Political News

ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు ఎన్నో తెలుసా?

ఒక్క రోజులో వెయ్యి క‌రోనా కేసుల‌ట‌. గ‌త నెల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించి ఈ అప్ డేట్ చూసి వామ్మో వాయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా ఏపీలో ఒక్క రోజులో 5 వేల కేసుల‌కు పైగా వ‌చ్చాయంటే క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయంటే తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక్క రోజు వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో ఏకంగా 56 మంది ప్రాణాలు కోల్పోవ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగించే విష‌యం. తెలంగాణ‌లో …

Read More »

క‌రోనాను మించిన విల‌యం చూస్తున్న ఆ రాష్ట్రం

ఇప్పుడు దేశ‌మంతా అంద‌రి దృష్టీ క‌రోనా మీదే ఉంది. ఇండియాలో అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వైర‌స్ ప్ర‌భావంతో అన్ని రాష్ట్రాలూ అల్లాడిపోతున్నాయి. క‌రోనా కేసులు ప‌ది ల‌క్ష‌లు దాటిపోయాయి. వేల‌మంది ప్రాణాలు వ‌దులుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేకుండా అన్నీ ఈ మ‌హ‌మ్మారి ధాటికి కుదేల‌వుతున్నాయి. ఐతే ఓ రాష్ట్రం మాత్రం క‌రోనాను మించి విల‌యాన్ని ఎదుర్కొంటోంది. కానీ దాని గురించి ఎవ‌రికీ ప‌ట్టింపు లేదు. ఆ …

Read More »

చిన్నమ్మపై కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు

karthi

కొన్నిసార్లు రాజకీయం చాలా గమ్మత్తుగా ఉంటుంది. తమ పార్టీ సంగతిని చూసుకోని కొందరు నేతలు.. తమకేమాత్రం సంబంధం లేని అంశాల్లో తలదూర్చటమే కాదు.. సదరు పార్టీ నేతలకు కాలిపోయేలా వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా అలాంటి వ్యాఖ్యల్నే చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత చిదంబరం కుమారుడు కమ్ పార్లమెంటు సభ్యుడు కార్తీ చిదంబరం. తాజాగా బెంగళూరు నుంచి కారులో తమిళనాడులోని చెన్నైకి వచ్చిన ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు …

Read More »

కేసీఆర్‌ను ఇరికించిన జ‌గ‌న్ ఆప్త‌మిత్రుడు?

దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తిస్తున్న కీలక‌‌మైన విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స‌న్నిహితుడు తీసుకున్న చొర‌వ యువ‌నేత‌ మిత్రుడైన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఇర‌కాటంలో ప‌డేసింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దేశంలోని రాజ‌కీయ పార్టీలు, వామ‌ప‌క్ష భావ‌జాలం ఉన్న వారు స్పందిస్తున్న విప్ల‌వ ర‌చ‌యిత‌లం సంఘం నేత వ‌ర‌వ‌ర‌రావు ఆరోగ్య ‌ప‌రిస్థితి, ఆయ‌న విడుద‌ల విజ్ఞ‌ప్తి సుదీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న త‌రుణంలో ఆయ‌న కోసం వైసీపీ సీనియ‌ర్ …

Read More »

రఘురాముడి సీటు మార్పించిన వైకాపా

గత వారం రోజులుగా వ్యవహారం కొంచెం చల్లబడింది కానీ.. అంతకుముందు ఏపీ రాజకీయాల్లో రఘురామ కృష్ణంరాజు హాట్ టాపిక్. కొన్ని వారాలుగా ఆయనకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య నడుస్తున్న రగడ గురించి తెలిసిందే. కొంత కాలంగా పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్న ఆయన.. ఇటీవల స్వరం పెంచారు. అధినాయకత్వంతో పాటు పార్టీలో అనేకమంది నాయకుల్ని ఏకి పడేస్తే మీడియాలో హల్‌చల్ చేశారు. పార్టీ షోకాజ్ నోటీసు ఇస్తే దానికి …

Read More »

కరోనా అంటే భయం లేదా.. ఇది చదవండి

కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నా.. జనాల్లో ఇప్పటికీ భయం ఉండట్లేదు. మనకు కరోనా రాదు.. వచ్చినా ఏమవుతుంది అనే ధీమా చాలామందిలో కనిపిస్తోంది. కానీ కరోనా అందరిపై ఒకే రకమైన ప్రభావం చూపించట్లేదు. కొందరి ఆరోగ్యాల్ని దారుణంగా దెబ్బ తీస్తోంది. ప్రాణాల్ని కూడా హరిస్తోంది. అలాంటి నష్టం మన కుటుంబంలోనే జరిగితే ఏంటి పరిస్థితి అన్నది ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. సొసైటీలో పలుకుపడి ఉన్న వ్యక్తులు సైతం కరోనాతో …

Read More »

ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్.. మళ్లీ వచ్చేదెప్పుడు?

దాదాపు రెండు వారాలకు పైనే ఫామ్ హౌస్ లో గడిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదారు రోజుల క్రితమే ప్రగతిభవన్ కు రావటం తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అధికారిక నివాసంలో ఉండకుండా తరచూ ఫామ్ హౌస్ కు వెళ్లి రావటం కొత్తేం కాదు. అప్పుడప్పడు రెండు.. మూడు వారాలు కూడా ఆయన అక్కడే ఉండిపోయారని చెబుతారు. మామూలు రోజులు కావటం.. అవసరానికి మించిన బలం …

Read More »

టీడీపీకి అవకాశాలిస్తున్న వైసీపీ

పొరుగు రాష్ట్రమైన త‌మిళ‌నాడులో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఏపీలో అధికార‌ వైసీపీ, ప్ర‌తిప‌క్ష‌ టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారితీస్తోందా? ఎదుటివారిని టార్గెట్ చేసే క్ర‌మంలో ఒక్కోసారి ఆయా పార్టీయే ఇరుకున ప‌డిపోతోందా? తాజాగా, ఇదే ప‌రిస్థితిని ఏపీలో అధికార వైసీపీ ఎదుర్కుంటుందా? అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. తమిళనాడులో తాజాగా దొరికిన‌ డబ్బుల కట్టల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో డబ్బులు …

Read More »

రమణదీక్షితుల హవా ముగిసినట్టేనా?

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేరు మరోసారి వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో మాజీ సీఎం చంద్రబాబుపై రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు గుప్పించారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యు చేశారు. చంద్రబాబు హయాంలో 20 మందికి పైగా అర్చకులను రాజ్యాంగ విరుద్ధంగా రిటైర్ చేయించారని ఆరోపించారు. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలను టీటీడీ ఈవో అనిల్ సింఘాల్, ఏఈవో …

Read More »

గుప్త నిధుల మాటకు ఫైర్ అయిన నిజాం వారసులు

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. తరచూ ఆయన చేసే వ్యాఖ్యలు ఇట్టే ప్రజల్లోకి వెళ్లటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చకు తెర తీస్తుంటాయి. రోటీన్ కు భిన్నంగా ఉండటమే కాదు.. అప్పటివరకూ ఎవరూ చూపించని కొత్తయాంగిల్ ను తన విమర్శల్లోనూ.. ఆరోపణల్లోనూ ప్రదర్శిస్తుంటారు. తెలంగాణ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకించినోళ్లు చాలామందే ఉన్నా.. రేవంత్ రెడ్డి మాత్రం మిగిలిన …

Read More »

భూమా అఖిల ప్రియ అరెస్టు తప్పదా?

రాజకీయాల్లో ఆరోపణలు.. ప్రత్యారోపణలు మామూలే. మంత్రిగా వ్యవహరించిన మహిళా నేత.. తన పదవి పోయిన తర్వాత సొంత పార్టీకి చెందిన నేత హత్యకు ప్లాన్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొనటం బహుశా భూమా అఖిలప్రియే అవుతారేమో? రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మహిళా నేతలు ఉన్నా.. హత్యా ప్రయత్నానికి ప్లాన్ చేస్తున్నారంటూ అదే పార్టీకి చెందిన నేత ఒకరు ఆరోపణలు చేయటం.. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం లాంటివి ఇప్పటివరకూ జరగలేదన్న మాట …

Read More »

జగన్ సర్కారుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు?

ఇటీవల కాలంలో పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి పరిస్థితే ఏపీ హైకోర్టులో ఎదురైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యుడిగా తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం.. దీనిపై న్యాయస్థానంలో జరిగిన పోరాటంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డను తిరిగి నియమించాలని గతంలోనే చెప్పింది. …

Read More »