శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన నిర్వహించిన యువశక్తి సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు జబర్దస్త్ ఫేం.. హైపర్ ఆది పంచ్‌ల ప్రభంజనం సృష్టించాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజాయితీపరుడైన నాయకుడని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరికీ ఒక గోల్ ఉందని, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని తాను భావిస్తున్నానని తెలిపాడు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని, చిన్న గాయం ఏ కార్యకర్తకైనా ఆయన తట్టుకోలేరని అన్నారు.
ఇక.. పంచ్‌ల విషయానికి వస్తే.. టేబుల్ మీదభారత దేశపు బొమ్మపెట్టుకుని, టేబుల్ కింద బారెడు చేయి చాపే మీది నిలకడ లేని రాజకీయం.. అభివృద్ధి గురించి ప్రెస్ మీట్‌లు పెట్టి.. అమ్మనాబూతులు తిట్టే మీది నిలకడ లేని రాజకీయం. అసలు 151 మంది.. ఒక్కడి నిజాయితీముందు భయపడడం రాజకీయం కాదు తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారిది నిలకడ లేని రాజకీయం కాదు.. నిఖార్సయిన రాజకీయం
అని హైపర్ ఆది పంచ్‌లతో ఇరగదీశాడు.
పవన్ కళ్యాణ్‌కు ఎందుకు అంత కోపం అని అంటారు. ఎందుకు రాదు.. మీ ఇంట్లో పెళ్లి ఆయన వస్తే.. గౌరవం వస్తుందని పిలిచి.. ఆయనను అవమానిస్తే.. కోపం రాదా? ఆయన పక్కన మీరు నిలబడితే.. మీ గౌరవం పెరుగుతుందని తెలిసి.. ఫొటోలు దిగి.. తర్వాత ఆయనే మీ పక్కన నిలబడ్డారని ప్రచారం చేస్తే కోపం రాదా?
అని పంచ్ లు కుమ్మేశాడు.
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ గెలుపొందాలని తాను ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ ప్రాంతంలో కులాలు, మతాలు లేవని అన్నారు. అందరినీ ఒక్కటిగానే చూస్తారని అన్నారు. నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా చేసిన అనుభవం పార్టీకి మరింత శోభను చేకూరుస్తుందన్నారు. నాగబాబు తన సోదరులపై ఈగవాలినా సహించరని, ఆయన ప్రత్యర్థులు చేసే విమర్శలకు పంచ్ లు ఇస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతున్నారని అన్నారు.