‘తిరుపతి లోక్ సభలో మొన్న వైసీపీకి వచ్చిన 10 శాతం ఓట్లలో 5 శాతం మనం లాగేసుకుంటే టీడీపీదే విజయం మనదే’ ..ఇది చంద్రబాబునాయుడు తాజాగా తిరుపతి లోక్ సభ పరిదిలోని నేతలతో చంద్రాబాబు చెప్పిన మాటలు. నేతలతో జూమ్ కాన్ఫరెన్సు లో మాట్లాడిన చంద్రబాబు ఉపఎన్నిక విషయంలో చాలా లెక్కలే చెప్పారు. లెక్కల్లో 1+1=2 అవుతుందేమో కానీ రాజకీయాల్లో 1+1= 0 కూడా అయ్యే అవకాశం ఉందని మరి …
Read More »మంత్రి శంకర నారాయణకు ఇంటా బయటా సెగ.. రీజనేంటి?
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాలగుండ్ల శంకరనారయణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ఆయనపై అనేక ఆశలతో ఎంతో మంది పోటీలో ఉన్నా.. మంత్రిగా తొలి ఛాన్స్ ఇచ్చారు. అయితే.. గడిచిన ఏడాదిన్నరలో మంత్రి శంకర నారాయణ గ్రాఫ్ చూస్తే.. తీవ్ర వివాదాలు కాకపోయినా.. ఇంటా బయటా కూడా.. ఆయనకు అసమ్మతి పెరుగుతోందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. …
Read More »విపక్షంలో ఉన్న వేళ అయినా పార్టీకి రిపేర్లు చేసుకోరేం బాబు?
సమస్య అనే రోగానికి పరిష్కారమనే మందుకు మించింది మరొకటి ఉండదు. అందుకు భిన్నంగా.. ఎప్పటికప్పుడు సమస్యను డీల్ చేయకుండా దాన్ని పెండింగ్ లో ఉంచటం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు.. సమస్యల్ని పరిష్కరించే కన్నా.. వాటిని పెండింగ్ లో పెంచేసే ధోరణి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అంతర్గత అంశాల్ని పట్టించుకునేంత ఓపికా.. …
Read More »రెడ్డమ్మ వర్సెస్ కళావతి.. మంత్రి పీఠం ఎవరికి? వైసీపీ డిబేట్
జగన్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం దగ్గర పడుతోంది. మరో పది మాసాల్లోనే మంత్రి వర్గంలోని సగం మందిని మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో కొందరు ఇప్పటికే మంత్రి వర్గ రేసులో దూకుడుగా ముందున్నారు. అయితే.. ఎలాంటి ప్రయత్నాలూ లేకుండానే కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఇదే జిల్లాకు చెందిన పాలకొండ ఎమ్మెల్యే …
Read More »యూపీఏ వైఫల్యాలు.. మోడీకి వరాలు.. ఇప్పుడు జరుగుతోంది ఏంటి?
ఒక ప్రభుత్వ వైఫల్యం నుంచి పుట్టుకొచ్చిన మార్పు ఫలితంగానే మన దేశంలో ప్రభుత్వాలు మారుతున్నాయి. అయితే.. ఏ ప్రభుత్వమూ కూడా ఈ మార్పులను లోతుగా విశ్లేషణ చేయకపోవడం.. అంతా బాగుందనే భ్రమలో ఉండడం కామన్‌గా జరుగుతున్న పరిణామం. దీంతో ఎంత బలమైన ప్రభుత్వమైనా.. కూలిపోతుండడం మరో చిత్రమైన విషయం. ప్రస్తుతం టీ బాయ్.. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు రెండు సార్లు కొలువుదీరింది. నిజానికి బీజేపీ వంటి హిందుత్వ …
Read More »పవన్ను ట్రాప్ లోకి లాగుతున్నారా ?
కమలంపార్టీ నేతల వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. హైదరాబాద్ లో బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అండ్ కో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండ్ కో మధ్య పెద్ద భేటీనే జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్దితులు, నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతుల గురించి, రాష్ట్రంలో రోడ్ల దుస్ధితితో పాటు ఏలూరులో వింతరోగం తదితర అనేక అంశాలపై చర్చించిన నేతలు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల గురించి మాత్రం …
Read More »ఆ కోటి మాట ఏమైంది సీఎం సార్!?
అధికార వైసీపీ నేతలు ఒక విషయాన్ని చాలా గోప్యంగా తెరమీదికి తెస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని పరిశీలిస్తే.. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నిధులు అందడం లేదు. దీంతో నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. పైగా సీఎం కూడా వారికి అప్పాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. ఏదైనా ఉంటే.. ఇంచార్జ్ మంత్రితో మాట్లాడాలి. లేకపోతే.. రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కి మొరపెట్టుకోవాలి. పాపం.. చాలా …
Read More »ఏమైపోయారబ్బా..ఎక్కడా కనబడటం లేదే ?
కాస్తా కూస్తా కాదు ఏకంగా ఐదేళ్ళు మంత్రిగా అపరిమితమైన అధికారాలు చెలాయించారు. అయితే సీన్ తిరగబడటంతో గడచిన ఏడాదిన్నరగా ఎక్కడా కనబడటం లేదు సరికదా ఎవరికీ అందుబాటులో కూడా ఉండటం లేదట. ఇదంతా ఎవరి గురించనుకుంటున్నారా అవును, ఆయనే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. మంత్రిగా ఉన్నపుడు గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం జిల్లాలోనే ఓ విధంగా చక్రం తిప్పారు. కానీ తాను ఓడిపోవటమే కాకుండా పార్టీ …
Read More »ఇంత ఉత్కంఠలోనూ.. జగన్ ప్రయోగం..
తిరుపతి ఉప ఎన్నికకు త్వరలోనూ ముహూర్తం ఖరారు కానుంది. దీనికి సంబందించి పార్టీలు ఎవరికి వారు పోటీ పడేందుకు రెడీ అయ్యారు. ఈ విషయంలో చంద్రబాబు మరింత స్పీడ్‌గా స్పందించారు. ఇక, బీజేపీ, జనసేనల కూటమి కూడా బాగానే ఇక్కడ ప్రచారం చేయాలని.. ఎట్టి పరిస్థితిలోనూ దూకుడు చూపించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారనుంది. మరీ ముఖ్యంగా గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల …
Read More »బంగారం లాంటి ఛాన్సు మిస్ చేసుకున్న కేసీఆర్
అవకాశాలు చెప్పి రావు. అలాంటిది ఎంతో ముందుగా చెప్పి వస్తున్న వేళ.. ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన వేళ.. అందుకు భిన్నంగా ఉండిపోవటం చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. ఆయన కుమారుడు కేటీఆర్ కు ఏమైందన్న సందేహం కలుగక మానదు. దేశంలోని ఒక మహా నగరానికి 64 దేశాలకు చెందిన రాయబారులు.. హైకమిషనర్లు రావటం అంటే మాటలా? అలాంటి అరుదైన అవకాశం వచ్చినప్పుడు నగర ఇమేజ్ …
Read More »కరణం కొంచెం తగ్గాలి.. కమ్మ నేతల సూచన ఇదే!
ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తికి సంబంధించి స్థానికంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిని ఆయన సానుభూతి పరులే వైరల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటి సారాంశం మొత్తం ఒక్కటే. రాజకీయంగా ఆయనకు కొంత సానుకూల వాతావరణాన్ని కల్పించడమే. ఈ క్రమంలో కరణం సామాజిక వర్గం అన్యాపదేశంగా ఆయనకు కొన్ని సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆది నుంచి ఇప్పటి వరకు కూడా కరణంను.. …
Read More »టాప్ జర్నలిస్ట్ గాలి తీసేసిన బీజేపీ లీడర్
ప్రముఖ జాతీయ ఛానెళ్లతో పాటు వాటిని లీడ్ చేసే జర్నలిస్టులు సైతం పొలిటికల్ అజెండాతో పని చేస్తారన్న సంగతి స్పష్టంగా తెలిసిపోతుంటుంది. రిపబ్లిక్ టీవీని నడిపించే అర్నాబ్ గోస్వామి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. ఇక ఇండియా టుడే టీవీ ఛానెల్‌కు ముఖచిత్రంగా ఉంటున్న రాజ్‌దీప్ సర్దేశాయ్ ముందు నుంచి కాంగ్రెస్ మద్దతుదారుగానే ఉంటున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచే ఛానెళ్లలోనే పని …
Read More »