలోకి వచ్చేందుకురెడీ అయింది. నాల్కో, మిధాని సంయుక్త సంస్ధ ఉత్కర్ష అల్యుమినియం ధాతు నిగమ్ లిమిటెడ్(యూడీఏఎన్‌ఎల్) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్ అల్యుమినియం అల్లాయ్ ఉత్పత్తుల …
Read More »టీ కాంగ్రెస్: పీకే వార్ పై రేవంత్ క్లారిటీ!
క్షణానికి ఓ మారు మారే పరిణామాలను అంచనా వేయడం కష్టం. క్షణానికో మారు మారే పరిణామాలకు అనుగుణంగా పార్టీల విధి విధానాలను ఖరారు చేస్తూ ఏదో ఒక క్లారిఫికేషన్ ను పొందడం ఇంకా కష్టం. ఇప్పుడు తెలంగాణ వాకిట ముఖ్యంగా ఇంటి పార్టీ టీఆర్ఎస్ ప్లీనరీ వేళ క్షణానికో పొలిటికల్ లీక్ లాజిక్కులకు అందకుండా వెల్లడిలో ఉంటుంది.దీంతో సోషల్ మీడియాలో ఆయా పార్టీల వర్గాలు ఎవరికి వారు తమకు అనుగుణంగా మారుతున్న …
Read More »వైసీపీ నేతలతో లగడపాటి మంతనాలు.. ఏం జరుగుతోంది?
మాజీ ఎంపీ, ఎన్నికల ఫలితాల విశ్లేషకుడుగా వ్యవహరించిన లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయ అరంగేట్రం చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో వరుసగా రెండు రోజుల పాటు వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌తో పాటు పలువురు వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. చందర్లపాడులో నందిగామ మార్కెట్ యార్డు ఛైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు కుమారుడు వివాహ రిసెప్షన్‌కు లగడపాటి, వసంత హాజరయ్యారు. …
Read More »మంత్రి అయ్యాక ఆమె మారిపోయారబ్బా!
వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మందికి ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. పపార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా వీరు గట్టివాయిస్ వినిపించారు. మీడియా ముందు.. తీవ్ర వ్యాఖ్యలు చేసి.. నిరంతరం ట్రోల్ అయ్యారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్.. సహా.. జనసేనపై విరుచుకుపడేవారు. ఇలాంటి వారిలో ఒకరిద్దరు మరింత పేరు తెచ్చుకున్నారు. వీరిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నగరి ఎమ్మెల్యే రోజా …
Read More »కాంగ్రెస్ నేతలను చేర్చుకోండి… కేసీఆర్‌కు పీకే సలహా?
తెలంగాణ రాజకీయాల్లోకి ఎన్నికల వ్యూహకర్తగా ఎంట్రీ ఇవ్వడంతో మొదలు ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగిస్తున్న అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆ ఒరవడిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరేందుకు సోనియా, రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వచ్చిన టైంలోనే ఆయన టీఆర్ఎస్ అధినేతతో భేటీ అవడం రెండు పార్టీలకు పెద్ద షాకింగ్ న్యూస్ అనే సంగతి తెలిసిందే. అయితే, తాను కాంగ్రెస్‌లో చేరినా తన టీం …
Read More »రాజధానిపై వైసీపీ రిస్క్‌లేని కొత్త గేమ్…!
రాజధాని అమరావతి పనులు ప్రారంభమయ్యాయి. ఇది ఊహించని సంఘటన. ఎందుకంటే.. అమరావతిని మార్చి మూడు రాజధానులకు నిన్న మొన్నటి వరకు మొగ్గు చూపిన వైసీపీ అధినేత జగన్ వ్యూహాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేస్తుండడమే!. ఇదే విషయంపై తాడేపల్లి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. అనేక సందర్భాల్లో మూడు రాజధానుల కే తాముకట్టుబడి ఉన్నామని.. పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా జగన్ ప్రకటించారు. వికేంద్రీకరణ విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates