ఏపీలో మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాలని అనుకున్నా.. అనివార్యమైన పరిస్థితులు జనసేనను మరోసారి ఒంటరిగానే ముందుకు నడిపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. మరి ఒంటరి పోరుతో జనసేనాని సాధించేది ఏంటి? ఎంత మేరకు పుంజుకుంటారు? ఇప్పటి వరకు పవన్‌ను సీఎం గా చూడాలని భావిస్తున్న కాపులు ఏమేరకు ఆయనకు రక్షణగా నిలుస్తారు? అనేది ఆసక్తిగా మారింది. ఒంటరి పోరుతో పవన్‌కు లభించే స్థానాలు 15-17 మాత్రమేనని అంటున్నారు పరిశీలకులు.
మరోవైపు.. పవన్ ఒంటరి పోరు మంచిదేనని అంటున్నారు మరికొందరు. ఎందుకంటే.. పవన్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఆయనే ఒంటరిగా పోటీ చేస్తే.. ఆయన ఇమేజ్ పెరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు పవన్‌పై ఎలాంటి బ్యాడ్ లేదు. ప్రజలకు సేవచేయాలన్న సంకల్పం ఉంది. ఇటీవల ఆయన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటున్నారు. ఇక, ప్రజలకు ఏర్పడుతున్న ఇబ్బందులపైనా.. ఆయన స్పందిస్తున్నారు. సో.. ఆయన పై ఇమేజ్ పెరిగేందుకు.. ఇది ప్రదాన అస్త్రాలుగా మారుతాయని చెబుతున్న వారు కూడా కనిపిస్తున్నారు.
ఇక, అదే సమయంలో కాపులు ఎంతమంది పవన్‌కు అండగా నిలుస్తారు? అనేది ప్రశ్నగా మారడం గమనార్హం. కాపుల్లోరెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి సీనియర్లు,రెండు జూనియర్లు. జూనియర్లు మాత్రమే పవన్‌ను ఫాలో అవుతున్నారు. సీనియర్ కాపు నాయకులు, వర్గాలు మాత్రం.. ఇంకా పవన్ విషయాన్ని పరిశీలిస్తున్నారు. కాపులకు సంబంధించి పవన్ ఇప్పటి వరకు ఎలాంటి హామీలు గుప్పించింది లేదు. వారు ప్రదానంగా డిమాండ్ చేస్తున్న రిజర్వేషన్‌ను ఇస్తానని కానీ, చేస్తానని కానీ ఆయన చెప్పడం లేదు. ఇక, కార్పొరేషన్ ప్రస్తుతం డీలా పడింది. దీని విషయంలోనూ ఆయన రియాక్ట్ కావడం లేదు.
కాబట్టి.. సీనియర్లు ఈ విషయాన్ని ప్రధానంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు ఎంత లేదన్నా.. ముద్రగడ పద్మనాభంప్రభావం ఉండనే ఉంది. ఆయన ఎటు వైపు మొగ్గుతారో కూడా సందేహమే. ఆయనను వలలోకి లాగేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుంటే.. పవన్ అసలు పట్టనట్టే వ్యవహరిస్తు న్నారు. సో.. గుండుగుత్తగా.. ఈ వర్గం పవన్ వెనుకే ఉంటుందని చెప్పేందుకు కూడా ఆస్కారం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. యువతరం విషయానికి వస్తే.. పవన్ వస్తుంటే పూనకాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీనిని ఓట్ల రూపంలోమలుచుకోవడం అంత ఈజీకాదని అంటున్నారు. ఈ పరిణామాలపై పవన్ దృష్టి పెడితే మంచిదేనని చెబుతున్నారు. ఎంత చేసినా.. 20 లోపు మాత్రమే ఆయనకు సీట్లు దక్కుతాయనే అంచనాలు వస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates