Political News

ఎంఎల్ఏ అల్లుడు ఎలా చనిపోయారు?

రాయదుర్గం వైసీపీ ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ రెడ్డి చనిపోయాడు. అమరావతి పరిధిలోని తాడేపల్లి మండల కేంద్రంలోని ఒక అపార్టుమెంటు ఫ్లాటు 101లో మృతుడు ఉంటున్నాడు. మృతుడి తండ్రికి ఒక నిర్మాణ సంస్ధ ఉంది. రాంకీ కంపెనీ వర్కులను ఈ నిర్మాణసంస్ధ సబ్ కాంట్రాక్టుకు తీసుకుని పనులు చేయిస్తుంటుంది. జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో వర్కులు జరుగుతున్నాయి. ఈ మధ్య కొన్ని రాష్ట్రాల్లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు అందలేదని …

Read More »

ఢిల్లీ లీక్క‌ర్ స్కామ్.. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌కంప‌న‌లు

ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా నివాసాలు స‌హా 31 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. గ‌త న‌వంబ‌రులో ప్ర‌వేశ పెట్టిన నూత‌న మ‌ద్యం పాల‌సీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని.. భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయ‌ని .. నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని.. ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ సూచ‌న‌ల మేర‌కు ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు.. …

Read More »

ఎంఎల్ఏకి జగన్ చెక్ పెట్టినట్లేనా?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే శాసనమండలిలో ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి విప్ లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో బీసీ నేత జంగా కృష్ణమూర్తి, ఎస్సీనేత, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు. మామూలుగా అయితే ఈ విషయం పెద్దగా పట్టించుకోవక్కర్లేదు. కానీ డొక్కాను నియమించటంతోనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. డొక్కా నియామకం విషయంలో  అనుమానాలు ఎందుకంటే ఈయనది కూడా తాడేపల్లి నియోజకవర్గం …

Read More »

బీజేపీ నాయకత్వం.. రాములమ్మ అసంతృప్తి

చివరకు రాములమ్మ కూడా పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. సినీ సెలబ్రిటీల హోదాలో రాజకీయపార్టీల్లోకి ఎంటరైన వారు ఎక్కడున్నా ఏదోకారణంతో అసంతృప్తిగానే ఉంటారేమో. నిజానికి వీళ్ళవల్ల పార్టీకి పెద్దగా ఉపయోగాలేవీ ఉండవు. కానీ తమవల్లే పార్టీకి ప్రజాధరణ పెరుగుతోందని, జనాలంతా తమకోసమే వస్తున్నారనే భ్రమల్లో ఉండటంవల్లే సమస్యలు పెరిగిపోతున్నాయి. ఏపార్టీలో ఏ సెలబ్రిటీ ఉన్నా వాళ్ళదే ఇదే సమస్యగా తయారైంది. బీజేపీ నేత రాములమ్మ అలియాస్ విజయశాంతిది కూడా ఇదే …

Read More »

ఏపీలో అర‌డ‌జ‌ను మంది మంత్రుల‌కు ఇదే ప‌ని

మంత్రి అంటే.. ప్ర‌భుత్వ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను.. ఆయా శాఖ‌ల‌కు సంబంధించిన అధికారుల‌తో అమ‌లు చేయించ‌డం.. అవి స‌క్ర‌మంగా అమ‌ల‌వుతున్నాయో.. లేదో.. చూడ‌డం కీల‌క ప‌ని. అంతేకాదు.. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే అర్జీల‌ను ప‌రిష్క‌రించ‌డం.. అవి ఏదశ‌లో ఉన్నాయో చూడ‌డం.. ప్ర‌జ‌ల‌కు కుదిరితే అందుబాటులో ఉండ‌డం కూడా అమాత్యుల విధుల్లో కీల‌క‌మైన వ్య‌వ‌హారం. అయితే.. ఏపీలో ఉన్న మంత్రులు ఈ విధుల‌ను ప‌క్క‌న పెట్టేశారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దాదాపు అర‌డ‌జ‌ను …

Read More »

జ‌గ‌న్‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు

ఏపీ సీఎం జ‌గ‌న్ అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారా? రాష్ట్రంలో ఆయ‌న అనుకుంటున్న‌ట్టుగా.. ఏమీ జ‌ర‌గడం లేదా?  ప్ర‌తి విష‌యంలోనూ జ‌గ‌న్‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీలోని కీల‌క నాయ‌కులు. ముఖ్యంగా గ‌త మేనిఫెస్టో క‌మిటీలో ఉన్న గుంటూరుకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు ఈ విష‌యాన్ని బాహాటంగానే చెబుతున్నారు. “మేనిఫెస్టోలో ఉన్న‌వ‌న్నీ.. అమ‌లు చేస్తున్నాం. కానీ.. ప్ర‌జ‌లు ఇంకా ఏదో కోరుకుంటున్నారు. దీనిని రీచ్ కాలేక పోతున్నాం. …

Read More »

ఇటు టీఆర్ఎస్‌.. అటు బీజేపీ

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక తేదీ ఇంకా ఖ‌రారు కాలేదు. ఇంకా షెడ్యూలే విడుద‌ల అవ‌లేదు. అస‌లు ఎప్పుడు జ‌రుగుతుందో కూడా తెలియ‌దు. కానీ, ఇక్క‌డ రాజ‌కీయం మాత్రం.. భోగి మంట‌ల‌ను త‌ల‌పిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికి వారుగా.. బీజేపీ, టీఆర్ ఎస్ నాయ‌కులు రాజ‌కీయ దుమారానికి తెర‌దీసిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా ఆదివారంమాత్రం.. ఒకేరోజు.. ఈ రెండు పార్టీల అగ్ర‌నాయ‌కులు.. ఇక్క‌డ స‌భ‌లు …

Read More »

రాజాసింగ్ అరెస్ట్.. ర‌గులుతున్న రాజ‌కీయం

తెలంగాణ‌లో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ రాజ‌కీయం మ‌రింత రాజుకుంది. మునావ‌ర్ షో ఎఫెక్ట్‌తో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రేపటి మునావర్ ఫారుఖీ షోను అడ్డుకుంటాము అనడంతో.. ముందస్తుగా రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకే మునావర్ హైదరాబాద్  వస్తున్నారని అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే.. దీనిని బీజేపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. ఈ …

Read More »

మారుతున్న రాజ‌కీయాలు.. కేసీఆర్‌కు క‌ష్ట‌మే?

కేంద్రంలో చ‌క్రం తిప్ప‌డం ఖాయ‌మ‌ని భావించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు క‌ష్టాలు ప్రారంభ మయ్యాయా?  ఆయ‌న అనుకున్న‌ట్టుగా కేంద్రంలో చ‌క్రం తిప్ప‌డం అంత ఈజీకాదా?  ఆయ‌న‌ను రాష్ట్రానికే ప‌రిమితం చేసేలా.. స‌హ‌క‌రించే వారిని కూడా దూరం చేసేలా.. కేంద్రంలోని బీజేపీ పావులు క‌దుపుతోందా? అంటే.. తాజాగా మారుతున్న ప‌రిణామ‌ల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఢిల్లీ టూ హైద‌రాబాద్‌.. అంటూ.. త‌ర‌చుగా చ‌క్క‌ర్లు కొట్టిన కేసీఆర్‌.. …

Read More »

వైసీపీ నుంచి చేజారుతోన్న ఆ నియోజ‌క‌వ‌ర్గం…

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం.. పైగా టీడీపీకి కంచుకోట వంటి.. చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య‌ అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎలీజాకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా ఇంకొందరు గళం విప్పుతున్నారు. ఎమ్మెల్యే అనుకూలురు కొందరు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, దీనిని ప్రశ్నిస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వాదన వినిపిస్తోంది. ఈ మధ్యనే జంగారెడ్డిగూడెం మునిసిపల్‌ ప్రాంతంతో పాటు కామ‌వ‌ర‌పుకోట మండ‌లంలో …

Read More »

టీఆర్ఎస్ ది బలప్రదర్శనేనా?

మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో అన్ని పార్టీలు గెలుపును దృష్టిలో పెట్టుకుని అనేక వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగానే బలప్రదర్శనకూ దిగుతున్నాయి. ఈనెల 20వ తేదీన నియోజకవర్గం కేంద్రం మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కనీవినీ ఎరుగనంత స్ధాయిలో జనసమీకరణ చేయాలని ఇప్పటికే కేసీయార్ ఆదేశించారు. 25 ఎకరాల్లో జరగబోయే బహిరంగ సభకు లక్షలాది మందిని తీసుకురావాలని టార్గెట్ గా చాలామంది నేతలు …

Read More »

అఖిలను పక్కన పెట్టినట్లేనా ?

నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆళ్ళగడ్డ విషయంలో తీసుకున్న వైఖరితో ఇపుడిదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నియోజకవర్గాల సమీక్షలో కొందరికి టికెట్లు ఖరారుచేస్తున్న చంద్రబాబు నాయుడు మరికొందరి విషయంలో వాయిదా వేస్తున్నారు. గురువారం రాయలసీమలోని ఆళ్లగడ్డ, పుంగనూరు, రాజంపేట, మైదుకూరు, నందికొట్కూరు నియోజకవర్గాలపై సమీక్ష జరిపారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని మరికొన్ని నియోజకవర్గాల నేతలతో కూడా భేటీ అయ్యారు. పై నియోజకవర్గాల్లోని కొందరు నేతలకు టికెట్లు దాదాపు క్లియర్ …

Read More »