ఏపీ పోలీసుల‌ను చంద్ర‌ముఖిగా పోల్చిన చంద్ర‌బాబు..

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఏపీ పోలీసులను చంద్ర‌ముఖిగా అభివ‌ర్ణించారు. తాజాగా చంద్ర‌ముఖి హీరో ర‌జ‌నీ కాంత్‌.. బాబుతో భేటీ అయిన విష‌యం తెలిసిందే. ఈ భేటీకి మ‌రింత ప్రాధాన్యం ఇస్తూ.. దీనిని లైవ్‌లో చ‌ర్చ‌కు ఉంచేలా.. చంద్ర‌బాబు పోలీసుల‌పై చంద్ర‌ముఖి కామెంట్లతో విరుచుకు ప‌డ్డారు. గంగ.. చంద్ర‌ముఖిగా మారిన‌ట్టు.. ఏపీ పోలీసులు వైసీపీ కార్య‌క‌ర్త‌లుగా మారిపోయారు అని వ్యాఖ్యానించారు.

టీడీపీ నేత‌లు ఏ చిన్న ఉద్య‌మం చేయాల‌ని అనుకున్నా.. ఏచిన్న ధ‌ర్నా చేయాల‌ని అనుకున్నా.. వెంట నే పోలీసులు ఎంట్రీ ఇస్తున్నార‌ని.. త‌ప్పుడు కేసులు పెడుతున్నార‌ని తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. టీడీ పీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతూ.. పోలీసులే ఫిర్యాదుదారులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తా రు. రాను రాను కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారుతున్నారని ఆక్షేపించారు.

టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. కుప్పం, పుంగనూరు ఘటనల్లో కావాలనే తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆక్షేపించారు. మొదట్లో టీడీపీపై వైసీపీ వాళ్లు అక్రమ కేసులు పెడితే.. పోలీసులు అండగా నిలిచేవారని, ఇప్పుడు పోలీసులే తప్పుడు కేసులు పెట్టే బాధ్యతను తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు.

రజనీకాంత్ నటించిన సినిమాలో గంగ చంద్రముఖిగా మారినట్లు…రాష్ట్రంలో కొందరు పోలీసులు పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలుగా రూపాంతరం చెందిన క్రమం ఇది. మొదట్లో టీడీపీపై వైసీపీ అక్రమ కేసులకు అండగా నిలిచిన కొందరు పోలీసులు…ఇక ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టే బాధ్యత కూడా వాళ్ళే తీసుకున్నారు! అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.