జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్మొహమాటంగా మాట్లాడతారు. నిజాల్ని నిర్భయంగా ఒప్పుకుంటారు. ఈమధ్య హైద్రాబాద్ లో సీఏ విద్యార్థులతో నిర్వహించిన సెమినార్ లో ” నేనో ఫెయిల్యూర్ పొలిటీషియన్ని” అనేశారు. ఆ తర్వాత విజయం కోసం పోరాడతాను అని దానికి కంటిన్యుటీ ఇచ్చారు కానీ.. అక్కడ “ఫెయిల్యూర్ పొలిటీషయన్” అనే పదమే హైలైట్ అయింది. ఇప్పుడే కాదు గతంలో కూడా పవన్ ఇలా నిజాయితీగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. “తన దగ్గర డబ్బు లేదనీ, సినిమాలు చేస్తే తప్ప బతలేననీ” చాలాసార్లు చెప్పారు. ఐతే అలా మాట్లాడటం వల్ల పవన్ నష్టపోతున్నారా.. ? లాభపడుతున్నారా..? అది తన రాజకీయ భవిష్యత్తుకు మంచిదా..? కాదా.. ? అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మళ్ళీ మొదలైంది.
మంచి నటుడిగా, మంచి మనిషిగా పవన్ కళ్యాణ్ ను అందరూ అభిమాని స్తారు. ఐతే.. పవన్ ను రాజకీయ నాయకుడిగా జనం అంగీకరిస్తారా..? అనే ప్రశ్నని ఎప్పటినుంచో విమర్శకులు సంధిస్తూనే ఉన్నారు. పవన్ కి సరిగా మాట్లాడటం రాదనీ, మాట మీద నిలకడ ఉండదనీ.. ఎప్పటికప్పుడు వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. ఐతే.. అలాంటి విమర్శలకు పవన్ ధీటైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లేదా తన ప్రవర్తనని మార్చుకోవాల్సి ఉంటుంది. జనం మధ్యకు వచ్చాక నేర్చుకోవాల్సినవీ, మార్చుకోవాల్సినవీ కొన్నుంటాయని రాజకీయ మేథావులు చెబుతున్నారు. రాజకీయాల్లో వ్యూహరచన ముఖ్యం. ఏం మాట్లాడినా, ఏం చేసినా అది వ్యూహంలో భాగంగానే ఉండాలి. కానీ పవన్ అలాంటి రకం కాదు. మనసుకి ఏం అనిపిస్తే అది మాట్లాడేస్తారు. దాని వల్ల రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని పొలిటికల్ ఎనలిస్టు లు చెబుతున్నారు. అంతేకాదు.. పవన్ ప్రత్యర్థులకు తనని విమర్శించటా నికి తానే ఆయుధాలు ఇచ్చినట్లు అవుతుందని కూడా అంటున్నారు. వ్యక్తిగత లోపాల్ని, మనసులో మాటల్నీ బైటపెట్టకపోవటమే మంచిదని సూచిస్తున్నారు.
పవన్ ప్రసంగాల్లో ఎక్కువగా స్వాత్కర్ష ఉంటుందన్న విమర్శ కూడా లేకపోలేదు. ప్రజా సమస్యలకీ, తన సినిమాలకీ ముడిపెట్టి మాట్లాడతారనీ, దానివల్ల సీరియస్ నెస్ పోతుందని చాలామంది అభిప్రాయపడుతున్నా రు. తానో సాధారణ కానిస్టేబుల్ కొడుకుననీ, తనది మధ్యతరగతి కుటుంబమనీ పవన్ అనేక సార్లు చెప్పుకొచ్చారు. ఐతే.. అది గతానికి సంబంధించిన విషయమనీ, ఇప్పుడు పరిస్థితి వేరు కదా అని.. కూడా పవన్ ప్రత్యర్థులు నెగిటివ్ ప్రచారం చేశారు. తరచూ ఇలా మాట్లాడటం వల్ల పవన్ మైలేజ్ పడిపోతుందని విశ్లేషించినవారూ ఉన్నారు. ఐతే ఇప్పటికీ పవన్ ధోరణిలో మాత్రం పెద్దగా మర్పు కనిపించదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates