ఎన్నికల వ్యూహకర్త అన్న పదానికి సరికొత్త ఇమేజ్ తీసుకురావటమే కాదు.. తాను అందించే సేవల కోసం కొమ్ములు తిరిగిన రాజకీయ అధినేతలు సైతం వెయిట్ చేసే సత్తా ఆయన సొంతం. మాటల్లో మాత్రమే కాదు చేతల్లోనూ చేసి చూపిస్తానన్న విషయాన్ని పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలతో మరోసారి ప్రూవ్ చేశారు. తన నోటి నుంచి ఏదైనా మాట వచ్చినా.. సవాలు విసిరినా.. గురి తప్పని రీతిలో లక్ష్యాన్ని చేధించే మేజిక్ ను …
Read More »బీజేపీకి డిపాజిట్ కూడా గల్లంతేనా ?
రెండు చోట్లా బీజేపీ పరిస్దితి ఏమిటో అర్ధమైపోయింది. తెలంగాణాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక, తిరుపతి లోక్ సభ ఉపఎన్నిలో పోటీచేసిన బీజేపీకి ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదు. రెండు చోట్లా విజయం తమదే అంటు ప్రచారంలో నానా గోలచేశారు. తెలంగాణాలో ఏమో కేసీయార్ కత చెప్పేస్తామంటు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎంతెంత గోలచేశారో. అలాగే తిరుపతి ఎన్నిక విషయంపై మాట్లాడుతు భగవద్గీత పార్టీ కావాలా ? బైబిల్ పార్టీ …
Read More »అట్టర్ ఫ్లాప్ అయిన ఎంఐఎం
అనేక రాష్ట్రాల ఎన్నికల్లో గణనీయంగా పుంజుకుంటున్న ఎంఐఎం ఈసారి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బీహార్ ఎన్నికలు, గుజరాత్ ఎన్నికలు అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేసి మంచి ఫలితాలనే సాధించింది. మరీ బీహార్ ఎన్నికల్లో అయితే గణనీయమైన విజయాలను కూడా సాధించింది. అదే ఊపులో ఇపుడు పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో కూడా పోటీచేసింది. ఏ రాష్ట్రంలో పోటీచేసినా ప్రధానంగా ముస్లిం మైనారిటి ఓట్లపైనే దృష్టిపెట్టింది. అదేపద్దతిలో ఇపుడు కూడా …
Read More »రికార్డు దిశగా మమత దీదీ
అందరి అంచనాలను పటాపంచలు చేస్తు పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రికార్డు సృష్టించే దిశగా పరుగులు పెడుతోంది. చివరి వార్తలు అందేటప్పటికి టీఎంసీ 202 సీట్లలో మెజారటితో దూసుకుపోతోంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలన్న దూకుడుతో రాజకీయాలు, ప్రచారం చేసిన బీజేపీ 88 సీట్ల మెజారిటిలో ఉంది. బెంగాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలుకాకముందే ఎలాగైనా మమతను ఓడించి బీజేపీ జెండాను ఎగరేయాలని నరేంద్రమోడి, అమిత్ షా ద్వయం చాలా కష్టపడ్డారు. అయితే …
Read More »తిరుపతి ఫలితం.. టీడీపీ నేతలను డిసైడ్ చేస్తుందా..?
తిరుపతిలో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమై పోయింది. దాదాపు 65 శాతం ఓటు బ్యాంకుతో వైసీపీ విజయం సాధిస్తుందని.. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విజయం దక్కించుకుంటారని ఎగ్జిట్ పోల్ ఫలితం వచ్చింది. అయితే.. ఇదే జరిగితే.. వైసీపీలో మార్పులు వస్తాయా ? పార్టీలో ఎలాంటి మార్పులు ఉంటాయి? ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుందా ? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న …
Read More »బాబు.. సీనియర్టీ టీడీపీకి పనిచేయడం లేదా ?
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తాను నోరు విప్పితే.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. అంతేకాదు.. తనకన్నా సీనియర్ నేత ఈ దేశంలో ఎవరూ లేరని కూడా చెబుతారు. మరి ఆయన సీనియార్టీ పార్టీ కోసం ఏమేరకు ఉపయోగ పడుతోంది? ఏమేరకు పార్టీని నడిపించేందుకు చంద్రబాబు వ్యూహాలు పనిచేస్తున్నాయి? అంటే.. ఏమీ లేదనే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు కూడా బాబు వ్యూహాలు ఏదీ కూడా వర్కవుట్ కాలేదు. …
Read More »డీఎంకేకి ఏకపక్ష విజయం కాదా ?
ఎన్నికలకు ముందు సర్వేలైనా, పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోలైనా చెప్పింది ఒకటే. తమిళనాడులో డీఎంకేకి పోలింగ్ ఏకపక్షంగానే ఉంటుందని. ఏ సర్వే చెప్పినా డీఎంకే 172 సీట్లలో విజయం ఖాయమని జోస్యం చెప్పాయి. కానీ కౌంటింగ్ మొదలైన తర్వాత చూస్తే మెజారిటిలు మరీ ఏకపక్షంగా లేవని స్పష్టమైపోతోంది. 234 సీట్లలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 124 సీట్లలో మెజారిటిలో ఉంది. ఇదే సమయంలో పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే కూటమి …
Read More »బెంగాల్లో విచిత్ర పరిస్ధితి
ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో జరిగినా యావత్ దేశం దృష్టిమాత్రం పశ్చిమబెంగాల్ పైనే ఉంది. హై ఓల్టేజీ పవర్ తో జరిగిన హోరా హోరీలో విచిత్రమైన పరిస్ధితి కనబడుతోంది. బెంగాల్లో మమతాబెనర్జీ-నరేంద్రమోడి మధ్య ప్రచారం హోరాహారీగా జరిగింది. కౌంటింగ్ మొదలైన తర్వాత వెలువడిన మెజారిటిలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏమిటంటే బీజేపీ మీద తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటితో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మమత మాత్రం వెనకబడ్డారు. బెంగాల్లో ఎన్నికలు ఒకఎత్తు …
Read More »ఇదంతా మోడిపై వ్యతిరేకతేనా ?
ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యవహారశైలిపై వ్యతిరేకత కర్నాటకలో బయటపడిందా ? అవుననే అనిపిస్తోంది క్షేత్రస్ధాయిలో జరిగింది చూస్తుంటే. కర్నాటకలో కొన్ని స్ధానిక సంస్ధలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బతినేసింది. మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటిలు, నగర పాలకసంస్ధలు కలిపి 163 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరిగితే 140 చోట్ల కాంగ్రెస్ బంపర్ మెజారిటితో గెలిచింది. జేడీఎస్ 66 చోట్ల గెలిస్తే, బీజేపీ మూడోస్ధానంతో 57 స్ధానాలకే పరిమితమైంది. ఇక్కడ …
Read More »త్రిశంకు స్వర్గంలో ఈటల..ఇంత అవమనామా ?
అవును తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీనియర్ నేత, మంత్రి ఈటల రాజేందర్ అత్యంత అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. భూకబ్జాలు, అధికార దుర్వినియోగం ముద్రవేసి ఈటల నుండి వైద్య, ఆరోగ్య శాఖలను తీసేశారు. ఆరోపణలు రావటం, విచారణకు ఆదేశించటం, చీఫ్ సెక్రటరీ, విజిలెన్స్ డీజీ వెంటనే విచారణ చేయించటం, భూకబ్జాలు నిజమే అని నిర్ధారించటం చకచక జరిగిపోయాయి. ఆ వెంటనే ఈటల నిర్వహిస్తున్న శాఖలను తీసేస్తున్నట్లు కేసీయార్ చేసిన సిఫారసును గవర్నర్ …
Read More »అప్పుడే మొదలైపోయిన సంబరాలు
అవును తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో సంబరాలు అప్పుడే మొదలైపోయాయి. ఎన్నికలకు ముందునుండే డీఎంకే అధికారంలోకి వస్తుందని మీడియా సంస్ధల సర్వేల్లో వెల్లడైంది. ఆ సర్వేల్లో ఏ సంస్ధలో కూడా ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని పొరబాటున కూడా రిజల్టు రాలేదు. దానికి తగ్గట్లే ఎగ్జిట్ పోలింగ్ సర్వేలో కూడా అన్నీ సంస్ధలు కూడా అధికారం డీఎంకేదే అని బల్లగుద్ది మరీ చెప్పేశాయి. దాంతో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తో …
Read More »గల్లా కుటుంబానికి ప్రభుత్వం షాక్
ప్రముఖ కంపెనీ అమరరాజా కంపెనీపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. కంపెనీ యాజమాన్యం ఊహించనిరీతిలో ప్రభుత్వం పెద్ద షాకే ఇఛ్చింది. చిత్తూరుకు సమీపంలోని అమరరాజా కంపెనీని మూసేయాలని కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులిచ్చింది. బ్యాటరీల తయారీలో కంపెనీ యాజమాన్యం కాలుష్య నియంత్ర నిబంధనలను ఉల్లంఘించిందని నోటీసులో స్పష్టంగా చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా, వాతావరణ కాలుష్యానికి కారణమైందన్న ఆరోపణలతో చిత్తూరులో యూనిట్ ను మూసేయాలని నోటీసిచ్చింది. కంపెనీ యాజమాన్యానికి చిత్తూరుతో పాటు తిరుపతి, కరకంబాడి, …
Read More »