తెలంగాణ రాష్ట్ర గిరిజన.. మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. మానత్వంతో ఆమె స్పందించిన తీరుతో అందరి మనసుల్ని దోచేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో డోర్నకల్ కు చెందిన 28 ఏళ్ల రషీద్ పాషా మరణించటం తెలిసిందే. దీంతో.. పాషా ఇద్దరు కుమార్తెలు అనాథలైనట్లుగా తెలుసుకున్న మంత్రి.. ఆదివారం డోర్నకల్ కు వచ్చారు. వారి ఇద్దరు పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు. తానురాష్ట్రానికి …
Read More »ఐఏఎస్, ఐపీఎస్‌లపై జగన్ మార్కు దూకుడు.. ఏం జరుగుతుంది!
ఇటీవల జరిగిన పరిణామాలను గమనిస్తే.. జగన్ సర్కారుకు ఉద్యోగులు అందరూ సానుకూలంగా ఉన్న పరిస్థితి కళ్లకు కట్టింది. నిజానికి ఒకప్పుడు ఉద్యోగులకు, ప్రభుత్వాలకు మధ్య సయోధ్య ఉండేది కాదు. తమ హక్కుల విషయంలో ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందనే వాదన ఉద్యోగ వర్గాల్లో ప్రముఖంగా కనిపించేది. చంద్రబాబు గత పాలనను తీసుకుంటే.. తమపై భారం మోపేశారంటూ.. కొన్ని ఉద్యోగ సంఘాలు భారీగానే గళం వినిపించాయి. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత.. ఉద్యోగులకు …
Read More »మొత్తం కుటుంబం అంతా ఇన్వాల్వయ్యిందా ?
బోయినపల్లి కిడ్నాప్ గా సంచలనం సృష్టించిన ముగ్గురు సోదరుల కిడ్నాప్ ఘటనలో మాజీమంత్రి , టీడీపీ నేత భూమా అఖిలప్రియ అత్తగారి కుటుంబం మొత్తం ఇన్వాల్వయినట్లు పోలీసులు నిర్ధారించారు. ముగ్గురు సోదరుల కిడ్నాప్ కు ముందు భూమా అఖిలప్రియ, ఆమ భర్త భార్గవరామ్, మరిది చంద్రహాస్, అత్తగారు కిరణ్మయి, మామగారు మురళిని నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చటం సంచలనంగా మారింది. ఓ కిడ్నాప్ ఘటనలో మొత్తం కుటుంబం కుటుంబమంతా …
Read More »బీజేపీ లక్ష్యాన్ని ముద్రగడ చేరుకుంటారా ?
వెటరన్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభంను బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. శనివారం మధ్యాహ్నం ముద్రగడ ఇంట్లో ఆయనతో భేటీ అయిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రస్తుత రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు దగ్గర్లోని కిర్లంపూడి ముద్రగడ స్వగ్రామమన్న విషయం అందరికీ తెలిసిందే. కాపు సామాజికవర్గానికి చెందిన ముద్రగడను ఎలాగైనా పార్టీలోకి తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో ఉపయోగం ఉంటుందని వీర్రాజు పెద్ద ప్లాన్ వేశారు. ముద్రగడ పార్టీలో చేరటం …
Read More »పాపం వైఎస్ వివేకా కూతురు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి తన స్వగృహంలో దారుణంగా హత్యకు గురై దాదాపు రెండేళ్లు కావస్తోంది. ముందు వివేకా గుండెపోటుతో చనిపోయాడని సాక్షి మీడియాలో వార్తలు రావడం.. కొన్ని గంటల తర్వాత ఆయనది దారుణ హత్య అని తేలడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హత్య జరిగినపుడు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. …
Read More »చివరకు ఎవరికీ కాకుండా పోయాడా ?
