Political News

రాజస్థాన్ డ్రామా.. మోడీ-షాకు షాక్?

కర్ణాటక ఆపరేషన్ అయిపోయింది. మధ్య ప్రదేశ్‌లోనూ విజయవంతంగా పని పూర్తి చేశారు. ఇప్పుడిక రాజస్థాన్ మీద పడింది నరేంద్ర మోడీ-అమిత్ షా జోడీ. ఎన్నికల్లో తమ పార్టీని ప్రజలు తిరస్కరించినా సరే.. ప్రత్యర్థి పార్టీలో అదను చూసి అసమ్మతి రాజేసి.. తమ అండదండలు ఇచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకునేలో ఉంది మోడీ-షా జోడీ. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల్లో అమలు చేసిన వ్యూహాన్నే ఇక్కడా ప్రయోగిస్తోంది. అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న …

Read More »

పెరగనున్న జోబైడెన్ దూకుడు.. తాజా ఎన్నికల్లో ఘన విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. సూటిగా కాకుండా పలు దశల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన వారు.. రోజుల వ్యవధిలో అధికారాన్ని చేపడతారు.కానీ.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అభ్యర్థి కొన్నినెలల పాటు.. పదవిని చేపట్టటానికి అవకాశం ఉండదు. అధ్యక్ష పదవిని చేపట్టటానికి ముందే.. ట్రైనింగ్ కోసమన్నట్లు కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా దశల వారీగా.. …

Read More »

వైజాగ్‌లో మ‌రో ఫార్మా ప్ర‌మాదం.. బిగ్ బ్లాస్ట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అతి పెద్ద న‌గ‌రం అయిన విశాఖ‌ప‌ట్నానికి ఈ మ‌ధ్య అస్స‌లు టైం బాగాలేన‌ట్లుంది. రెండు నెల‌ల కింద‌ట‌ లాక్ డౌన్ స‌డ‌లింపులు ఇవ్వ‌గానే అక్క‌డి గోపాల‌ప‌ట్నంలోని ఎల్జీ పాలిమ‌ర్స్ సంస్థ‌లో చోటు చేసుకున్న స్టెరీన్ గ్యాస్ లీక్ ప్ర‌‌మాదం 12 మంది ప్రాణాలను బ‌లిగొన‌డ‌మే కాక‌.. వంద‌ల మందిని అస్వ‌స్థుల్ని చేసిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత కూడా వైజాగ్‌లో ఒక‌ట్రెండు చిన్న ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా …

Read More »

రఘురామ కృష్ణంరాజు మాట.. పవన్ కళ్యాణ్ సీఎం అయితే

కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాట్ టాపిక్‌గా మారిన సంగతి సంగతి తెలిసిందే. ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఎదురు లేకుండా సాగపోతున్న వైకాపాకు ఈయన కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పార్టీ అధినేత జగన్ మీదే కాక పలువురు వైకాపా నేతల మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరిని మరీ పూచికపుల్లలా తీసిపడేశారు. ఈ …

Read More »

జగన్ కి నందమూరి బాలకృష్ణ లేఖ

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనరల్గా ఎపుడూ ఏదీ అడగరు. తాను చేసేది చెప్పడమే గాని… ఎవరిని అయినా ఏదైనా అడగడం చాలా అరుదు. రెండే రెండు సందర్భాల్లో అతను ఇతరులను అడుగుతారు. ఒకటి తన తల్లి బసవతారకం స్మారకార్థం ఏర్పాటుచేసిన క్యాన్సర్ ఆస్పత్రికి ప్రభుత్వాలను, ఎన్నారైలను మద్దతు కోరుతారు. రెండోది హిందూపురం నియోజకవర్గం విషయం ఎపుడూ ఒక బాధ్యతాయుత ఎమ్మెల్యేగా నియోజకవర్గ సంక్షేమానికి ప్రభుత్వాలను అడుగుతారు. …

Read More »

వైసీపీకి ఢిల్లీ హైకోర్టు షాక్..ఎందుకంటే

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి అన్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోన్న సంగతి తెలిసిందే. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీగా చలామణీ చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి అన్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. వైఎస్సార్ అనే పదాన్ని వైసీపీ వాడకుండా చూడాలని ఈసీని మహబూబ్ బాషా కోరడం చర్చనీయాంశమైంది. దీంతోపాటు, వైసీపీ గుర్తింపు …

Read More »

ఆ ఆరుగురిలో ఇద్దరికి మంత్రి పదవులు ఖాయమట?

