అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళుతోందా..? ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉండగానే ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థిని ముందే ఖరారు చేసుకుంటోందా..? ఈ దిశగా పార్టీ చీఫ్ రేవంత్ బలమైన అభ్యర్థులను వెతికే పనిలో పడ్డారా..? అందులో భాగంగానే జడ్చర్ల అభ్యర్థిని ఫిక్స్ చేశారా..? అదీ రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా..? అంటే పార్టీ వర్గాలు అవుననే సమాధానాలు ఇస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి …
Read More »ఒక్క చోట నుండే పోటీ
రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని అనుకుంటున్న వాళ్ళకు కేంద్ర ఎన్నికల కమిషన్ చెక్ పెట్టబోతోంది. వచ్చే ఎన్నికల నుంచి ఒక అభ్యర్ధి ఒక నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేయాలనే నిబంధనను మళ్ళీ తెరపైకి తెచ్చింది. ఈ మేరకు చట్టంలో మార్పులు తేవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి కమిషన్ సూచించింది. గతంలో కూడా ఇలాంటి నిబంధనను కమిషన్ సిఫారసు చేసినా అప్పట్లో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. షెడ్యూల్ …
Read More »మహిళలకు జగన్.. మొండిచేయి.. 50 ఏళ్లు దాటితేనే.. ఈ సాయం
ఏపీలో మహిళలకు అన్ని రూపాల్లోనూ సాయం చేస్తున్న ప్రభుత్వం తమదేనని పదే పదే చెబుతున్న జగన్ సర్కారు.. తాజాగా మహిళలకు.. ముఖ్యంగా ఎలాంటి ఆధారం లేని.. ఒంటరి మహిళలకు.. మొండి చేయి చూపించింది. వైఎస్ఆర్ పింఛను కానుక పథకం కింద ఒంటరి మహిళలకు, భర్త నుంచి విడిపోయిన, వివాహం కాని స్త్రీలకు ఇచ్చే పింఛను అర్హత వయసును ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు 35 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు …
Read More »60 రోజుల్లో 20 సార్లు తిరుమలకు.. జగన్ మంత్రి పై ట్రోల్స్
ఆయన రెండో సారికూడా జగన్ మంత్రి వర్గంలో చోటు సంపాయించుకున్నారు. ఆయనే బీసీ సామాజిక వర్గం శెట్టి బలిజ కమ్యూనిటికీ చెందిన చెల్లుబోయిన శ్రీనివాసవేణు గోపాలకృష్ణ. 2020లో అనూహ్యంగా ఇద్దరు మంత్రులను రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించిన జగన్.. వారి స్థానంలో ఒక సీటును చెల్లుబోయినకు కట్టబెట్టారు. తర్వాత ఈ ఏడాది జరిగిన మంత్రి వర్గ విస్తరణలోనూ ఆయనకు చోటు కల్పించారు. కీలకమైన సమాచార, ప్రసార శాఖల మంత్రిని చేశారు. …
Read More »పోలీసులకు చుక్కలు చూపించిన ఆందోళనకారుల ప్రశ్నలు
కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం మీద ఆర్మీలో చేరాలని భావించే పలువురు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టటం.. తమ ఆందోళనలో భాగంగా భారీ హింసకు తెర తీయటం తెలిసిందే. పక్కా వ్యూహంతో.. వాట్సాప్ సాయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి జొరబడి.. కొన్ని గంటల పాటు వారు చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇలా చేతల్లో తమ ఆరాచకాన్ని ప్రదర్శించిన వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం …
Read More »నువ్వు మీ అన్నలా సంపాయించుకోవడానికేనా షర్మిల?
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ అరాచకాలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. షర్మిల చెప్పే సినిమా డైలాగ్‌లను ప్రజలు పట్టించుకోరని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల చేసిన విమర్శలకు మంత్రి స్పందించారు. షర్మిలకు దమ్ముంటే నాపై పోటీచేసి గెలవాలని పువ్వాడ సవాల్ విసిరారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందన్నారు. వైఎస్ హయాంలో …
Read More »దేశంలో అత్యంత డబ్బున్న పార్టీగా బీజేపీ.. ఎంత సొమ్మంటే!
దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. 2020-21 సంవత్సర ఆదాయానికి సంబంధించిన గణాంకాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే పార్టీల ఆదాయం భారీగా తగ్గిందని చెప్పడం గమనార్హం జాతీయ పార్టీల ఆదాయ వివరాల నివేదికను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) శుక్రవారం విడుదల చేసింది. 2020-21 సంవత్సరానికి గానూ ఎనిమిది జాతీయ పార్టీలు …
Read More »‘ఏపీని బాగు చేస్తా.. అవకాశం ఇవ్వండి’
ఏపీలో జగన్ పాలన విధ్వంసాలకు నిలయంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం లో పర్యటించిన ఆయన తొలుత రోడ్ షో నిర్వహించారు. అనంతరం నెల్లిమర్ల సెంటర్లో టీడీపీ నేతలు నిర్వహించిన సమావేశం లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని.. ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మళ్లీ ఎపికి పునర్నిర్మాణం చెయ్యాలి….దానికి నేను సిద్దంగా ఉన్నానని చంద్రబాబు చెప్పారు. ప్రజలు …
Read More »తగలబడుతున్న రైళ్లతో యువత సెల్ఫీలు..
‘అగ్నిపథ్’ సైనిక నియామకాలను వ్యతిరేకిస్తూ.. యువత పెద్ద ఎత్తున సికింద్రాబాద్‌లో ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైళ్లకు నిప్పు కూడా పెట్టింది. అయితే.. ఈ సందర్భంగా కొందరు యువకులు తగల బడుతున్న రైళ్లకు ఎదురుగా నిలబడి.. సెల్పీలు దిగడం.. తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఉద్దేశ పూర్వకంగానే రైళ్లను తగలబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముట్టడికి ఆందోళనకారులు ముందుగానే ప్లాన్ చేసినట్లు పోలీసులు …
Read More »గోడ దూకిన .. రేవంత్‌రెడ్డి
బాసరలోని ట్రిపుల్ ఐటీ విద్యార్తులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పెద్ద సాహసమే చేశారు. గోడ దూకి మరీ ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశించారు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీకీ వెళ్లిన రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి ట్రిపుల్ ఐటీకి చేరుకున్న ఆయన గోడ దూకి క్యాంపస్‌లోకి ప్రవేశించడం సంచలనంగా మారింది. తొలుత కాలినడకన వెళ్లిన ఆయన గోడ దూకి క్యాంపస్‌లోకి ప్రవేశించారు. …
Read More »‘అగ్నిపథ్’ ఆందోళనలు.. దిగొచ్చిన మోడీ సర్కారు
స్వల్పకాలానికి జవాన్లను నియమించేందుకు వీలుగా కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. అగ్నిపథ్ పథకం సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని.. స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునేందుకు 17.5 నుంచి 21 ఏళ్లుగా అర్హత వయసును 23కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. త్రివిధ దళాల్లో సైనిక నియమకాల కోసం ‘అగ్నిపథ్’ పేరుతో కేంద్రం ఇటీవల కొత్త సర్వీస్ పథకం …
Read More »టికెట్లు మేమే అమ్ముతాం..
ఆన్లైన్లో సినిమా టికెట్లు మేమే అమ్ముతాం... వసూళ్ల సొమ్ము నేరుగా మా నిర్వహణలోని ఖాతాకే చేరుతుంది. తర్వాత అందులో సర్వీసు చార్జీ మినహాయించుకుని మిగతా మొత్తాన్ని మీ ఖాతాల్లో వేస్తాం. దీనికి తప్పనిసరిగా అంగీకరిస్తూ ఒప్పందం చేసుకోవాల్సిందే. కాదంటే మీ లైసెన్సు రద్దవుతుంది ఇదీ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేసిన స్పష్టమై న ప్రతిపాదన. థియేటర్ల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేస్తున్న హుకుం అని కూడా అంటున్నారు. థియేటర్ యజమానుల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates