వారి బూతులే వారికి శ్రీరామరక్షనా?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మంత్రివర్గ ప్రక్షాళన పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం పెద్దగా సక్సెస్ కాలేదు. శాఖల మీద పట్టు పెంచుకోవటంతో పాటు రాజకీయంగా ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో చాలామంది మంత్రులు ఫెయిలయ్యారనే భావన జగన్లోనే కనిపించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనతో పాటు తన భార్యపైన టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నా మంత్రుల్లో చాలామంది స్పందించకపోవటంపై జగన్ ఫుల్లుగా ఫైర్ అయినట్లు ప్రచారం జరుగుతున్నది.

ఈ కారణంతోనే పనితీరు సరిగాలేని కొందరు మంత్రులను మార్చేస్తానని కూడా జగన్ వార్నింగ్ ఇచ్చారట. మొత్తం ఎపిసోడ్ లో నలుగురు మంత్రుల పనితీరు అస్సలు బావోలేదని జగన్ కు ఫీడ్ బ్యాక్ వచ్చిందని సమాచారం. కాబట్టి వచ్చే దసరాలోగా మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశాలున్నాయనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్త కరెక్టయితే మళ్ళీ ఇద్దరు నానీలు మంత్రివర్గంలోకి వస్తారని వైసీపీ నేతలంటున్నారు. వివిధ కారణాలతో కొడాలి నాని, పేర్ని నానీని జగన్ మంత్రివర్గంలో నుంచి తొలగించారు.

వీళ్ళద్దరు కూడా ప్రతిపక్షాలపై చాలా దూకుడుగా విరుచుకుపడేవారే. అయితే మాజీలైన తర్వాత వీళ్ళ దూకుడు తగ్గిపోయింది. మంత్రులుగా ఉన్నవాళ్ళే ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి, ప్రతిపక్షాలపై ఎదురుదాడులు చేయకపోతే తామెందుకు పూసుకోవాలని అనుకున్నారో ఏమో. అందుకనే మీడియాలో కనబడటం నానీలిద్దరు తగ్గించేశారు. ఇదే విషయం జగన్ కు స్పష్టంగా అర్ధమైందట.

అందుకనే పనితీరు ఆధారంగా ముగ్గురు, నలుగురిని పక్కనపెట్టి కొందరికి శాఖలను మార్చాలని అనుకుంటున్నారు. కొందరిని తప్పిస్తే మరికొందరిని మళ్ళీ తీసుకోవాలి కదా. ఆ ఈక్వేషన్లలోనే మళ్ళీ మంత్రివర్గంలోకి కొడాలి, పేర్ని రాబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. ఏదో అనుకుని మంత్రివర్గంలో జగన్ మార్పులు చేస్తే అది ఇంకేదో అవుతోందనే భావన అందరిలోను ఉంది. అందుకనే దసరాకు మంత్రివర్గంలో జరగబోయే మార్పుల్లో నానీలకు మంత్రియోగం దక్కబోతోందని సమాచారం.