ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావించిన రాయలసీమ గర్జన సభ సక్సెస్ అయిందా.. ఫెయిల్ అయిందా.. అనే విషయాలను పక్కన పెడితే.. దీనిలో కొన్ని ఆసక్తికర పరిణామాలు అందునా వైసీపీ నేతలకు తల బొప్పికట్టే సంగతులు చోటు చేసుకున్నాయి. దీంతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. భారీ ఎత్తున సభకు జనాలను తరలించినా వైసీపీ నేతలకు మనశ్శాంతి లేకుండా పోయింది. పాపం.. ఎన్నో సొమ్ములు ఖర్చు చేసి.. ప్రజలను ఈ సభకు తరలించారు.
కానీ, చివరకు సభకు వచ్చేసరికి జై జగన్.. జైజై జగన్.. జై వైసీపీ అని అనమని ముందుగానే క్లాస్ చెప్పినా.. ఎక్కడో తేడా కొట్టింది. సభలో జై బాబు, జై బాలయ్య, జై పవన్ కల్యాణ్ అంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు. విద్యార్థుల నినాదాలు ఆపేందుకు వైసీపీ నేతలు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఒక దశలో వారిని నిలువరించేందుకు శత విధాల ప్రయత్నించారు. పోలీసులు కూడా విద్యార్థులను నిలువరించే ప్రయత్నం చేసినా.. ఆగితేనా? విద్యార్థులు కదా.. ఉడుకు రక్తం అలానే చేస్తుందని సరిపెట్టుకునే పరిస్తితి వచ్చింది.
విద్యార్థులు రాయలసీమ జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో గర్జన సభకు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు ఫ్లెక్సీలతో సభకు వెళుతూ జై బాబు, జై బాలయ్య, జై పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టి గర్జన సభలో రామలసీమ నినాదాలు చేయాలని వైసీపీ నేతలు సూచించిన నేపథ్యంలో విద్యార్థులు టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేయడంతో సభ మొత్తం రసాబాసగా మారింది. పైన వేదికపై నాయకులు జై వైసీపీ అంటే.. కిందనున్న విద్యార్థులు మాత్రం జై టీడీపీ నినాదాలతో హోరెత్తించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates