ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన టీడీపీలో జోష్ నింపుతోందా? పార్టీకి పునరుత్తేజం తెచ్చిం దా? అంటే..ఔననే అంటున్నారు పరిశీలకులు. పశ్చిమ గోదావరి జిల్లాలోని విజయరాయి ప్రాంతంలో చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రయత్నించారు. రోడ్ షోలు, సభల ద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావించారు.
అదేసమయలో మహిళలతో ప్రత్యేకంగా ముఖాముఖికార్యక్రమాలు, యువతతో భేటీలు, కీలక నేతలతో సమావేశాలు సైతం నిర్వహించారు. మొత్తంగా చూస్తే.. ఇప్పటి వరకు అంతో ఇంతో వెనుకబడిన తమ్ము ళ్లు సైతం చంద్రబాబు సభలతో కొంత మేరకు పుంజుకున్నారనే చెప్పాలి. జనాలను తరలించడంలో నూ.. పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలోనూ విజయం సాధించారు. అయితే.. నియోజకవర్గాల స్థాయిలో పార్టీ పరిస్థితి ఏంటి? అనేది కూడా ప్రశ్న.
చంద్రబాబు పర్యటించిన నియోజకవర్గాల్లో కొత్త జోష్ కనిపించిందనేచెప్పాలి. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నుంచి చాలా మంది నాయకులు ఉత్సాహంగా జనాలను తరలించారు. తమ తమ సమస్యలు చెప్పుకొనేలా ప్రజలను చంద్రబాబుకు చేరువ చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. ఇక, ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజలను గుర్తించి చంద్రబాబు నిర్వహించిన సభలకు తీసుకురావడంలోనూ సక్సెస్ అయ్యారు.
మొత్తంగా చూస్తే చంద్రబాబు నిర్వహించిన సభలు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. అదేవిధంగా వైసీపీపై చంద్రబాబు కామెంట్లు చేసిన ప్రతిసారీ కూడా.. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నినాదం ప్రజల్లోకి బాగానే చేరింది. అనేక విషయాలను ప్రస్తావించిన చంద్రబాబు.. ఈ సందర్భంగా ప్రజలతోనే ఇదేం ఖర్మ అనిపించడం గమనార్హం. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఈ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్.. ఖచ్చితంగా టీడీపీలో మార్పు ఖాయమనే సంకేతాలు ఇచ్చిందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates