అంచనాలు నిజమయ్యాయి. ముందుగా చెప్పినట్లే పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. నాలుగు దశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ఆయన.. తొలి దశలో విజయనగరం.. ప్రకాశం జిల్లా మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకు వెళుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ తమ నిర్ణయానికి భిన్నంగా సుప్రీంకోర్టు నిర్ణయం ఉంటే తప్పకుండా పాటిస్తామన్నారు. …
Read More »11 జిల్లాల్లోనే ఎన్నికలు..రెండు జిల్లాల మినహాయింపు
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ ఆలోచన ప్రకారం జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు షెడ్యూల్ అమల్లోకి వస్తే ముందుగా 11 జిల్లాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఎన్నికలు జరగటం లేదు. ఎందుకంటే పోయిన ఏడాది మార్చిలో స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలను, ఘర్షణలను నివారించలేకపోయిన కారణంగా పై జిల్లాల కలెక్టర్లపై నిమ్మగడ్డ చర్యలకు సిఫారసు చేశారు. అయితే వాళ్ళపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే …
Read More »విజయసాయి వాహనంపై దాడి ఘటనలో ఏ1గా చంద్రబాబు
రామతీర్థ పర్యటనలో విజయసాయిరెడ్డి వాహనంపై దాడి ఘటనలో A1గా చంద్రబాబు, A2గా అచ్చెన్నాయుడు, A3గా కళా వెంకట్రావు పేర్లను పోలీసులు చేర్చడం చర్చనీయాంశమైంది. దీంతోపాటు, ఈ ఘటనకు సంబంధించి మరో 12 మందిని ముద్దాయిలుగా పోలీసులు చేర్చారు. కాగా, బుధవారం నాడు కళా వెంకటరావును విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామతీర్థం పర్యటనలో విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పులు వేయించారనే.. అభియోగంపై …
Read More »రైతుల చర్చలు ఫెయిల్… ఇక మీ ఇష్టం అని తేల్చేసిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సదరు చట్టాల కారణంగా కార్పొరేట్ వ్యవసాయం పెరిగి.. రైతు మరిన్ని చిక్కుల్లో పడడం ఖాయమని, మరింతగా ఒత్తిడి పెరిగి.. రైతులు పూర్తిగా కార్పొరేట్ శక్తుల హస్తాల్లో చిక్కుకుపోతారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో పంటలకు మద్దతు ధరల విషయంలోనూ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా రైతులు ఆందోళన …
Read More »పవన్ మాట: నా అభిమానులు వైసీపీకి ఓటేశారు
‘‘పవన్ అన్న కోసం ప్రాణమిస్తాం. జగన్ అన్నకు ఓటేస్తాం’’.. సోషల్ మీడియాలో తెలుగు నెటిజన్ల చర్చల్లో తరచుగా కనిపించే స్లోగన్ ఇది. పవన్ను నటుడిగా ఎంతో అభిమానించే అతడి అభిమానుల్లో చాలా మంది అతడికి ఓట్లు వేయలేదని జనసేనకు వచ్చిన ఓట్లు, సీట్లను బట్టి స్పష్టంగా అర్థమైపోతుంటుంది. కారణాలు ఏమైనప్పటికీ.. పవన్ అభిమానులు ఎక్కువమంది గత ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం …
Read More »బాలయ్య ఆటలో అరటికాయ-కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని ఎవరినైనా టార్గెట్ చేశారంటే మోత మామూలుగా ఉండదు. అవతలున్నది ఎవరిని చూడకుండా తీవ్ర పదజాలంతో విమర్శిస్తారు. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ల పేరు ఎత్తితే ఆయనెలా మండిపోతారో తెలిసిందే. కొంత కాలంగా వాళ్లిద్దరిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పరుష పదజాలం కూడా వాడుతున్నారు. ఈ విమర్శలకు చంద్రబాబు, లోకేష్ పెద్దగా …
Read More »ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీయేనేనా ? దక్షిణాది మాటేమిటి ?