ఈ సీనియర్ నేతను గురించి అందరు ఇదే అనుకుంటున్నారు. ఎందుకంటే ఒకపుడు ఐదేళ్ళపాటు జిల్లా మొత్తం మీద బ్రహ్మాండంగా ఓ వెలుగు వెలిగిన ఈ నేత హఠాత్తుగా ఎవరికీ కనబడటం లేదు, ఎక్కడా వినబడటం లేదు. గడచిన ఏడాదిన్నరగా అయితే అసలు ఈ నేత గురించి జిల్లాలోని రాజకీయ జనాలు దాదాపు మరచిపోయినట్లే ఉన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటారా అదే శిద్దా రాఘవరావు గురించే ఇదంతా. 2004 ఎన్నికల్లో పొలిటికల్ …
Read More »కోవాగ్జిన్‌తో తేడా వస్తే.. భారత్ బయోటెక్ కీలక ప్రకటన
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా శనివారం భారత్ పెద్ద ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. కోవిడ్ పోరులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేశారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ వారి కోవిషీల్డ్‌తో పాటు భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్‌ను దేశవ్యాప్తంగా వేలాది మంది ఫస్ట్ డోస్‌గా తీసుకున్నారు. ఐతే వీరిలో దాదాపు 50 మంది దాకా అస్వస్థతకు గురి కావడం, …
Read More »ఒత్తిడికి తలొంచిన వాట్సప్ యాజమాన్యం
చివరకు ఒత్తిడికి వాట్సప్ యాజమాన్యం తలొంచిందనే అనుకోవాలి. ఫిబ్రవరి 8వ తేదీ నుండి ప్రైవసీ పాలసీ అమల్లోకి వస్తుందని యాజమాన్యం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమ పాలసీని మూడు నెలలు వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించింది యాజమాన్యం. తాము కొత్తగా రూపొందించిన ప్రైవసీ పాలసీకి యూజర్లు అంగీకరించకపోతే వారికి ఫిబ్రవరి 8వ తేదీ నుండి వాట్సప్ సేవలు ఆగిపోతాయని గతంలోనే యాజమాన్యం ప్రకటించింది. ఎప్పుడైతే యాజమాన్యం ప్రకటించిందో అప్పటి …
Read More »వ్యాక్సిన్.. 30 కోట్ల మందికి.. బాదుడు.. 130 కోట్ల మందికి.. ఇంట్రస్టింగ్ డిబేట్
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి దేశం సిద్ధమైంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్లను దశలవారీగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం బాగానే కృషి చేసింది. ప్రపంచంలోనే అత్యధిక మందికి… అందునా అత్యంత వేగంగా కరోనా టీకా అందిస్తున్న దేశంగా ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ద్రవ్య నిధి సంస్థ వరకు భారత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తొలి దశ శనివారం దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. …
Read More »వ్యవసాయ చట్టాల వివాదానికి చక్కటి పరిష్కారం
కేంద్రం అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వివాదానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ సీ. రంగరాజన్ చక్కటి పరిష్కారాన్ని చూపారు. కేంద్రం మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాలు ఉద్యమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతుసంఘాలు పట్టుబడుతుండగా, రద్దు సమస్య లేదని కావాలంటే సవరణలు తీసుకొస్తామని కేంద్రం చెబుతోంది. ఈ ఒక్క పాయింట్ దగ్గరే …
Read More »ముద్రగడ బీజేపీలో చేరుతున్నాడా ?
అవును ఇపుడిదే ప్రశ్న తూర్పుగోదావరి జిల్లాలో చక్కర్లు కొడుతోంది. కమలంపార్టీ అద్యక్షుడు సోము వీర్రాజు-ముద్రగడ భేటి జరగబోతోందంటు ఒకటే ప్రచారం జరిగిపోతోంది. శనివారం ముద్రగడ ఇంట్లో వీర్రాజు భేటి అవుతున్నారు. నిజానికి ముద్రగడ క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుని చాలా కాలమే అయిపోయింది. ఒకవిధంగా మాజీమంత్రి ముద్రగడ అవుట్ డేటెడ్ పొలిటిషీయన్ అనే చెప్పుకోవాలి. ఆయన వల్ల ఏ పార్టీకి కూడా పెద్దగా లాభం ఉంటుందని అనుకునేందుకు లేదు. మరలాంటి …
Read More »నీడ్ ఆఫ్ ది అవర్..జగన్ గోపూజ
రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగిపోతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గోపూజ నిర్వహించారు. గడచిన మూడు మాసాలుగా రాష్ట్రంలోని వివిద దేవాలయాలపై దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంతర్వేది, రామతీర్ధం లాంటి దేవాలయాలపై దాడులు చేసిన గుర్తుతెలీని వ్యక్తులు రథాన్ని, విగ్రహాలను ద్వంసం చేశారు. ఈ నేపధ్యంలోనే ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాలను రేపుతున్నాయి. ఇటువంటి అనేక ఘటనలను దృష్టిలో పెట్టుకునే అన్నట్లుగా సంక్రాంతి పండగ సందర్భంగా …
Read More »