ఏపీ అధికారపక్ష నేతలే కాదు.. రాష్ట్ర ప్రజల్లోనూ ఖాళీ అయిన మంత్రుల్లో ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఏడాది పాలనను పూర్తి చేసుకున్న జగన్ సర్కారు.. పలు పథకాలతో ముందుకెళుతున్న వేళ.. ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయన్నది ఉత్కంఠగా మారింది. ఆశావాహులంతా ఎవరికి వారుగా తమ తమ ప్రయత్నాల్ని చేసుకుంటున్నారు. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణలు తమ పదవులకు రాజీనామా …

Read More »

ఏపీలో కొత్త జిల్లాలు 25? 26?.. కన్ఫ్యూజన్

New District

రాష్ట్ర విభజన నేపథ్యంలో పాలనను మరింత వికేంద్రీకరించే క్రమంలో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్ని 33 జిల్లాలుగా ఏర్పాటు చేయటం తెలిసిందే. పది కాస్తా ముప్ఫై మూడు కావటంతో టీఆర్ఎస్ సర్కారుకు పెద్ద సమస్యలు ఎదురు కాలేదు. అయిన్పటికీ కొన్ని జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఏపీలోనూ కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తు సాగుతోంది. …

Read More »

జగన్ పార్టీని భయపెడుతున్న సెల్ఫీ

Jagan

ఏపీలో తిరుగులేని శక్తిగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల అనుకోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేందుకు అధినేత మాత్రం తగ్గని వేళ.. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల పార్టీ ఎంపీ రఘురామ రాజు కలకలం గురించి తెలిసిందే. పార్టీపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన తీరుపై ఇప్పటికే పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసు …

Read More »

ఈ సీరియల్ ఇంకెంతకాలం సోనియమ్మ?

తెలుగు టీవీ సీరియల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎంపిక వ్యవహారం నడుస్తుందని చెప్పాలి. ఆ మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు రాహుల్ కు అప్పజెప్పటం.. అయ్యాగారు గౌతమ బుద్ధుడి మాదిరి.. పదవుల మీద తనకు పెద్ద ఆసక్తి లేదని చెప్పేయటం.. సోనియమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవటం.. అధినాయకుడు లేక పార్టీ కిందా మీదా పడటం గడిచిన కొన్నాళ్లుగా చూస్తున్నదే. అలా అని …

Read More »

అయ్యో.. ఆ చిన్నారి కుటుంబంలో మరో విషాదం

తన స్నేహితురాలు.. తన స్నేహితుడే అయిన మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో ఆమె కూతురిని హత్య చేసి చంపాడు ఓ దుర్మార్గుడు. ఇప్పుడా చిన్నారి తండ్రి.. తన కూతురు పోయిన బాధను తట్టుకోలేక తన ప్రాణాలు తీసుకున్నాడు. ఇప్పుడా ఇల్లాలి పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇటీవల ఘట్‌కేసర్‌లో ఆరేళ్ల పాప ఆద్య హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చిన్నారి తండ్రి తన ప్రాణాలు …

Read More »

బెంగళూరులోనూ పెట్టేశారు.. ఇక మిగిలింది హైదరాబాదే

కరోనా ప్రభావాన్ని తగ్గించడం కోసం రెండు నెలల పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను చాలా పకడ్బందీగా అమలు చేశారు. కొన్ని రాష్ట్రాలు ఇక లాక్ డౌన్ చాలు అన్నా కేంద్రం వినిపించుకోలేదు. కచ్చితంగా లాక్‌డౌన్‌‌ను కొనసాగించాల్సిందే అని స్పష్టం చేసింది. ఐతే జూన్ నెల ఆరంభం నుంచి లాక్ డౌన్ నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలేసింది కేంద్రం. అప్పట్నుంచి దాదాపుగా అన్ని రాష్ట్రాలూ లాక్‌డౌన్ ఎత్తేశాయి. కరోనా వ్యాప్తి అధికంగా …

Read More »