ఔను.. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విషయంలో జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు? ఎలా ముందుకు సాగుతారు? ఇదీ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్న ప్రధాన చర్చ. రెండు కీలక పార్టీలు.. వైసీపీ, టీడీపీల విషయంలో చర్చ ఎలా ఉన్నప్పటికీ.. జనసేన విషయంలో మాత్రం ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ లో కేసీఆర్‌ను పవన్ సమర్ధిస్తున్నారు.
సాగర్ ఉప ఎన్నిక సమయంలోను.. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలోనూ.. పవన్‌కళ్యాణ్ నేరుగానే టీ ఆర్ఎస్‌కు మద్దతిచ్చారు. అంతేకాదు.. తరచుగా.. అక్కడి ప్రభుత్వాన్ని కూడా ఆయన కొనియాడుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి పవన్ విషయంలోను, ఆయన పార్టీ విషయంలోనూ.. ఎలాంటి ప్రకటనా రాలేదు. కనీసం ఇప్పటి వరకు నేరుగా ఒక్కటంటే.. ఒక్క ప్రకటన కూడా.. కేసీఆర్ చేయలేదు. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారింది.
కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ విషయంలో పవన్ మద్దతు అవసరం. ఈ క్రమంలో కేసీఆర్.. పవన్ కోసం .. ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కాకపోయినా.. రేపయినా.. పవన్‌ను ప్రగతి భవన్‌కు ఆహ్వానించే యోచన చేస్తున్నారని సమాచారం. అయితే.. కేసీఆర్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. పవన్ పరిస్థితి మాత్రం అడకత్తెరలో పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే.. పవన్..ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. కేసీఆర్ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగానే బీఆర్ ఎస్ తెచ్చానని చెబుతున్నారు.
సో.. ఈ రెండు భావాలు కలిసేలా కనిపించడం లేదు. మరోవైపు.. రేపు వచ్చే ఏపీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు పవన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీకి.. కేసీఆర్‌కు అస్సలు పొసిగే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో పవన్ టీడీపీతో జట్టు కడితే.. బీఆర్ఎస్ తో కలిసి అడుగులు వేసే పరిస్థితి లేదు. ఇక బీజేపీ కూడా.. ఈ వ్యవహారంపై పవన్‌ను నిశితంగా గమనించే అవకాశం ఉంటుంది.
ఆయన వేసే అడుగులను బట్టి.. పొత్తు ఉంటుందా? కట్ చేసుకుంటుందా? అనేది చూడాలి. అయితే.. దీనివల్ల బీజేపీకే నష్టం చేకూరే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా.. కేసీఆర్ విషయంలో పవన్ అనుసరించబోయే.. వ్యూహం ఆసక్తిగా మారింది. ఎలా ఎలాంటి స్టెప్ వేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates