ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు, మరణాలు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్లు కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు రోజుకు 10 వేలకు పైనే నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే.. రాష్ట్రంలో 23 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 84 మంది మృతి చెందారు. ఇది వాస్తవానికి అధికారిక లెక్క. కానీ, అనధికారికంగా మరింత మంది …
Read More »బ్రేకింగ్: మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత
ఏపీలో విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు.. రాజకీయ విశ్లేషకుడు.. సబ్బం హరి కన్నుమూశారు.. గడిచిన 15 రోజులుగా ఆయన కరోనాతో పోరాడుతున్నారు. కరోనా సోకడంతో ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, నాలుగు రోజుల కిందటే ఆయన ఆరోగ్యం విషమించిందనే వార్తలు వచ్చాయి. అయితే.. మరింత మెరుగైన వైద్యం అందించడంతో అప్పట్లో కోలుకున్నారు. కానీ, తాజాగా 24 గంటలుగా మళ్లీ ఆయన …
Read More »అప్పుడు ఓడి.. ఇప్పుడు గెలిచి.. బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఇక, పుంజుకునేది లేదని.. పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని భావిస్తున్న కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. అది కూడా గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన కార్పొరేటర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పుంజుకుంది. లింగోజీ గూడ కార్పొరేటర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా కాంగ్రెస్ విజయం దక్కించుకుంది. వాస్తవానికి గత రెండు నెలల కిందట జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ …
Read More »టీడీపీ పరిస్ధితేమిటి ?
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత ఓ విషయం అర్ధమైపోయింది. అదేమిటంటే టీడీపీ ఓటింగ్ పెద్దగా చెక్కు చెదరలేదని. నిజానికి ఎన్నికలకు ముందే వైసీపీ విజయం ఖాయమైపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని నిలువెల్లా వ్యతిరేకిస్తున్న కారణంగా తిరుపతి ఉపఎన్నికలో పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా చంద్రబాబునాయుడు రంగంలోకి దించారు. ఇక్కడ టీడీపీలో ఓ సమస్య కొట్టొచ్చినట్లు కనబడింది. అదేమిటంటే ఎలాగూ ఓడిపోయే సీటే కాబట్టి …
Read More »బిగ్ బ్రేకింగ్: ఈటలపై మరో కేసు
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్పై సీఎం కేసీఆర్ మరో అస్త్రం ప్రయోగించారు. ఇప్పటికే ఆయన తన హ్యాచరీస్ కోసం తమ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారన్న రైతుల ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కేసీఆర్ అదికారులను పంపించి క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకున్నారు. ఈలోగానే.. ఆయననుంచి ముందు వైద్య, ఆరోగ్య శాఖను లాగేసుకున్న కేసీఆర్.. 24 గంటల్లో ఆయను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామమే రాష్ట్ర …
Read More »కేసీఆర్ కు శుభాకాంక్షలు చెబుతూనే ట్విస్టు ఇచ్చిన షర్మిల
రాజకీయాల రూపురేఖలు మారిపోయాయి. సందర్భం ఏదైనా సరే.. ఏదో ఒక ట్విస్టు ఇవ్వకపోతే మనసు అస్సలు ఊరుకోని పరిస్థితి. ప్రత్యేక సందర్భాల్లో తెలిపే శుభాకాంక్షల్లోనూ ఏదో ఒక ట్విస్టు ఇవ్వటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. మిగిలిన సమయాల్లో రాజకీయాన్ని చేసే నేతలు.. ప్రత్యేక సందర్భాల్లోనూ అదే తీరును ప్రదర్శించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు నిదర్శనంగా వైఎస్ షర్మిల ఉదంతాన్ని చెప్పాలి. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల …
Read More »ఏపీ మరో మహారాష్ట్రగా మారనుంది.. అలెర్టు అవ్వండి జగన్
తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఘన విజయాన్ని సాధించారు. భారీ మెజార్టీతో ప్రత్యర్థి పార్టీలకు అందనంత ఎక్కువ ఓట్లను ఆయన సాధించారు. ఈ క్రెడిట్ మొత్తం పార్టీ అధినేత.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనే వేయాలి. ఈ ఆనంద సమయంలో మరో చేదు వార్త సాయంత్రానికి వెలువడింది. ఏపీలో కరోనా కేసులు కొంతకాలంగా భారీ ఎత్తున నమోదవుతున్నాయి. గత రికార్డుల్ని బద్ధలు కొట్టేలా …
Read More »బీజేపీ అతే జనాలకు నచ్చలేదా ?
క్షేత్రస్ధాయిలో జరిగింది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి పశ్చిమబెంగాల్లో మమతబెనర్జీ పై బీజేపీ నుండి చాలా మంది పదే పదే దాడులు చేశారు. నరేంద్రమోడి నాయకత్వంలో అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపిలు ఇలా అనేకమంది ఒకటికి పదిసార్లు పదే పదే మమతపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతునే ఉన్నారు. మమతపై దాడులతో విరుచుకుపడిన మోడి అండ్ కో మరచిపోయిందేమంటే దీదీని తాము …
Read More »సంపూర్ణ ఆధిక్యత సాధించిన వైసీపీ
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైసీపీ సంపూర్ణ ఆధిక్యత సాధించింది. లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను వైసీపీకి మంచి మెజారిటిలే వచ్చాయి. 2019 ఎన్నికలో మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటి సాధించినా తిరుపతి అసెంబ్లీలో మైనస్ ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. అలాంటిది ఏడుకు ఏడు అసెంబ్లీల్లోను కంఫర్టబుల్ మెజారిటి సాధించిన కారణంగానే వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తికి రికార్డుస్ధాయిలో 2.71 లక్షల ఓట్ల …
Read More »పేలుతున్న వర్మ ట్వీట్లు
రామ్ గోపాల్ వర్మను జనాలు సీరియస్గా తీసుకోవడం ఎప్పుడో మానేశారు కానీ.. ఆయన తన మార్కు సిల్లీ ట్వీట్లకు తోడు అప్పుడప్పుడూ కొన్ని పేలిపోయే ట్వీట్లు కూడా వేస్తుంటారు. రాజకీయాల్లో ఎక్కువగా బలహీనంగా ఉన్న పార్టీలనే టార్గెట్ చేయడం అలవాటైన వర్మ.. అప్పుడప్పుడూ మాత్రం ధైర్యం తెచ్చుకుని బలవంతులను లక్ష్యంగా చేసుకుంటూ ఉంటారు. వర్మ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేయడం విశేషమే. దేశంలో కరోనాను అదుపు చేయడంలో …
Read More »ఇలా అయ్యిందేంటి కమల్ సార్?
ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. నూతన రాజకీయాన్ని ఆవిష్కరిస్తానంటూ వచ్చిన మరో ప్రముఖ నటుడికి ఎన్నికల రణరంగంలో చేదు అనుభవం ఎదురైంది. జయలలిత ఉన్నంత వరకు రాజకీయాలు తనకు పడవన్నట్లు మాట్లాడి.. ఆమె మరణానంతరం ఏర్పడ్డ రాజకీయ శూన్యతను భర్తీ చేయొచ్చనే ఆశతో మూడేళ్ల ముందు మక్కల్ నీదిమయం పార్టీ పెట్టి లౌకిక వాదాన్ని గట్టిగా వినిపిస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్న తమిళ లెజెండరీ నటుడు కమల్ హాసన్.. తాను పోటీ …
Read More »పీకే పాత ట్వీట్ వైరల్
ఆదివారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అలాగే తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలూ వెల్లడయ్యాయి. ఐతే దేశవ్యాప్తంగా ఎక్కువ చర్చనీయాంశమైంది, అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలే. ఎందుకంటే తమిళనాట, కేరళలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందే ఒక అంచనా వచ్చేసింది. అస్సాం, పుదుచ్చేరి చిన్న రాష్ట్రాలు కాబట్టి అంత ఆసక్తి లేదు. ఏడాది కిందట్నుంచే దేశం దృష్టిని ఆకర్షిస్తూ.. దేశ రాజకీయాలనే …
Read More »