Political News

ఏపీ బీజేపీకి బాబే సీఎం.. టీడీపీనే అధికార పార్టీ..!

రాష్ట్ర బీజేపీలో ఒక విధానం అంటూ లేద‌నే కామెంట్లు త‌ర‌చుగా వినిపిస్తుంటాయి. ముఖ్యంగా సోము వీర్రాజు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. పార్టీ ప‌రిస్థితి మ‌రింత అధ్వానంగా మారిపోయింది. ఆయ‌న ఎవ‌రిని టార్గెట్ చేస్తారో.. ఎలాంటి రాజ‌కీయాలు చేస్తారో.. ఎవ‌రిని తొక్కేస్తారో.. ఎవ‌రికి అవ‌కాశం ఇస్తారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఏపీలో బీజేపీ తీవ్రంగా న‌ష్ట‌పోతోంద‌ని ఆ పార్టీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ.. …

Read More »

కమల్‌కు మరో మార్గం లేదా?

జయలలిత బతికి ఉండగా కమల్ హాసన్‌ను రాజకీయ రంగప్రవేశం గురించి అడిగితే తనకు ఆసక్తి లేదన్నట్లు మాట్లాడాడు. తన లాంటి వాడికి రాజకీయాలు పడవని తేల్చేశాడు. కానీ జయ మరణానంతరం ఆయన ఆలోచనలు మారిపోయాయి. కరుణానిధి కూడా మంచం పట్టడం, ఎన్నో రోజులు బతికే అవకాశం లేదని తేలిపోవడంతో తమిళనాట నెలకొనబోయే రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి మంచి అవకాశం దొరికిందనుకున్నాడు. వెంటనే రాజకీయ పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం …

Read More »

మోడీ చెప్పలేదు కానీ.. పది రాష్ట్రాలు మినహా

భారత్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిందే అని నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. అన్ని వైపుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఈ దిశగా సూచనలు అందుతున్నాయి. ఐతే గత ఏడాది లాక్ డౌన్ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తినడం.. ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడటంతో మళ్లీ ఇప్పుడు మరోసారి దేశవ్యాప్త లాక్ డౌన్ విధించే పరిస్థితుల్లో కేంద్రం లేదు. కరోనా విలయం …

Read More »

నిన్న బాబు.. నేడు చిన్న‌బాబు.. క్రిమిన‌ల్ కేసులు

మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్‌పై డి.హీరేహల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పై ట్విటర్‌లో ఆరోపణలు చేసిన నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ ఎస్టీ సెల్‌ నేత భోజరాజు నాయక్‌ ఫిర్యాదు చేశారు. వివరాలు… టీడీపీ కార్యకర్త మారుతిపై కర్ణాటకలో కొంద‌రు వ్యక్తులు దాడి చేశారు. అయితే, దీని వెనుక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నారంటూ.. నారా లోకేశ్‌ సోషల్‌ మీడియాలో కామెంట్లు …

Read More »

సీఎం జ‌గ‌న్‌కు జార్ఖండ్ సీఎం అధిరిపోయే రెస్పాన్స్‌..

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విష‌యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. ఏపీ సీఎం జ‌గ‌న్‌.. చేసిన వ్యాఖ్య‌లు దుమారం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌ధాన మంత్రి మోడీ కేంద్రంగా.. ముఖ్య‌మంత్రుల మ‌ధ్య పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం హీటెక్కింది. క‌రోనా ప‌రిస్థితుల‌పై రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో చ‌ర్చించిన ప్ర‌ధానిపై హేమంత్ సొరేన్‌.. సీరియ‌స్ అయ్యారు. “మా మాట వినిపించుకోండి సార్‌.. మీ మ‌న‌సులో మాట చెప్ప‌డం కాదు!” అని ట్వీట్ …

Read More »

జగన్ కు ఎవరు సలహాలిస్తున్నారో ?

జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహాలిస్తున్నారో తెలీటంలేదు. ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం గడచిన రెండేళ్ళల్లో అనేక కేసులు నమోదుచేసింది. అయితే ఇందులో కొన్నింటిపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోకుండా కోర్టు అడ్డుకున్నది. దాంతో ప్రభుత్వం పరువు కాస్త కృష్ణానదిపాలవుతోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా కర్నూలు పోలీసులు చంద్రబాబునాయుడుపై క్రిమినల్ కేసుపెట్టారు. కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కు సంబంధించి ఎన్ 440 కే అనే ప్రమాదకర వేరియంట్ సోకిందని చంద్రబాబు మీడియా సమావేశంలో …

Read More »

