Political News

సెలబ్రిటీలను తిరస్కరించినట్లేనా ?

తాజాగా జరిగిన ఎన్నికల్లో సినీ సెలబ్రిటీలను జనాలు తిరస్కరించినట్లేనా ? వెల్లడైన ఫలితాలను బట్టిచూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బెంగాల్, అస్సాం రాష్ట్రాల సంగతేమో గానీ ధక్షిణాదిలో మాత్రం ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. తమిళనాడు, కేరళలో అనేక పార్టీల తరపున పలువురు సెలబ్రిటీలు పోటీ చేశారు. అయితే వాళ్ళలో అత్యధికులు ఓడిపోయారు. తమిళనాడు విషయం చూస్తే కమలహాసన్, శరత్ కుమార్, ఖుష్బూ, విజయకాంత్ లాంటి వాళ్ళు చాలామందే పోటీచేశారు. అయితే …

Read More »

అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టేసిన పవార్

పశ్చిమ బెంగాల్లో బీజేపీని ఓడించి మమత బెనర్జీ సాధించిన అఖండ విజయం ప్రతిపక్షాల్లో ఆశలు రేకెత్తిస్తున్నట్లే ఉంది. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని శరద్ పవార్ అభిప్రాయపడుతున్నారు. 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోడి నాయకత్వంలోని ఎన్డీయేని ఢీకొనేందుకు బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటు దిశగా పవార్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లే ఉంది. ఎన్సీపీ జాతీయ అధికారప్రతినిధి నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయేకి …

Read More »

ఇదే పని 2 వారాల క్రితం చేసి ఉంటే ఎంత బాగుండేది జగన్?

అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు నిర్ణయాల్ని ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. అందునా కీలకమైన విషయాల్లో వారు వాయు వేగంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా లాంటి మహమ్మారికి చెక్ పెట్టటం అంత తేలికైన విషయం కాదు.. అమెరికా.. యూరప్ లాంటి అత్యున్నత సాంకేతికత అందుబాటులో ఉన్న దేశాల్లోనే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురావటానికి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అయినప్పటికి భారీ ఎత్తున మరణాలు తప్పలేదు. …

Read More »

నాడు జ‌గ‌న‌న్న జై.. నేడు.. నై..!

రాష్ట్రంలో ఉద్యోగుల వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన ఉద్యోగ సంఘాల నాయ‌కులు.. ఇప్పుడు అదే అధికార పార్టీని ఎదిరించ‌లేక‌.. ఉద్యోగుల నుంచి వ‌స్తున్న ఒత్తిళ్లు త‌ట్టుకోలేక‌.. తీవ్ర సంక‌ట స్థితిని ఎదుర్కొంటున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఇచ్చిన స‌పోర్టు క‌న్నా.. ప్ర‌స్తుత జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఉద్యోగ సంఘాలు భారీ ఎత్తున సపోర్టు చేస్తున్నారు. జ‌గ‌న్ వెంటే …

Read More »

ఈ కరోనా విలయానికి కారణం కర్నూలా?

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో కల్లోలం రేపుతోందో తెలిసిందే. గత ఏడాది ఫస్ట్ వేవ్ వచ్చినపుడు ఒక రోజుకు గరిష్ట కేసుల సంఖ్య లక్షకు, మరణాల సంఖ్య వెయ్యికి చేరితేనే వామ్మో వాయ్యో అనుకున్నాం. అలాంటిది ఇప్పుడు రోజుకు 4 లక్షల దాకా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు 3-4 వేల మధ్య ఉంటున్నాయి. ఇవి అధికారికంగా చెబుతున్న లెక్కలు. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉన్నా …

Read More »

ఆ ఏపీ మంత్రి చాలా కూల‌ట‌.. !

‘ఆ మంత్రి చాలా కూల్‌… చాలా ఇంప్రెసివ్‌’- ఇదీ ఇప్పుడు వైసీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. జ‌గ‌న్ కేబినెట్లో ఎంతో మంది మంత్రులు ఉన్నా కూడా ఈ మాటే ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ఎందుకు హైలెట్ అవుతోంది ? అన్న విష‌యం ఆస‌క్తిగా మారింది. ముఖ్య మంత్రి జ‌గ‌న్ సొంత జిల్లాకు చెందిన క‌డ‌ప ఎమ్మెల్యే మంత్రి అంజాద్ బాషా గురించి ముఖ్య‌మంత్రి జ‌గ‌నే ఈ కామెంట్లు చేసిన‌ట్టు స‌మాచారం. దీనికి …

Read More »

మూడు వర్గాలే బీజేపీని దెబ్బకొట్టాయా?

ఇటీవలే వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఓ విషయం స్పష్టమైంది. మూడు పెద్ద రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళలోని మూడువర్గాలు బీజేపీని గట్టిగా దెబ్బకొట్టినట్లు అర్ధమవుతోంది. ముస్లిం మైనారిటిలు, క్రిస్తియన్ మైనారిటిలతో పాటు మహిళలు కూడా కమలం పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ఓట్లేసినట్లు సమాచారం. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో మోడి, అమిత్ షా, నడ్డా అండ్ కో బాగా కష్టపడినప్పటికీ ఆ పడిన కష్టానికి ఫలితం కనబడలేదు. నిజానికి …

Read More »

స‌బ్బంకు కాలం క‌లిసి రాలేదు… బ్యాడ్ ల‌క్ అంతే?

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క నేత శ‌కం ముగిసింది. విశాఖ జిల్లాకు చెందిన గ్రేట‌ర్ విశాఖ మేయ‌ర్‌, మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో స‌బ్బం హ‌రిది విల‌క్ష‌ణ‌మైన శైలీ. ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తారు. కాంగ్రెస్‌లో రాజ‌కీయాలు ప్రారంభించిన ఆయ‌న.. ఆయ‌న ప‌డిన క‌ష్టానికి త‌గిన ఫ‌లితం అయితే పొంద‌లేక‌పోయారన్న‌ది నిజం. అతి సామాన్య‌మైన కుటుంబం నుంచి ఆయ‌న వ‌చ్చారు. భీమిలి …

Read More »

నందిగ్రామ్ లో పోటీవెనుక ప్రధాన కారణం ఇదేనా ?

తాజాగా పశ్చిమబెంగాల్లో జరిగిన ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా మమతాబెనర్జీ తీసుకున్న నిర్ణయమే పార్టీ గెలుపుకు కారణం అయ్యిందా ? క్షేత్రస్ధాయిలో జరిగిన విషయాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. సంవత్సతరాలుగా పోటీచేస్తున్న భవానీపూర్ నియోజకవర్గాన్ని కాదని మమత నందిగ్రామ్ లో నామినేషన్ వేశారు. నందిగ్రామ్ లో పోటీ చేయటమంటే చాలా పెద్ద సాహసం చేయటమన్న విషయం దీదీకి బాగా తెలుసు. అయినా సాహసం చేశారు కాబట్టే విజయం సిద్ధించింది. ఇంతకీ …

Read More »

సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు కోల్పోయిన మోడీ.. ఏం జ‌రిగిందంటే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప్ర‌భ మ‌స‌క బారుతోంద‌నేందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.. మ‌రొక‌టి చోటు చేసుకుంది. బెంగాల్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల్లో బీజేపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. మోడీపై అనేక విమ‌ర్శ లు వ‌చ్చాయి. అయితే.. దానిపై నోరు మెద‌ప‌ని .. బీజేపీ నాయ‌కుల‌కు ఇప్పుడు మ‌రో పెద్ద షాక్ త‌గిలింది. ఏకంగా ప్ర‌ధాని మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న యూపీలోని వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలోను, అదే సమయంలో బీజేపీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న …

Read More »

వీళ్ళ ముగ్గురు సంథింగ్ స్పెషలే

అవును తాజా ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించిన ముగ్గురని  సంథింగ్   స్పెషల్ అనే చెప్పాలి. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, పినరయి విజయన్, మమతాబెనర్జీ. ఇపుడు సాధించిన ముగ్గురికి ఈ విజయాలు చాలా అపూర్వమనే చెప్పాలి. అందుకనే 1,2,3 అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు వీళ్ళగురించి.  ఇంతకీ విషయం ఏమిటంటే తమిళనాడులో అధికారంలోకి వచ్చిన డీఎంకే చీఫ్ స్టాలిన్ మొదటిసారి …

Read More »

రివర్సు కొట్టిన బీజేపీ బ్రహ్మాస్త్రం

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ బ్రహ్మాస్త్రం రివర్సుకొట్టింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రధానంగా బయటకుతీసేది హిందుత్వ అంశాన్నే. గెలుపు అవకాశాలు ఉన్నాయని అనుకున్న ప్రతి ఎన్నికలోను హిందుత్వఅంశాన్నే అస్త్రంగా ప్రత్యర్ధులపైకి ప్రయోగిస్తుంటుంది. ఇందులో భాగంగానే బెంగాల్ ఎన్నికల్లో కూడా పదే పదే హిందుత్వ కార్డును నరేంద్రమోడి, అమిత్, జేపే నడ్డా అండ్ కో మమతాబెనర్జీ పైకి ప్రయోగించింది. అయితే ఫలితాల తర్వాత చూస్తే ఆ అస్త్రం అట్టర్ ఫ్లాప్ అయినట్లు …

Read More »