సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. దీనిని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. నాడు రైతులతో పెట్టుకున్నారని.. నేడు జవాన్లతో పెట్టుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన సటైర్లు వేశారు. ఇదేనా మీ పాలన! అంటూ.. నిప్పులు చెరిగారు. ‘అగ్నివీర్ స్కీమ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం. తొలుత దేశంలో …
Read More »కాక రేపుతున్న తెలంగాణ ఎటు చూసిన ఆందోళనలే!
ఉద్యమాల గడ్డగా పేరొందిన తెలంగాణలో గడిచిన మూడు రోజులుగా అవే ఉద్యమాలు సెగలు పుట్టిస్తున్నా యి. పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. వరుస ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఒకవైపు కాంగ్రెస్.. మరోవైపు.. బీజేపీ.. ఇంకో వైపు. నిరుద్యోగుల.. మరోవైపు… విద్యార్థులు.. ఇలా.. రాష్ట్రం నలుచెరగలా.. ఆందోళనలు.. నిరసనలు కొనసాగుతున్నాయి. కారణాలు ఏవైనా.. రాష్ట్రం ఇప్పుడు.. నిరసనలకు కేంద్రంగా మారిపోయింది. కాంగ్రెస్ విషయాన్ని చూస్తే.. నేషనల్ హెరాల్డ్ కేసులో.. పార్టీ …
Read More »జేసీ బ్రదర్స్‌కు షాక్: చుట్టుముట్టిన ఈడీ… ఆస్తుల తనిఖీ
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బయట వారిని లోపలికి రానీయడం లేదు. ప్రభాకర్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యుల మొబైల్ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జేసీ ఆస్తులకు సంబంధించిన వివిధ పత్రాలను తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లోనూ జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. …
Read More »బాదుడే బాదుడు.. టీడీపీ భవిష్యత్ మారిపోతుందా ?
బాదుడే బాదుడుతో మారిపోతుందనే చంద్రబాబునాయుడు నమ్ముతున్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీమహానాడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాదుడేబాదుడు కార్యక్రమానికి జనాల్లో విశేష స్పందన కనిపిస్తోందన్నారు. ఇప్పటివరకు పార్టీ కవర్ చేసింది కేవలం 16 శాతం ఇళ్ళను మాత్రమే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలను, అరాచకాలను జనాలకు వివరించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందులో …
Read More »రేవంత్, రేణుకపై కేసుల పిడుగు
కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి సహా విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ కాలర్ పట్టుకున్నారని రేణుకా చౌదరిపై, ఆర్టీసీ బస్‌పై దాడి చేసి, ఉద్యోగిని బెదిరించినందుకు.. పలువురు నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చలో రాజ్ భవన్ ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలపై పలు సెక్షన్ల కింద …
Read More »స్టేషన్‌కు వచ్చి కొడతా.. ఎస్సైపై రేణుక ఉగ్రతాండవం
ఖమ్మం మాజీ ఎంపీ.. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి.. ఉగ్రరూపం చూపించారు.. పోలీసులపైనే ఉగ్రతాండవం చేశారు. స్టేషన్‌కు వచ్చి కొడతా.. అంటూ.. ఓ ఎస్సై కాలర్ పట్టుకున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు.. రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై నిరసనగా తెలంగాణలో రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు తలపెట్టిన ఆందోళన రణరంగంలా మారింది. రాజ్‌భవన్ ముట్టడించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి రేణుకా …
Read More »రఘురామ రాజు ఆశలపై హైకోర్టు నీళ్లు
వైసీపీ ప్రభుత్వంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం పేరుతో కేసులు వేస్తున్న తిరుగుబాటు ఎంపీ రఘు రామ కృష్ణం రాజుకు హైకోర్టు పెద్ద షాకిచ్చింది. ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాల్లో, అప్పులు, సంక్షేమ పథకాలకు పెట్టే ఖర్చుల విషయంలో జోక్యం చేసుకునేది లేదని తేల్చి చెప్పేసింది. ప్రభుత్వం ఎక్కడినుండి అప్పులు తెస్తున్నా హైకోర్టుకు అవసరం లేదని, అప్పులు తెచ్చుకునే ప్రభుత్వం, ఇచ్చే సంన్ధలకు సంబంధించిన విషయమని గుర్తుచేసింది. ఎంపీ దాఖలు చేసిన పిటీషన్లు ప్రజాహితమే …
Read More »టీఆర్ఎస్ లో పీకే గుబులు
తెలంగాణా ఎన్నికల్లో ముందస్తు ఫీవర్ పెరిగేకొద్దీ టీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే 119 నియోజకవర్గాల్లోను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) బృందం చాలా డీటైల్డ్ గా సర్వేలు చేసిందట. దాని రిపోర్టును కేసీయార్ కు పీకే అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ఖమ్మం జిల్లా పర్యటనలో మంత్రి కేటీయారే బయటపెట్టారు. పీకే సర్వే రిపోర్టు ఆధారంగానే రేపటి ఎన్నికల్లో టికెట్లుంటాయని కేటీయార్ పెద్ద బాంబు …
Read More »2024 ఎన్నికల్లో పోటీనుండి తప్పుకున్న ఎంఎల్ఏ
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ రాజమండ్రి అర్బన్ ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవాని ప్రకటించారు. రాజమండ్రిలో మీడియాతో ఎంఎల్ఏతో పాటు ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తన భార్యకు బదులు తానే పోటీచేయబోతున్నట్లు శ్రీనివాస్ ప్రకటించేసుకున్నారు. తనను రాజమండ్రి ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబునాయుడు సూచించినట్లు శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబు చెప్పినట్లు ఎంపీగా పోటీ చేసేంత స్ధోమత తమకు లేదు కాబట్టి …
Read More »తమ్ముళ్ల ఆవేశం.. చంద్రబాబుకు తిప్పలు తెస్తోందా?
ఏపీ సర్కారుపై నిప్పులు చెరగాలనేది ఒక కాంక్ష అయితే.. అదేసమయంలో పార్టీ అధినేత దగ్గర మంచి మార్కులు వేయించుకుని ట్రెండింగ్‌లో ఉండాలనే మరో కాంక్ష కారణంగా.. టీడీపీ నాయకులు గాడి తప్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. రాజకీయ నేతలు ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించాలని అనుకోవడం.. ప్రజల నుంచి మెప్పు పొందాలని అనుకోవడం.. ఇప్పుడు కొత్తకాదు. అసలు రాజకీయం అంటేనే.. దూకుడు ఉండాలి. కానీ, ఈ దూకుడు ఇప్పుడు.. పార్టీ అధినేతను …
Read More »సీఎం జగన్ కసి తీర్చుకున్నారా?
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. అయితే.. ఏమాత్రం ప్రాధాన్యం లేని.. కమిషనర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీగా ఆయనను నియమించడం పట్ల ఐపీఎస్ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఆయనపై సీఎం జగన్ కసితీర్చుకున్నారా? అంటూ.. ఒకరు ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జి. విజయ్ కుమార్ ను రిలీవ్ చేసి, ఆ స్థానంలో ఏబీవీని …
Read More »జగన్.. మోడీపై ఒత్తిడి చేసే అవకాశముందా?
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంపై జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి పెంచేస్తున్నారు. ఎన్డీయే అభ్యర్ధికి మద్దతివ్వాలంటే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలనే షరతు విధించాలని పలువురు జగన్ కు సూచిస్తున్నారు. ఇలా షరతు విధిస్తేనే మోడి దిగొస్తారని, హోదా సాధనకు జగన్ కు రాష్ట్రపతి ఎన్నిక సువర్ణావకాశమని ఏదేదో చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే కాదనేవాళ్ళు ఎవరు లేరు. ఇదే సమయంలో ఆ అవకాశం ఎంతుందన్నదే అసలు పాయింట్. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates