Political News

బాబు ఊరించారు.. కానీ ! టీడీపీ మాజీ ఎంపీకి చేదు అనుభ‌వం!

రాజ‌కీయాల్లోకి వ‌చ్చే నాయ‌కులు ఆశ పెట్టుకోవ‌డం స‌హజం.. ప‌దవులు కావాలి.. కాంట్రాక్టులు కావాలి.. ఇలా అనేక రూపాల్లో వారికి ఆశ‌లు ఉంటాయి. వీటిని నెర‌వేర్చ‌డం.. నెర‌వేర్చ‌క‌పోవ‌డం అనేది .. పార్టీ అధినేత‌ల మ‌నోభీష్టంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. ఇంత వ‌ర‌కు త‌ప్పులేదు. అయితే.. స‌ద‌రు నేత‌.. అభీష్టం నెర‌వేర‌స్తాన‌ని చెప్పి.. నీకెందుకు నాదీ బాధ్య‌త‌ అని డైలాగులు పేల్చిన త‌ర్వాత కూడా హ్యాండిస్తే..?! చ‌డీ చ‌ప్పుడు లేకుండా.. ఎలాంటి ఆర్భాట‌మూ లేకుండానే …

Read More »

వీర్రాజు పై ఒత్తిడి పెంచేస్తున్న బండి

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారశైలి కారణంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై అనివార్యంగా ఒత్తిడి పెరిగిపోతోంది. మొదటినుండి కమలంపార్టీకి సంబంధించి తెలంగాణాకు ఏపిలో పరిస్ధితులకు చాలా వ్యత్యాసముంది. పార్టీ అంతో ఇంతో బలంగా ఉందంటే అది తెలంగాణాలో మాత్రమే అని అందరికీ తెలిసిందే. అలాంటి పార్టీలో బండి సంజయ్ అధ్యక్షుడు అయిన దగ్గర నుండి ఒక్కసారిగా జోరు పెరిగింది. దానికితోడు దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటం, …

Read More »

అహంతో అంద‌రికీ దూర‌మై.. అఖిల పాలిటిక్స్‌‌ పై క‌ర్నూలు టాక్‌!!

టీడీపీ నాయ‌కురాలు.. మాజీ మంత్రి అఖిల ప్రియ‌.. హ‌ఫీజ్ పేట భూముల విష‌యంలో జ‌రిగిన కిడ్నాప్ కేసులో అరెస్ట‌యి.. బెయిల్ కూడా ల‌భించ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. అదేస‌మ‌యంలో ఈ కేసుకు సంబంధించి తొలుత ఏ-2గా ఆమె పేరును పేర్కొన్న పోలీసులు.. తెల్లారేస‌రికి ఏ-1 అని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో అయ్యో.. ఏంటీ ఘోరం అనుకున్న‌వారు చాలా మంది ఉన్నారు. ఇక‌, త‌ర్వాత ప‌రిణామాల నేప‌థ్యంలో అఖిల ప్రియ సోద‌రి …

Read More »

5,394 కోట్ల అద‌న‌పు అప్పు.. జ‌గ‌న్ ఏం చేస్తున్నారంటే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. ఇప్పుడు అప్పుల ప్ర‌దేశ్‌గా మారుతోంద‌నే భావ‌న సర్వ‌త్రా వినిపిస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు మ‌రిన్ని అప్పులు చేసుకునేందుకు ప‌రుగులు పెడుతోంది. మేనిఫెస్టోలో ప్ర‌క‌టించిన ప్ర‌తి అంశాన్నీ అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ఈ క్ర‌మంలో కొంద‌రికోసం.. అంద‌రిపైనా.. భారాలు మోపే బ‌హుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారని విశ్లేష‌కులు చెబుతున్నారు. కేంద్రం అప్పులు తీసుకునేందుకు ఏమాత్రం వెసులు బాటు క‌ల్పించినా.. ఏపీ స‌ర్కారు …

Read More »

చివరకు కోడిపుంజులే గెలిచాయి

చివరకు కోడిపుంజులే గెలిచాయి. ప్రతిఏటా సంక్రాంతి సందర్భంగా జరుపుకునే కోళ్ళపందేలను ఈసారి ఎలాగైనా అడ్డుకోవాలన్న పోలీసుల ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. దానికి తగ్గట్లే హైకోర్టు కూడా కోళ్ళపందేలు జరగకుండా చూడమని పోలీసులను గట్టిగా హెచ్చరించటంతో ఈసారి కోడిపందేలు అనుమానమేనా అనిపించింది. కానీ పండుగ మొదటిరోజైన భోగిపండుగ నాడు యధావిధిగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల కోళ్ళపందేలు మొదలయ్యాయి. మొదటిరోజే సుమారు రూ. 100 కోట్లు పందెంలో …

Read More »

ట్రంప్ కు షాకిచ్చిన సొంతపార్టీ ఎంపిలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ అభిశంసనకు సొంతపార్టీ రిపబ్లికన్లు కూడా మద్దతు పలకటం సంచలనంగా మారింది. గురువారం తెల్లవారు జామున అమెరికా ప్రతినిధుల సభలో డెమక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఆమోదంపొందింది. అభిశంసన తీర్మానానికి అనుకూలంగా డెమక్రాటిక్ అభ్యర్ధులు 222 మంది మద్దతు తెలిపారు. అయితే పదిమంది రిపబ్లికన్ ఎంపిలు కూడా మద్దతుగా ఓటేయటం ట్రంప్ కు షాక్ కొట్టేదనటంలో సందేహం లేదు. ఈనెల 20వ తేదీన …

Read More »

తెలంగాణలో తొలి టీకా ఎవరికంటే..

నిరీక్షణ ఫలించింది. మరో రెండు రోజుల్లో మాహమ్మారికి చెక్ పెట్టే టీకాను వాడటం షురూ చేయనున్నారు. తొలిదశలో వైద్యులు.. వైద్య ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ మీద పలు సందేహాలు వస్తున్న వేళ..అలాంటి వాటికి చెక్ చెబుతూ.. తెలంగాణలో తొలి టీకా తానే వేయించుకుంటానని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పటం తెలిసిందే. పలు సందర్భాల్లో తొలి టీకాను తానే వేయించుకుంటానని ఆయన చెప్పారు. …

Read More »

క్లీన్ ఇమేజ్ ఉన్న మంత్రి.. ఒక్క‌సారిగా అన్ పాపుల‌ర్ అయ్యారే!

జ‌గ‌న్ కేబినెట్‌లో ఇత‌ర మంత్రుల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఒక‌రిద్ద‌రు మంత్రుల‌కు క్లీన్ ఇమేజ్ ఉంది. వారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌రు.. ప‌నిమాత్ర‌మే చేస్తారు! అనే సంపాయించుకున్నారు. అంతేకాదు.. వారు మంత్రి ప‌ద‌వి ఉందిక‌దా అని దూకుడుగా కూడా ఉండ‌రు. ఎక్క‌డ ఎంత‌వ‌ర‌కు వ్య‌వ‌హ‌రించాలో.. అక్క‌డ అంత‌వ‌ర‌కు ప‌నిచేసి.. క్లీన్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇటు ప్ర‌భుత్వంలోను, అటు త‌మ జిల్లాలోనూ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి వారు …

Read More »

ప‌లాస‌ లో రాణులదే రాజ్యం

రాష్ట్రంలో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో శ్రీకాకుళంలోని ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పురుషులు గెలుస్తారు.. కానీ, చ‌క్రం తిప్పేది మాత్రం మ‌హిళ‌లే! అనే వాద‌న ఉంది. పైకి జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా దీనిని ఔన‌నే అంటున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు విజ‌యం సాధించారు. స‌రే.. కొన్నాళ్ల‌కు ఈయ‌న‌కు జ‌గ‌న్ బీసీ కోటాలో మంత్రి …

Read More »

ఆ మంత్రికి సెగ‌: మితిమీరిన.. దూకుడే రీజ‌నా?

రాజ‌కీయాల్లో దూకుడు ఉండొచ్చు.. ఉండాలి కూడా! దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. అయితే.. దీనికి కూడా ఒక హ‌ద్దు.. అదుపు అనేది చాలా కీల‌కం. మితిమీరిన దూకుడు.. ఎక్క‌డా వ‌ర్క‌వుట్ కాదు. వైసీపీలో కీల‌క క‌మ్మ నాయ‌కుడిగా ఎదిగే అవ‌కాశం ఉండి కూడా.. కేవ‌లం త‌న నోటి దూకుడు కార‌ణంగా.. అంద‌రికీ చేరువ కాలేక‌పోతున్నార‌నే అభిప్రాయం.. మంత్రి కొడాలి నాని విష‌యంలో వినిపిస్తోంది. తాను రాజ‌కీయ అక్ష‌రాభాస్యం చేసిన టీడీపీని, త‌న‌కు …

Read More »

అంత అర్జెంట్ గా విచారించాల్సిన అవసరం లేదన్న ఏపీ హైకోర్టు

ఏపీలో స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలని ఏపీ ఎన్నికల కమిషనర్ పట్టుదలతో ఉండటం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్ని నిర్వహించటం సరికాదని ఏపీ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ను జారీ చేయటం తెలిసిందే. దీనిపై ఏపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించటం.. ఎన్నికల షెడ్యుల్ పై సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేయటం తెలిసిందే. దీంతో.. స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆగింది. దీన్ని సవాలు చేస్తూ ఏపీ …

Read More »

సోనూసూద్ పాత నేరస్తుడు.. ఈ మాటలు చెప్పిందెవరో తెలుసా?

అనుకోవాలే కానీ.. కొన్ని వ్యవస్థలకు తమకు నచ్చినప్పుడు.. నచ్చిన రీతిలో మాట్లాడేసే అద్భుత అవకాశం మన దేశంలో ఉంటుంది. లాక్ డౌన్ వేళ.. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించి.. తన సొంత డబ్బును మంచినీళ్ల మాదిరి ఖర్చు చేస్తూ సహాయ సహకారాలు అందించిన నటుడు సోనూసూద్ గురించి గతంలో తెలీదేమో కానీ.. ఇప్పటికైతే ప్రజలందరికి తెలిసిందే. అలాంటి వ్యక్తిని పట్టుకొని.. నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసింది బాధ్యతాయుత స్థానంలో ఉన్న …

Read More »