Political News

ప్లేట్ మార్చిన రాయ‌పాటి.. వ్యూహం ఫ‌లించేనా?

రాజ‌కీయ దురంధ‌రుడు.. దేశ‌రాజ‌కీయాల్లో దాదాపు మూడు త‌రాల‌ను చూసిన నేత‌.. గుంటూరుకు చెందిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు. పారిశ్రామిక వేత్త నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. ఇందిర‌, రాజీవ్‌, సోనియాల ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్‌లో ప‌నిచేసిన రాయ‌పాటి.. సుదీర్ఘ కాలం పార్లమెంటు స‌భ్యుడిగా కొన‌సాగారు. ఇందిర‌మ్మ స‌హా సోనియా వ‌ద్ద నుంచి అడ‌గ‌గానే అప్పాయింట్‌మెంట్ తెచ్చుకోగ‌లిగిన నాయ‌కుడిగా రాయ‌పాటికి పేరుంది. అలాంటి నాయ‌కుడు.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబును త‌న దారిలోకి తెచ్చుకునేందుకు ఆప‌శోపాలు …

Read More »

కన్నా లక్ష్మీనారాయణకు అదృష్టం పట్టనుందా?

ఏపీ బీజేపీలో విధి వంచితుడు ఎవరైనా ఉన్నారంటే అది కన్నా లక్ష్మీనారయణే అని చెప్పాలి. గతంలో కానీ, ఇప్పుడు కానీ చాలామంది తాము పార్టీ కోసం చేసిన కంటే ఎక్కువే పదవుల రూపంలో ప్రయోజనం పొందినవారున్నారు. కానీ.. కన్నా పరిస్థితి వేరు. కాంగ్రెస్ కుప్పకూలిన తరువాత బీజేపీలోకి వచ్చిన ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి రూపంలో మంచి పదవే వరించింది. కానీ.. ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది ఆయనకు. రాజ్యసభ …

Read More »

లోకేశ్ జోరు.. వైసీపీ కంగారు

టీడీపీ యువ నేత నారా లోకేశ్ ఒక్కసారిగా జోరు పెంచడంతో వైసీపీలో కంగారు మొదలైంది. ఆ పార్టీలో నంబర్ 2గా చెప్పుకొనే విజయసాయిరెడ్డి చేస్తున్న వరుస ట్వీట్లు, ఫేస్ బుక్ పోస్టులు చూస్తుంటే వైసీపీ ఏ స్థాయిలో కంగారుపడుతోందో అర్థమవుతోంది. వరదలో చిక్కుకున్న ప్రాంతాలను వైసీపీ నేతలు ఎంతవరకు సందర్శించారో ఏమో కానీ లోకేశ్ మాత్రం వరద బాధిత ప్రాంతాల్లో తెగ తిరుగుతున్నారు. నడుం లోతు నీళ్లలో దిగి మరీ …

Read More »

ఏపీ బీజేపీ నేతలపై అధిష్ఠానం నిఘా

ఏపీ బీజేపీ నేతలు అక్కడి పాలక పక్షం వైసీపీతో అంటకాగుతున్నారన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. రాజకీయంగా పాలక పక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండూ కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా మైలేజ్ పెంచుకోవడానికి పాలక పక్షాన్ని టార్గెట్ చేస్తుంది. కానీ, ఏపీలో మాత్రం పాలకపక్షం వైసీపీతో సమానంగా బీజేపీ కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని టార్గెట్ చేస్తోంది. ప్రభుత్వపు తప్పొప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్లడం మానేసి ప్రెస్ మీట్లు …

Read More »

టీడీపీకి మాజీ మంత్రి సుజాత గుడ్‌బై?!

పుంజుకోవాల‌ని ఆశిస్తున్న టీడీపీకి ప్ర‌తిఘ‌ట‌న‌లు ఎదుర‌వుతున్నాయి. త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్క‌లేద‌నో.. లేక పార్టీ అధిష్టానం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నో .. కార‌ణాల‌తో నాయ‌కులు దూర‌మ‌వుతున్నారు. తాజాగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి పీత‌ల సుజాత పార్టీ మారుతున్నార‌నే స‌మాచారం గుప్పుమంది! పార్టీకి అంకిత భావంతో సేవ‌లు అందించిన సుజాత‌.. ఇప్పుడు మ‌నోవేద‌నతో ఉన్నారు. పోనీ.. త‌న ఆవేద‌న‌ను పార్టీ …

Read More »

జగన్ నుంచి ఈ ట్విస్ట్ ఊహించలేదు

మందుబాబులకు ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. ఇది ఒక వెరైటీ షాకు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి నిర్ణయం. అదేమిటంటే పొరుగు రాష్ట్రాల నుండి మూడు సీసాలు తెచ్చుకోవచ్చనే నిబంధనను రద్దు చేస్తు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మందుబాబులు ఎప్పుడూ చూడని కొత్త కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. నిజానికి అవన్నీ చాలా చవకబారు మద్యంగా జనాల్లో …

Read More »

డ్రాగన్ దూకుడుకు భారత్ ‘బెకా’ తో చెక్ పెట్టగలదా ?