ఇఫ్పటికిప్పుడు లేదా ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ ఎన్డీయేనే ప్రభుత్వంలోకి వస్తుందని తాజా సర్వే తేల్చిచెప్పింది. మూడ్ ఆఫ్ ది నేషన్ అనే అంశంతో ఇండియా టు డే-కార్వీ సంస్ధల ఆధ్వర్యంలో జాతీయ స్ధాయిలో సర్వే జరిగింది. దేశసరిహద్దుల్లో చైనా, పాకిస్ధాన్ గొడవలు, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం, కరోనా వైరస్, అస్తవ్యస్ధ ఆర్ధిక విధానాల్లాంటి అనేక సమస్యల మధ్య మామూలుగా అయితే జనాలు కేంద్రంలోని ప్రభుత్వంపై వ్యతిరేకత చూపుతారు. …
Read More »ప్రధాని, సీఎంలకు టీకా రెడీ..ఎంతవరకు సురక్షితం ?
కరోనా వైరస్ విరుగుడుగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు తదితరులకు వ్యాక్సిన్ వేయటానికి ఏర్పాట్లు రెడీ అవుతున్నాయి. వ్యాక్సినేషన్ మొదటిదశలో కేవలం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాత్రమే టీకాలు వేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సుమారు 3 కోట్లమంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ను గుర్తించింది. ఈ 3 కోట్లమందిలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది, డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, ఆశావర్కర్లు, మున్సిపల్ హెల్త్ …
Read More »పవన్ పై పెరిగిపోతున్న ఒత్తిడి
తొందలో జరగబోతున్న లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసే విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. ఎట్టి పరిస్దితిలోను ఉపఎన్నికలో జనసేన అభ్యర్ధే పోటీకి దిగాలని, బీజేపీ అందుకు సహకరించాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. తిరుపతి లోక్ సభలో పోటీ విషయమై మద్దతిచ్చే షరతు మీదే గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులు ఎన్నికల నుండి తప్పుకున్నారన్న విషయాన్ని జనసేన నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఇవే …
Read More »ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అగ్రవర్ణాలలో అద్భుతమైన నైపుణ్యం ఉన్నవారు కూడా కేవలం రిజర్వేషన్లు లేవన్న కారణంతో అవకాశాలు కోల్పోతున్న వైనంపై నెటిజన్లు, కొందరు విద్యావేత్తలు, మేధావులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, ఆర్థిక ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలని మరికొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ గతంలో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అగ్రవర్ణాల్లోని …
Read More »కాబోయే సీఎంకు ముందస్తు అభినందనలంటే.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
ఆసక్తికర రాజకీయ సన్నివేశానికి సికింద్రాబాద్ వేదికైంది. ఒక కార్యక్రమంలో హాజరు కావటానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ప్రధాన ఆకర్షణగా మారారు. ఎందుకంటే.. ఆయన్ను కాబోయే ముఖ్యమంత్రిగా పలువురు కీర్తించటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. గతానికి భిన్నంగా.. ఎప్పుడూ లేని రీతిలో ఈసారి కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్లే.. టీఆర్ఎస్ నేతలు ఒకరికి మించి మరొకరు కేటీఆర్ …
Read More »ఒత్తిడికి కేంద్రం లొంగిపోయినట్లేనా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఏడాదిన్నర పాటు కొత్త వ్యవసాయచట్టాల అమలును నిలిపేసేందుకు సిద్ధమంటు కేంద్రం తాజాగా చేసిన ప్రతిపాదన తర్వాత రైతుసంఘాల ఒత్తిడి లొంగినట్లే అనిపిస్తోంది. కేంద్రం కొత్తగా రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు రైతుసంఘాలు ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కార్పొరేట్ సంస్ధల ప్రయోజనాల కోసమే కేంద్రం వ్యవసాయ చట్టాలను చేసిందన్నది రైతుసంఘాల ప్రధాన ఆరోపణ. రైతుల ఆరోపణలకు సరైన సమాధానం …
Read More »