అవును కేంద్రప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తెచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాన్ని పంజాబ్ ప్రభుత్వం సవాలు చేసింది. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని నిండుసభలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పష్టంగా ప్రకటించారు. చట్టాన్ని అమలు చేసే విషయంలో కేంద్రం తమ ప్రభుత్వాన్ని రద్దు చేసినా పర్వాలేదు కానీ తమ రాష్ట్రంలో మాత్రం రైతు వ్యతిరేక చట్టాన్ని మాత్రం అమలు చేసేది లేదని తేల్చిచెప్పారు. …
Read More »బీహార్లో ఎన్డీఏ కే పట్టం కడతారా ?
క్షేత్రస్ధాయిలో పరిస్దితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈనెల 28వ తేదీ నుండి వచ్చేనెల 10వ తేదీలోగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అనేక కూటములు, పార్టీలు పోటి పడుతున్నాయి. 243 అసెంబ్లీ సీట్లలో విజయం కోసం ఎన్ని కూటములు, పార్టీలు పోటి పడుతున్నా ప్రధానంగా అధికారంలో ఉన్న ఎన్డీఏ, ప్రధాన ప్రతిపక్షమైన యూపీఏ కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అందరు అంచనాలు వేస్తున్నారు. ఈ …
Read More »జగన్ కు పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటో తెలుసా ?
జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ప్లాస్ పాయింట్ ఏమిటో తెలుసా ? ఈ ప్రశ్నకు ఒక్కొక్కళ్ళు ఒక్కోరకంగా సమాధానం చెబుతారేమో. మామూలుగా అయితే అసెంబ్లీలో 151 సీట్లుండటం, 22 ఎంపి సీట్లు గెలుకోవటం అని చెబుతారు. ఇదే సమయంలో కేంద్రంతో మంచి సంబంధాలు ఉండటమే అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. పార్టీపై తిరుగులేని ఆధిపత్యం ఉండటమే అసలైన బలమని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కరెక్టే కానీ …
Read More »ఈ మాజీ మంత్రి ఎక్కడా కనబడటం లేదట
ఓడలు బండ్లు..బండ్లు ఓడలవుతాయనే సామెత ఇటువంటి వాళ్ళని చూస్తే నిజమే అనిపిస్తుంది. సంవత్సరాల తరబడి ఎవరికీ తెలీకుండా తెర వెనుక మాత్రమే ఉన్న వ్యక్తి ఒక్క సారిగా 2014 ఎన్నికల తర్వాత తెరముందుకు వచ్చేశారు. అంతే కాకుండా ఐదేళ్ళపాటు ఓ వెలుగు వెలిగారు. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ. నారాయణ ఎప్పుడూ ప్రజా జీవితంలో లేనేలేరు. అలాంటిది ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీని ఆదుకున్నాడన్న కారణంగా …
Read More »కార్పొరేషన్లు కాపాడతాయా? వైసీపీలో అంతర్మథనం!
ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా 132 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వీటిలో చైర్మన్లను కూడా నియమించేసింది. ఈచైర్మన్లలో ఎక్కువగా పాత ముఖాలే ఉండగా.. కొందరు కొత్తవారికి కూడా ఛాన్స్ ఇచ్చారు. ఏ పార్టీ అయినా.. ఏపనినీ ఊరికేనే చేయదు. తమకు ఏమాత్రం లాభం లేకుండా.. అడుగులు వేయదు. ఇప్పుడు వైసీపీ చేసిన ప్రయోగం కూడా ఆకోవలోకే వస్తుంది. ఎటు పోయి ఎటొచ్చినా.. వచ్చే ఎన్నికల్లో …
Read More »ఓటు బ్యాంకు పైనే నితీష్ కన్ను
తొందరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో ఓటుబ్యాంకుపైనే నితీష్ కుమార్ ప్రధానంగా కన్నేశారు. ఎన్డీఏ కూటమి తరపున జేడీయూ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బాధ్యతలు చూస్తున్న నితీష్ 30 స్ధానాలను ముస్లింలు, యాదవులకే కేటాయించటం సంచలనంగా మారింది. ముస్లింలు, యాదవుల ఓట్లు షేర్ రాష్ట్రంలో సుమారు 30 శాతం ఉంది. పొత్తుల్లో భాగంగా 243 అసెంబ్లీ సీట్లలో జేడీయూ 115 సీట్లలో పోటి చేస్తోంది. తమ వాటాగా వచ్చిన సీట్లలో 19 చోట్ల …
Read More »టీడీపీలో గంటా బృందాన్ని పక్కన పెట్టేసిన బాబు
తాజాగా ప్రకటించిన టీడీపీ రాష్ట్ర, జాతీయ స్థాయి పార్టీ కమిటీలకు సంబంధించి పార్టీ అధినేత చంద్రబాబు బాగానే కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. పార్టీకి దూరంగా ఉంటున్నవారు.. పార్టీ నుంచి రేపో మాపో జంప్ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతున్నవారిని చంద్రబాబు పక్కన పెట్టారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును ఆయనకు మద్దతుగా ఉన్న నేతలను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ విషయం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. …
Read More »అచ్చెన్నకు కుడి, ఎడమల చెక్ పెట్టినట్లేనా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున గెలిచిన వారిలో మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చాలా దూకుడు మీదుండే వ్యక్తి. దశాబ్దాల పాటు కింజరాపు కుటుంబానికి శ్రీకాకుళం జిల్లాలో ఎదురులేకపోవటం వల్లే అచ్చెన్నకు జిల్లా వ్యాప్తంగా పట్టువచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా కింజరాపు కుటుంబానికైతే ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. కానీ అదంతా చరిత్రగా మిగిలిపోయట్లుందిపుడు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా …
Read More »మాజీ సీఎం నోట.. ‘ఆమె ఓ ఐటెం’
పట్టలేనంత కోపం ఉండొచ్చు. హద్దులు దాటే ఆగ్రహం రావొచ్చు. అయితే.. మాత్రం నోటిని అదుపులో ఉంచుకోకపోతే అంతకు మించిన ఇబ్బంది మరింకేమీ ఉండదు. తాజాగా అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. అత్యున్నత స్థానంలో ఉన్న ఆయన.. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల వేళ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటకు అవాక్కు అవుతున్నారు. ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన ఒక సీనియర్ నేత నోట ఇలాంటి …
Read More »బీజేపీ నేతపై వీర్రాజు సీరియస్ .. సస్పెన్షన్
బీజేపీ నేత లంకా దినకర్ ను పార్టీలో నుండి సస్పెండ్ చేసింది. బీజేపీలో ఉంటు తెలుగుదేశంపార్టీ అనుకూల వైఖరిని అవలంభిస్తున్న కారణంగానే దినకర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓపోయిన తర్వాత దినకర్ ఆ పార్టీకి రాజీనామా చేసి కమలంపార్టీలో చేరారు. టీడీపీలో దినకర్ అధికారపార్టీ ప్రతినిధిగా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీలో నుండి బీజేపీలోకి …
Read More »జగన్ కు చంద్రబాబే ప్రచారం చేస్తున్నాడా ?
తెలుగుదేశంపార్టీలోనే కాదు జనాల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబునాయుడు మాట్లాడని రోజు లేదు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయటమే టార్గెట్ గా పెట్టుకున్న విషయం అర్ధమైపోతోంది. మీడియా సమావేశాలు పెట్టినా, నేతలతో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించినా చివరకు తనను కలవటానికి వచ్చిన నేతలతో మాట్లాడినా …
Read More »ఫైర్ బ్రాండుకు జగన్ షాక్
పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపుపొందిన నగిరి ఎంఎల్ఏ రోజాకు జగన్మోహన్ రెడ్డి షాకిచ్చారా ? తాజాగా ప్రభుత్వం భర్తీ చేసిన బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాన్ని చూస్తే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీలో రోజాకు బద్ధశతృవు అయిన కే. శాంతిని ఏరికోరి ఈడిగ కార్పొరేషన్ కు ఛైర్మన్ గా నియమించారు. పైగా కార్పొరేషన్ కు క్యాబినెట్ ర్యాంకు ఉంటుందని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఒక్కసారిగా రోజా, శాంతి …
Read More »