కరోనా సంక్షోభంపై మోడిని దుమ్ముదులిపేసిన లాన్సెట్

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతికి నరేంద్రమోడి చేతకానితనమే ప్రధాన కారణమంటు ప్రముఖ లాన్సెట్ జర్నల్ దుమ్ముదులిపేసింది. ప్రపంచ మెడికల్ రంగంలో లాన్సెట్ అత్యంత ప్రాచుర్యం పొందిన జర్నల్. వివిధ దేశాల్లోని మెడికల్ రంగంలో జరుగుతున్న డెవలప్మెంట్లు, కొత్త వైద్య విధానాలు, లోపాలు, పరిష్కారాలను లాన్సెట్ జర్నల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుంది. ఇపుడా జర్నల్ తాజా సంచకిలో భారత్ లో పెరిగిపోతున్న కరోన సంక్షోభంపై తీవ్రస్ధాయిలో స్పందించింది. కరోనా వైరస్ కట్టడి …

Read More »

నిజంగానే మోడికి జగన్ భయపడుతున్నాడా ?

దేశంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఎవరైనా ఒకనేత ఓ విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పగానే వెంటనే దాన్ని ఖండిస్తునో లేదా ఆ ఖండనలకు వ్యతిరేకంగానో వెంటనే ట్వీట్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడింతా ఎందుకంటే నరేంద్రమోడి కేంద్రంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్-జగన్మోహన్ రెడ్డి-ఒడిస్సా ఎంపి సప్తగిరి ఉలాకా మధ్య జరుగుతున్న ట్వీట్లయుద్ధం మొదలైంది కాబట్టే. ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ నియంత్రణపై ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏపి, తెలంగాణా, జార్ఖండ్, …

Read More »

కమల్ కు దెబ్బ మీద దెబ్బ

తమిళనాడు ఎన్నికల తర్వాత కమలహాసన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మక్కళ్ నీది మయ్యుం (ఎంఎన్ఎం) పేరుతో కమల్ మూడేళ్ళ క్రితమే ఓ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. మొదటిసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పాల్గొంది. తాజా ఎన్నికల్లో 234 సీట్లకు గాను పార్టీ 150 చోట్ల పోటీచేసింది. అయితే ఒక్కరంటే ఒక్కరు కనీసం అధినేత కమల్ హాసన్ కూడా గెలవలేదు. మొదట్లో ధక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గంలో …

Read More »

ష‌ర్మిల ప‌ని అప్పుడే అయిపోయిందా ?

తెలంగాణ‌లో రెండు నెల‌లుగా రాజ‌కీయంగా ష‌ర్మిల కొత్త పార్టీ వార్త‌లు ఒక్కేట కాక‌రేపుతూ వ‌చ్చాయి. తాను ఎప్పుడు అయితే తెలంగాణ‌లో కొత్త పార్టీ పెడుతున్న‌ట్టు ఆమె ప్ర‌క‌టించారో అప్ప‌టి నుంచి తెలంగాణ‌లో ప్ర‌తి రోజూ ష‌ర్మిల పార్టీ వార్త‌లే ప‌తాక శీర్షిక‌ల్లో నిలిచాయి. ష‌ర్మిల కొత్త పార్టీలోకి ఎవ‌రెవ‌రు వెళ్లిపోతారు ? ఏం జ‌రుగుతుంది ? ఆ పార్టీ ఎక్క‌డ స్ట్రాంగ్‌గా ఉంది ? ష‌ర్మిల ఎక్క‌డ పోటీ చేస్తారు …

Read More »

జ‌గ‌న్.. ఇంత దెబ్బేస్తాడ‌నుకోలేదా ?

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు ఏమంత ఆశాజ‌న‌కంగా లేవు. ఒక్క అధికార పార్టీ త‌ప్ప‌.. మిగిలిన అన్ని పార్టీలూ కూడా అచేత‌నంగా ఉన్నాయి. నిజానికి చంద్ర‌బాబు హ‌యాంలో అయినా.. ఇత‌ర ఏ పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. మిగిలిన ప‌క్షాల‌ ప్ర‌భావం ఖ‌చ్చితంగా ఉండేది. “వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం” అనో.. లేక‌.. అధికార పార్టీ ప‌ని అయిపోయింది.. సో.. ఈ పార్టీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌నో.. చ‌ర్చ …

Read More »

తెలంగాణలో వ్యాక్సినేషన్ బంద్

గత నెల వరకు 45 ఏళ్లు పైబడ్డ వారికే వ్యాక్సిన్ వేస్తూ వచ్చారు. కానీ ఈ నెల ఒకటో తారీఖు నుంచి 18 ఏళ్లు పైబడ్డ వాళ్లకూ వ్యాక్సిన్ అంటూ ఘనంగా ప్రకటనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కొన్ని రోజుల ముందే రిజిస్ట్రేషన్ కూడా మొదలుపెట్టింది. కానీ ఈ ప్రకటనలన్నీ పేరుకే అని తేలిపోయింది. 45 ఏళ్లు పైబడ్డ వాళ్లకే సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోగా.. 18 ప్లస్ వాళ్లకు …

Read More »