సరిహద్దుల్లో ప్రతిరోజు ఉద్రిక్తతలను సృష్టిస్తున్న డ్రాగన్ దేశం చర్యలకు చెక్ పెట్టడానికి మనదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లోనే కాకుండా రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక రంగంలో అసవరమైన అన్నీ ఒప్పందాలను అగ్రరాజ్యం అమెరికాతో చేసుకుంటోంది. ఈ ఒప్పందాల వల్ల సరిహద్దుల్లో ఇటు చైనా అటు పాకిస్ధాన్ దేశాల సైన్యాల కదలికలను ఎప్పటికప్పుడు తెలిసిపోయే అవకాశాలున్నాయి. శాటిలైట్ ద్వారా వీడియోలు, ఫొటోలు, మ్యాపులు చివరకు సైన్యాల కదలికలను కూడా మనం తెలుసుకునే …

Read More »

పాయల్ ఘోష్.. పొలిటికల్ ఎంట్రీ

తెలుగులో ఇంతకుముందు ప్రయాణం, ఊసరవెల్లి లాంటి సినిమాల్లో నటించిన ముంబయి భామ పాయల్ ఘోష్ ఈ మధ్య కాలంలో ఏమీ సినిమాలు చేసినట్లు లేదు కానీ.. వార్తల్లో మాత్రం బాగానే నిలుస్తోంది. ముఖ్యంగా గత నెలలో బాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన అనురాగ్ కశ్యప్ మీద ఆమె చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ ఆరోపణల్లో భాగంగా రిచా చద్దా సహా ఒకరిద్దరు హీరోయిన్లను తక్కువ చేసి …

Read More »

నారా లోకేష్ పై కేసా ?

తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, అత్తిలి, చినపరిమి మండలాల్లో లోకేష్ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించటం, రైతులతో మాట్లాడటం కోసం పర్యటించిన లోకేష్ తో పాటు ఎంఎల్ఏలు రామానాయుడు, శివరామరాజు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు ఎంఎల్ఏతో కలిసి ఆకివీడులో నుండి సాద్ధాపురంకు లోకేష్ ట్రాక్టర్లో బయలుదేరారు. ట్రాక్టర్లో ఎంఎల్ఏలే కాకుండా …

Read More »

ఇద్దరిలో తిరుపతి టికెట్ ఎవరికి దక్కుతుందో ?

తొందరలో జరగబోయే తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో బీజేపీ తరపున పోటి చేసే అవకాశం ఎవరికి దక్కుతుందో అనే చర్చ జోరందుకుంటోంది. నిజానికి ఇప్పటికైతే బీజేపీలో ఆసక్తి చూపుతున్న గట్టి అభ్యర్ధి ఒకరే ఉన్నారు. కాకపోతే తొందరలోనే పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేత కూడా టికెట్ పై కన్నేసినట్లు సమాచారం. దాంతో పోటీ చేయటం కోసమే సదరు నేత తొందరలో కమలం కండువా కప్పుకుంటారని పార్టీలోనే ప్రచారం పెరిగిపోతోంది. కాబట్టి …

Read More »

సొంత నియోజ‌క‌వ‌ర్గంలో.. సాకేకు స‌వాల్..

ఏ పార్టీకైయినా..ఆ పార్టీని లీడ్ చేస్తున్న నేత విష‌యంలో ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. పార్టీని న‌డిపిస్తున్న వారి నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా దృష్టి ఉంటుంది. స‌ద‌రు నేత పార్టీని న‌డిపించ‌డ‌మే కాదు.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తాను ఎలా ఉన్నార‌నే విష‌యాన్ని కూడా ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిశీలిస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో కాంగ్రెస్ ఏపీ అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ ఒక‌రు. టీడీపీఅధినేత చంద్ర‌బాబు త‌న నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ట్టు కొన‌సాగిస్తున్నారు. వ‌రుస విజ‌యాల‌తో …

Read More »

వైసీపీలో .. ఎవ‌రి గోల వారిదే!!

అధికార వైసీపీలో ఎవ‌రి గోల వారిదేనా? అధినేత జ‌గ‌న్ ఒక‌దారిలో వెళ్తుంటే.. మంత్రులు మ‌రో దారిలో వెళ్తున్నారా? స్థానికంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకో దారిలో న‌డుస్తున్నారా? అంటే.. ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో వైసీపీలో ఎవ‌రి గోల వారిదే అన్న మాట వినిపిస్తోంది. ఎవ‌రిని ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ విష‌యాన్ని తీసుకుంటే.. త‌న‌పై ఉన్న అక్ర‌మాస్తుల కేసుల విచార‌ణ ప్రారంభ‌మైంది. వీటి …

Read More »