ప‌వ‌న్ ఎఫెక్ట్: బీజేపీలో సెగ‌లు..!

Pawan Kalyan and Somu Veeraju

తాజాగా టీడీపీతో చేతులు క‌లిపిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉదంతం.. ఏపీ బీజేపీలో.. సెగ‌లు పుట్టిస్తోంది. ఏమాత్రం ఓటు బ్యాంకులేని.. బీజేపీకి అండ‌గా ఉండేందుకు సిద్ధ‌మైన ప‌వ‌న్‌ను.. ఉద్దేశ పూర్వ‌కంగానే బ‌య‌ట‌కు పంపించార‌నే చ‌ర్చ‌.. బీజేపీలో జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.దీనికి క‌ర్త‌, క‌ర్మ, క్రియ కూడా.. ప్ర‌స్తుత బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజే అనే భావ‌న వినిపిస్తోంది. తాజాగా దీనిపై ఓ మీడియాతో మాట్లాడిన బీజేపీ మాజీ అధ్య‌క్షుడు.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆచి తూచి వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఆయ‌న వ్యాఖ్య‌లు.. హీటెక్కిస్తున్నాయి.

“బీజేపీతో క‌లిసి ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను స‌క్ర‌మంగా కో ఆర్డినేట్ చేయ‌డంలో మా రాష్ట్ర నాయ‌క‌త్వం.. ఫెయిలైంద‌ని చెప్ప‌డంలో నేను ఒప్పుకొంటాను. ఈ విష‌యంలో నాకు మ‌రో  ఆలోచ‌న‌లేదు. గ‌తంలో అంత‌ర్గ‌తంగా అనుకునేవాడిని..ఇప్పుడు బ‌య‌ట‌కు చెబుతున్నా. ఆయ‌న‌తో క‌లిసి న‌డిచే విష‌యంలో రాష్ట్ర నేత‌లు విఫ‌ల‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఢిల్లీ నేత‌లు రంగంలోకి దిగి.. స‌రిదిద్దుతారేమో.. చూడాలి. వాస్త‌వానికి ఈ గ్యాప్‌ను గతంలోనే కేంద్ర నాయ‌క‌త్వం గుర్తించి.. జాతీయ నాయ‌కుడు.. ముర‌ళీధ‌ర‌న్‌కు స‌రిదిద్దే బాధ్య‌త అప్ప‌గించిన‌ట్టు తెలిసింది“ అని క‌న్నా అన్నారు.

అంతేకాదు.. గ‌తంలో తాను అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు.. కేంద్రం నుంచి వ‌చ్చే స‌మాచారాన్ని పంచుకునేవాళ్లమ‌ని, ప్ర‌తి రెండు  నెల‌ల‌కు ఒక‌సారి స‌మావేశం పెట్టుకుని.. విష‌యాల‌పై చ‌ర్చించుకునే వాళ్ల‌మ‌ని చెప్పారు. అయితే.. ప్ర‌స్తుతం సోము వీర్రాజు ఒక్క‌రే.. `ఓన్లీ వ‌న్‌`గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. వ్యాఖ్యానించారు. దీంతో మాకు విష‌యాలు తెలియ‌డం లేదు. ఆయ‌న ఎవ‌రితోనూ.. ఏమీ పంచుకోవ‌డం లేదు. క‌నీసం కోర్ క‌మిటీలోనూ .. చ‌ర్చించ‌డం లేదు. అయితే.. కోఆర్డినేష‌న్ మాత్రం లేదు. అంతేకాదు.. అస‌లు ఢిల్లీలో ఏం నిర్ణ‌యాలు తీసుకుంటున్నారో.. కూడా తెలియ‌డం లేద‌న్నారు. మొత్తంగా చూస్తే.. ఈ ప‌రిణామం.. సోము కు బాగానే సెగ పెట్టేట్టుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.